చిన్న సినిమాలు చింతలేని సినిమాలు, జోరు చూపిస్తున్న టాలీవుడ్ యంగ్ స్టార్స్
ఇప్పుడు ఎక్కడ చూసినా.. వందల కోట్ల బడ్జెట్ తో భారీ సినిమాలు కనిపిస్తున్నియ. బాలీవుడ్ -హాలీవుడ్ స్టార్ కాస్ట్ తో ఫారెన్ లోకేషన్లలో భారీ యాక్షన్ సీన్స్ తో మల్టీ లాంగ్వేజ్ లలో సినిమాలు తెరకెక్కిస్తున్నారు. కాని ఈసినిమాలకు గ్యారెంటీ ఉంటుందో లేదో తెలియదు కాని.. అద్భుతమైన కాన్సెప్ట్ తో.. చిన్న బడ్జెట్ తో తెరెక్కించే చిన్న సినిమాలు మాత్రం ఇంట్రస్టింగ్ ఫీల్ గుడ్ లవ్ స్టోరీస్ తో రాబోతున్నాయి.

ప్రస్తుతం వరసగా భారీ మాస్ యాక్షన్ సినిమాలు పాన్ ఇండియా వైడ్ గా రిలీజ్అవుతున్నాయి. ఈ పెద్ద సినిమాల మధ్యలో క్యూట్ రొమాంటిక్ మూవీస్ కూడా రిలీజ్ కు సై అంటున్నాయి. పెద్ద పెద్ద సినిమాల తలనొప్పుల మధ్య ప్రశాంతంగా ఓ చిన్న సినిమా చూడటానికి ఆడియన్స్ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. మరి పెద్ద సినిమాల మధ్యలో ముద్దుగా వస్తున్న రొమాంటిక్ మూవీస్ ఏంటో చూసేద్దాం.
టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్, మాలీవుడ్ ముద్దు గుమ్మ అనుపమపరమేశ్వరన్ జంటగా సుకుమార్ స్కూల్ నుంచి వస్తున్న మాంచి ఫీల్ గుడ్ లవ్ స్టోరీ 18పేజెస్. కుమారీ 24 ఎఫ్ ఫేమ్ విక్రమ్ డైరెక్షన్లో తెరకెక్కుతుంది ఈమూవీ. ఆడియన్స్ లో ఇంట్రెస్ట్ ను క్రియేట్ చేసిన18పేజెస్ మూవీ రిలీజ్ అయిన వీడియో ఆడియన్స్ ని బాగా ఇంప్రెస్ చేస్తోంది.
మాస్ కా దాస్ విష్వక్ సేన్..యూత్ ని, ఫ్యామిలీస్ ని టార్గెట్ చేస్తున్నారు. రొటీన్ మాస్ సినిమాలు కాకుండా సెన్సిబుల్ ఫీల్ గుడ్ స్టోరీ తో ధియేటర్లోకొస్తున్నారు. విష్వక్ సేన్ , రుక్సర్ జంటగా ప్రేమ, పెళ్లి కాన్సెప్ట్ లో తెరకెక్కిన సినిమా అశోక వనంలో అర్జున కళ్యాణం. ఈసినిమా మే 6న హాట్ సమ్మర్ లో కూల్ రొమాంటిక్ ఫీల్ ఇవ్వబోతోంది.
కుర్ర హీరోలలో ఈమధ్య ఎక్కువగా వినిపిస్తున్న పేరు సంతోష్ శోభన్. ఈ యంగ్ హీరో తో పాటు గౌరీ కిషన జంటగా తెరకెక్కుతున్న ఇంట్రస్టింగ్ లవ్ స్టోరీ .. శ్రీదేవి, శోభన్ బాబు. ఎటువంటి హడావిడి, ఆర్బాటాలు లేకుండా ప్రశాంత్ కుమార్ దిమ్మల డైరెక్షన్లో వస్తున్న ఈ యూత్ ఫుల్ క్రేజీ రొమాంటిక్ మూవీ ని మెగాస్టార్ పెద్ద కూతురు సుస్మిత నిర్మించారు
కెరీర్ స్టార్ట్ చేసిన దగ్గరనుంచి ఉప్పెన, కొండపొలం లాంటి ఇంటెన్స్ ఎమోషనల్ మూవీస్ చేసిన వైష్ణవ్ తేజ్ అవుట్ అండ్ అవుట్ లవ్ స్టోరీ చేస్తున్నారు. కేతిక శర్మ హీరోయిన్ గా గిరీశయ్య డైరెక్షన్లో తెరకెక్కుతున్న రంగరంగవైభవంగా సినిమా యూత్ ని టార్గెట్ చేసుకుని వస్తోంది. ఈ సినిమా జులై లో రిలీజ్ అవ్వబోతోంది.
ఈ మద్య వరుసగా యాక్షన్ సినిమాలు చేస్తున్నాడు నాగశౌర్య. హిట్ కోసం చాలా ఫార్ములాలను ఫాలో అయ్యాడు. కాని నిరాశే ఎదురవుతుంది యంగ్ స్టార్ కు. అయితే జస్ట్ ఫర్ ఎ ఛేంజ్ ...కంప్లీట్ రొమాంటిక్ మూవీ చేస్తే ఎలా ఉంటుంది అనుకున్నాడు. ఇక ఈ కొత్త ఫార్ములాతో ఆడియన్స్ ముందుకొస్తున్నారు. అనీష్ కృష్ణ డైరెక్షన్లో నాగశౌర్య, షెర్లీ జంటగా చేస్తున్న సినిమా కృష్ణ విృందావిహారి . రిలీజ్ కు ముస్తాబవుతున్న ఈమూవీ నుంచి రిలీజ్ అయిన ప్రమోషన్ వీడియోస్ ఆడియన్స్ లో సినిమాపై ఇంట్రెస్ట్ ను క్రియేట్ చేస్తున్నాయి.