ఎన్టీఆర్ వేసుకున్న షర్ట్ పై నెటిజన్ల కన్ను, కాస్ట్ ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే
డిఫరెంట్ ఐటమ్స్ కొనాలన్నా.. కాస్ట్లీ ఐటమ్స్ కొనాలన్నా..ముందుటాడు ఎన్టీఆర్. ఈ క్రమంలో ఆయన వాడుతున్న ప్రతీ వస్తువుపై ఓ కన్నేసి ఉంచుతున్నారు నెటిజన్లు.

ఈమధ్య సెలబ్రిటీలు ఏ వస్తువు వాడినా.. దాని కాస్ట్ ఎంతా అని చూస్తున్నారు నెటిజన్లు. అది ఏ బ్రాండో చూడటం.. ఆన్ లైన్ లో ఎంత కాస్ట్ ఉందో వెతకడం.. ఇదే పనిగా పెట్టుకున్నారు సోషల్ మీడియాజనాలు. తమ అభిమాన హీరో డిఫరెంట్ గా కాస్ట్లీగా ఏదైనా వాడితే చాలు.. అది వైరల్ చేసేస్తున్నారు. ఈక్రమంలో తారక్ ఫ్యాన్స్ కూడా అదే పనిలో ఉన్నారు.
ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఫారెన్ టూర్ లో ఉన్నారు. తారక్ ఫ్యామిలీతో కలిసి ఎంజాయ్ చేస్తున్నారు. అందుకు సంబంధించిన ఫోటోలు ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే.. ఉన్నాయి. ఇక ఫ్యాన్స్ వాటిని వైరల్ చేస్తూనే ఉన్నారు. ఈక్రమంలోనే ఎన్టీఆర్ ఫారెన్ లో ఉపయోగిస్తున్న ఫ్యాషన్ ట్రిక్స్ కు ఫిదా అవుతున్నారు అభిమానులు.
ఎన్టీఆర్ డ్రెస్సింగ్ స్టైల్ డిఫరెంట్ గా ఉంటుంది. ఆ విషయంలో ఎన్టీఆర్ కూడా చాలా కేర్ తీసుకుంటాడు. ఫారెన్ వెళ్ళాడు అంటే అక్కడ షాపింగ్ చేయాల్సిందే.. కాస్ట్లీ ఐటమ్స్ కొనాల్సిందే. ఈక్రమంలో ఆర్ ఆర్ ఆర్ ప్రమోషన్స్ వేసుకున్న బట్టలు కూడా ఫారెన్ లో కొన్నవే. ఈక్రమంలోనే తారక్ వేసుకున్న జర్కన్ ప్రస్తుతం వైరల్ అవుతుంది.
తాజాగా ఎన్టీఆర్… ఓ బ్లాక్ హుడీ లో చాలా స్టైలిష్ గా కనిపించాడు. రాల్ఫ్ లారన్.. అనే హుడి తారక్ వేసుకోవడం చూసిన ఫ్యాన్స్ దీని ధన ఆన్ లైన్ లో చెక్ చేశారు. ఇక అందరూ షాక్ అయ్యేలా దీని ధర ఏకంగా 65,407 ఉంది. ఈ షర్ట్ గురించి దాని ధర గురించి ప్రస్తుతం సోషల్ మీడియాలో డిస్కషన్స్ జరుగుతున్నాయి.
అంతే కాదు ఈ హుడిలో ఎన్టీఆర్ ఉన్న పిక్ ఇప్పుడు వైరల్ గా మారింది. ఎన్టీఆర్ కు డ్రెస్సులతో పాటు కార్లంటే చాలా ఇష్టం. ఒక రకంగా పిచ్చి అని చెప్పాలి. మార్కెట్ లోకి కొత్త కారు ఏది వచ్చినా.. వెంటనే కొనుగోలు చేసేస్తూ ఉంటాడు. ఇండస్ట్రీలో ఉన్న తన ఫ్రెండ్స్ తో ఆ కార్ లో రైడ్ లకు వెళ్తూ ఉంటాడు. ఆమధ్య తారక్ కొన్న కొత్త కారు రేటు కూడా వైరల్ అయ్యింది.
ఇలా ఎన్టీఆర్ సోషల్ మీడియాలు రకరకాలుగా వైరల్ అవుతుననాడు. నెట్టింట కూడా తన ఫాలోయింగ్ పెంచుకుంటున్నాడు. దానితో పాటు ఈ మధ్య తారక్ పిల్లలు అభయ్ రామ్, భార్గవ్ రామ్ లు కూడా సోషల్ మీడియాలో హాల్ చల్ చేస్తున్నారు. వారికి కూడా సెపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడింది. ఫ్యాన్స్ క్లబ్ లలో ఈ ఫోటోలు ఎక్కువగా వైరల్ అవుతున్నాయి. ఈక్రమంలో తారక్ లగ్జరీ లైఫ్ గురించి ప్రస్తుతం సోషల్ మీడియాలో పెద్ద చర్చ జరుగుతుంది.