- Home
- Entertainment
- నిర్మాతలకు చుక్కలు చూపిస్తున్న సమంత, రష్మిక మందన్న, పూజా హెగ్దే.. లెక్క లెక్కే అంటున్న స్టార్ హీరోయిన్స్..
నిర్మాతలకు చుక్కలు చూపిస్తున్న సమంత, రష్మిక మందన్న, పూజా హెగ్దే.. లెక్క లెక్కే అంటున్న స్టార్ హీరోయిన్స్..
టాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ సమంత, రష్మిక మందన్న, పూజా హెగ్దేలు నిర్మాతలకు షాక్ ఇచ్చే నిర్ణయాలు తీసుకుంటున్నారు. తెలుగు సినిమాలు పాన్ ఇండియన్ మూవీస్ గా రిలీజ్ అవుతున్న తరుణంలో హీరోయిన్స్ కూడా తగ్గెదే లే అంటున్నారు.

సమంత, రష్మిక మందన్న, పూజా హెగ్దేలు టాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ గా కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఏ పెద్ద చిత్రం వచ్చినా ఈ బ్యూటీలే కథనాయికలుగా ఎంపికవుతున్నారు. సౌత్ మొత్తం క్రేజ్ ఉన్న ఈ హీరోయిన్లు వారి రేంజ్ కు తగ్గట్టుగానే స్టార్ హీరోల సరసన నటిస్తూ మరింత పాపులారిటీని సొంతం చేసుకుంటున్నారు.
అయితే, ప్రస్తుతం టాలీవుడ్ నుంచి ఎక్కువగా పాన్ ఇండియన్ చిత్రాలే రిలీజ్ అవుతున్నాయి. మన హీరోలకు కూడా దేశ వ్యాప్తంగా మార్కెట్ పెరగడంతో ఇకపై వారి అన్ని చిత్రాలను పాన్ ఇండియన్ మూవీస్ గానే రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేసుకుంటున్నారు. సౌత్ నుంచి వస్తున్న భారీ చిత్రాలకు దేశ వ్యాప్తంగా మంచి గుర్తింపు దక్కుతుండటం విశేషం.
ఈ క్రమంలో స్టార్ హీరోలు ఎవరినీ కదిలించిన రూ. 30 కోట్ల నుంచి రూ. 100 కోట్ల వరకు రెమ్యూనరేషన్ డిమాండ్ చేస్తున్నారు. వారితో సినిమాలు చేయాలంటే వందల కోట్ల బడ్జెట్ ఖర్చు చేయాల్సిన పరిస్థితి నెలకొంది. నిర్మాతలకు ఇదోక సవాల్ గా మారింది. మరోవైపు మార్కెట్ లోనూ తెలుగు సినిమాకు ఆదరణ ఉండటంతో ప్రొడ్యూసర్లు ముందుకే వెళ్తున్నారు. అయితే తాజాగా హీరోయిన్లు కూడా తామూ తగ్గేదే లే అంటూ.. రెమ్యూనరేషన్ పెంచినట్టు తెలుస్తోంది.
టాలీవుడ్ అగ్ర కథనాయికల్లో సమంత రూత్ ప్రభు (Samantha) ఒకరు. స్టార్ హీరోయిన్ గా ఈ బ్యూటీ క్రేజ్ దేశ్యవాప్తంగా మామూలుగా లేదు. ‘పుష్ఫ’ చిత్రంలో సమంత ‘ఉ అంటావా..’సాంగ్ తో ప్రపంచ వ్యాప్తంగా క్రేజ్ సంపాదించుకుంది. సమంత కూడా పాన్ ఇండియన్ చిత్రాలు ‘యశోద’,‘శాకుంతలం’లో నటిస్తుండంతో రెమ్యూనరేషన్ పెంచేసినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. సినిమాను బట్టి రూ. 3 కోట్ల నుంచి రూ.5 కోట్ల వరకు డిమాండ్ చేస్తున్నట్టు సమాచారం.
ఆల్ ఇండియా క్రష్ గా పేరొందిన హీరోయిన్ రష్మిక మందన్న (Rashmika Mandanna). వరుస చిత్రాల్లో స్టార్ హీరోల సరసన నటిస్తూ.. అనతి కాలంలో ఎదిగిన హీరోయిన్ ఈమె. అయితే ఈ బ్యూటీ కూడా అటు బాలీవుడ్, ఇటు పాన్ ఇండియన్ చిత్రాల్లో నటిస్తుండటంతో రెమ్యూనరేషన్ లో తగ్గేదే లే అంటోందంటా.. ఈ బ్యూటీ కూడా రూ.3 కోట్ల నుంచి రూ.3.5 వరకు ఛార్జ్ చేస్తున్నట్టు టాక్ వినిపిస్తోంది. త్వరలోనే రూ.5 కోట్లు కూడా డిమాండ్ చేసే అవకాశాలున్నాయంట.
తన గ్లామర్, అభినయంతో సౌత్ ఆడియెన్స్ కు దగ్గరైన బ్యూటీ పూజా హెగ్దే (Pooja Hegde). పూజా ఈ ఏడాది మొత్తం తన సినిమాలతోనే సందడి చేసింది. వాటి ఫలితాలు అనుకూలంగా లేకపోయినా.. అమ్మడు క్రేజ్ ఏమాత్రం తగ్గడం లేదు. దీంతో బుట్టబొమ్మ కూడా రెమ్యూనరేషన్ లో నికచ్ఛిగా ఉంటోందంట. సినిమాకు రూ. 5 కోట్లకు తగ్గకుండా చూసుకుంటోందంట.