- Home
- Entertainment
- తెలుగులో బెస్ట్ సీక్వెల్స్ గా నిలిచిన చిత్రాలివే.. రాబోతున్న సీక్వెల్స్ పైనా భారీ అంచనాలు.. డిటేయిల్స్.!
తెలుగులో బెస్ట్ సీక్వెల్స్ గా నిలిచిన చిత్రాలివే.. రాబోతున్న సీక్వెల్స్ పైనా భారీ అంచనాలు.. డిటేయిల్స్.!
టాలీవుడ్ చిత్రాలపై భారీ అంచనాలు నెలకొంటున్నారు. ముఖ్యంగా తెలుగులో సీక్వెల్ గా నిర్మిస్తున్న సినిమాలు మంచి విజయాలను సాధిస్తున్నారు. ప్రస్తుతం రూపుదిద్దుకుంటున్న సీక్వెల్స్ పైనా భారీగానే అంచనాలు నెలకొన్నాయి.

క్రియేట్ దర్శకుడు సుకుమార్ - ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కాంబినేషన్ లో వచ్చిన చిత్రం ‘ఆర్య’. 2004లో వచ్చిన ఈ రొమాంటిక్ యాక్షన్ ఫిల్మ్ మంచి సక్సెస్ ను అందుకుంది. ఆ తర్వాత ఐదేండ్లకు వచ్చిన ‘ఆర్య 2’ (Arya 2) మరింత విజయాన్ని సాధించింది. ఇప్పటి వరకు రొమాంటిక్ లో వచ్చిన బెస్ట్ సీక్వెల్ గా ‘ఆర్య 2’ నిలవడం విశేషం. నేటికీ ఈ చిత్రంపై సినీ ప్రియులకు మక్కువ తగ్గకపోవడం విశేషం.
దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి - రెబల్ స్టార్ ప్రభాస్ కాంబినేషన్ లో వచ్చిన ‘బాహుబలి’ (Baahubali) ఎంతటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో తెలిసిందే. దీంతో తర్వాత వచ్చిన సీక్వెల్ ‘బాహుబలి : ది కన్ క్లూజన్’ కూడా ప్రపంచ వ్యాప్తంగా తెలుగు సినిమా సత్తాను చాటింది. అలాగే బాక్సాఫీస్ వద్ద కూడా కాసుల వర్షం కురిపించిన ఈ సీక్వెల్ ప్రపంచ వ్యాప్తంగా హ్యయేస్ట్ గ్రాసింగ్ సెకండ్ ఇండియన్ ఫిల్మ్ గా రికార్డు క్రియేట్ చేసింది.
తాజాగా థియేటర్లలో సందడి చేస్తున్న ‘కార్తీకేయ 2’ (Karthikeya 2) కూడా బెస్ట్ తెలుగు సీక్వెల్ ఫిల్మ్ గా నిలిచింది. హిట్ టాక్ తో దూసుకుపోతున్న ఈ చిత్రం గతంలో వచ్చిన ‘కార్తీకేయ’కు సీక్వెల్. మైథలాజికల్ ఫిల్మ్ గా వచ్చిన సినిమా ప్రస్తుతం తెలుగు రాష్ట్రాలు, బాలీవుడ్ తో పాటు ఓవర్సీస్ లోనూ కాసుల వర్షం కురిపిస్తోంది. తాజా సమాచారం ప్రకారం.. ఈ చిత్రం వారం రోజుల్లోనే రూ.70 కోట్లకుపైగా గ్రాస్ ను కలెక్ట్ చేసినట్టు తెలుస్తోంది.
ఇప్పటికే ‘పుష్ఫ : ది రైజ్’ చిత్రం సెన్సేషన్ క్రియేట్ చేసింది. ప్రస్తుతం దీనికి సీక్వెల్ గా ‘పుష్ఫ : ది రూల్’ (Pushpa The Rule)ను తెరకెక్కిస్తున్నారు దర్శకుడు సుకుమార్. మొదటి పార్ట్ ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా సెన్సేషన్ క్రియేట్ చేయడంతో వచ్చే సీక్వెల్ పైనా భారీ అంచనాలు నెలకొన్నాయి. త్వరలోనే సీక్వెల్ సెట్స్ పైకి వెళ్లనుంది.
అలాగే చాలా కాలం తర్వాత రీసెంట్ గా ‘బింబిసార’ (Bimbisara)తో మంచి సక్సెస్ ను అందుకున్నారు నందమూరి కళ్యాణ్ రామ్. ఆయన కేరీర్ లోనే ఈ చిత్రం ఉత్తమంగా నిలిచింది. ప్రేక్షకుల ఆదరణ పొందిన ఈ మూవీకి సీక్వెల్ కూడా రానుంది. ఈ చిత్రానికి వచ్చిన రెస్పాన్స్ తో ఆడియెన్స్ లో ‘బింబిసార 2’పైనా అంచనాలు నెలకొన్నాయి. అందుకు తగ్గట్టుగానే సీక్వెల్ ను తెరకెక్కిస్తామని మేకర్స్ ఇప్పటికే హామీనిచ్చారు.