ఈ హీరోయిన్లు హీరోలకు ధీటుగా ఎలా ఎదిగారు.. కారణం ఇదే!

First Published 21, Nov 2019, 9:20 AM IST

తెలుగు సినిమా ప్రారంభమయ్యాక ఎందరో నటీమణులు స్టార్ హోదా అందుకున్నారు. కానీ కొందరికి మాత్రం సూపర్ స్టార్ ఇమేజ్ సొంతం అయింది. అందుకు వారి ప్రతిభ మాత్రమే కారణం. టాలీవుడ్ లో స్టార్స్ గా ఎదిగిన కొందరు హీరోయిన్లు హీరోలకు ధీటుగా రాణించారు. 

కాంచనమాల: తెలుగు సినిమా ప్రారంభమైన తర్వాత మొట్టమొదట స్టార్ అనిపించుకున్న నటి కాంచనమాల. కాంచనమాల 1930లోనే నటిగా మారింది. మాలపిల్ల, బాలనాగమ్మ లాంటి చిత్రాల్లో నటించారు.

భానుమతి : 1939లో నటిగా మారిన భానుమతి తక్కువ సమయంలోనే తెలుగులో స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. అప్పట్లోనే ఎన్టీఆర్, ఏఎన్నార్ లాంటి హీరోలతో సమానంగా ఆమె రెమ్యునరేషన్ ఉండేదట.

అంజలి దేవి: తన ఎమోషనల్ ఫెర్ఫామెన్స్ తో అంజలి ప్రతి ఒక్కరి మన్ననలు పొందారు. లవకుశ చిత్రంలో అంజలి దేవి నటనని ఎప్పటికి మరిచిపోలేం.

సావిత్రి: సావిత్రి తన అద్భుత నటనతో స్టార్ హీరోయిన్ స్థాయి నుంచి మహానటి అని పిలిపించుకునే స్థాయికి ఎదిగారు. ఎన్టీఆర్, ఏఎన్నార్ లతో కలసి ఆమె ఎన్నో అద్భుతమైన చిత్రాల్లో నటించారు. కొన్ని దశాబ్దాల పాటు తెలుగు చిత్ర పరిశ్రమలో సావిత్రి ప్రస్థానం తిరుగులేనివిధంగా సాగింది.

వాణిశ్రీ : వాణిశ్రీ నటనతో పాటు గ్లామర్ క్వీన్ గా ఓ వెలుగు వెలిగింది. అప్పట్లో వాణిశ్రీ స్టైల్ మహిళలని విపరీతంగా ఆకర్షించింది. దసరాబుల్లోడు చిత్రం వాణిశ్రీ క్రేజ్ ని అమాంతం పెంచేసింది.

శ్రీదేవి : ఇండియా మొత్తం లేడీ సూపర్ స్టార్ అని పిలిపించుకున్న నటి శ్రీదేవి. ఎన్టీఆర్, ఎన్నార్ తో పాటు ఆ తర్వాతి తరం  హీరోలైన చిరంజీవి, నాగార్జున, వెంకటేష్ సరసన కూడా నటించింది. బాలీవుడ్ లో కూడా శ్రీదేవి తిరుగులేని ఇమేజ్ సొంతం చేసుకుంది.

విజయశాంతి: హీరోయిన్ అంటే 6 పాటలు, నాలుగు సన్నివేశాలు అనే మూస ధోరణికి ముగింపు పలికిన నటి విజయశాంతి. హీరోయిన్లుగా కూడా ఫైట్స్ చేయగలరు అని విజయశాంతి నిరూపించి కర్తవ్యం చిత్రంతో జాతీయ అవార్డు సొంతం చేసుకుంది. ఓ దశలో విజయశాంతి క్రేజ్ టాలీవుడ్ టాప్ హీరోలు చిరంజీవి, బాలయ్యతో సమానంగా సాగింది.

సౌందర్య: సౌందర్య ఇండస్ట్రీలోకి అడుగుపెట్టే సమయానికి చాలా మంది గ్లామర్ హీరోయిన్లు ఉన్నారు. అంత పోటీలో కూడా సౌందర్య గ్లామర్ రోల్స్ కు ఆమడ దూరంలో ఉండేది. హోమ్లీ లుక్స్ తో ఫ్యామిలీ ఆడియన్స్ ని కట్టిపడేసిన సౌందర్య టాలీవుడ్ లో అగ్రస్థానానికి చేరుకుంది. కెరీర్ పీక్స్ లో ఉన్న సమయంలోనే హెలికాఫ్టర్ ప్రమాదంలో సౌందర్య మరణించారు.

అనుష్క : అనుష్క గ్లామర్ హీరోయిన్ గానే చిత్ర పరిశ్రమకు పరిచయం అయింది. కానీ తన నటనతో సౌత్ లో లేడీ సూపర్ స్టార్ గా ఎదిగింది. అనుష్క సోలో హీరోయిన్ గా నటించే చిత్రాలకు మాత్రమే 30 కోట్ల వరకు మార్కెట్ ఉందంటే ఆమె క్రేజ్ అర్థం చేసుకోవచ్చు.

నయనతార : వన్నె తరగని అందంతో నయనతార రోజు రోజుకు తన ఇమేజ్ పెంచుకుంటూ పోతోంది. ప్రస్తుతం సౌత్ లో అత్యధిక రెమ్యునరేషన్ అందుకుంటున్న హీరోయిన్ నయనతార.

loader