- Home
- Entertainment
- Eesha Rebba: కుర్రాళ్లపై తెలుగు భామ అందాల దాడి.. తుపాకి ఎక్కుపెట్టి హృదయాలను టార్గెట్ చేస్తూ రచ్చ..
Eesha Rebba: కుర్రాళ్లపై తెలుగు భామ అందాల దాడి.. తుపాకి ఎక్కుపెట్టి హృదయాలను టార్గెట్ చేస్తూ రచ్చ..
డస్కీ బ్యూటీ ఈషా రెబ్బా కవ్వింపులు మామూలుగా ఉండవు. చిలిపిగా ఆమె చేసే అల్లరి అంతా ఇంతా కాదు. క్యూట్ ఎక్స్ ప్రెషన్స్ తో హాట్ అందాలతో నెటిజన్లకి పిచ్చెక్కిస్తుంది. తన చుట్టూ తిప్పుకుంటుంది.

ఈషా రెబ్బా లేటెస్ట్ గా తన హాట్ అందాల విందుకి తెరలేపింది. ఓ వైపు కట్ అయినా టాప్‌లో ఎద అందాలను చూపిస్తూ రెచ్చగొడుతుంది. అంతేకాదు తుపాకీ ఎక్కుపెట్టింది. కుర్రాళ్ల హృదయాలే టార్గెట్‌గా అందాల తూటా పేల్చింది. దీంతో ప్రస్తుతం ఈ అమ్మడు హంగామా ఇంటర్నెట్‌లో మామూలుగా లేదని చెప్పొచ్చు.
ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ఓ వీడియోని షేర్ చేసుకుంది ఈషా. ఈ వీడియోలో ఆమె చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. ఓ వైపు ఎద అందాలను చూపిస్తూ కసిగా, కొంటెగా, చిలిపిగా ఈ బ్యూటీ ఇచ్చిన సెక్సీ పోజులు నెటిజన్లకి నిద్ర లేకుండా చేస్తున్నాయి. ప్రస్తుతం అది వైరల్ అవుతుంది. ఈ సందర్భంగా ఈషా పిక్స్ సైతం నెట్టింట సందడి చేస్తున్నాయి.
గ్లామర్‌కి కేరాఫ్‌గా నిలిచే ఈషా రెబ్బా ఇలా అందాల విందు వడ్డించడంతో ఆమె అభిమానులు సంబరపడుతున్నారు. వీకెండ్ ముందుగానే వచ్చిందంటూ సెలబ్రేట్ చేసుకున్నారు. ఆమె ఫోటోలను పంచుకుంటూ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. వేడి వేడి అందాలకు ముగ్దులవుతున్నారు.
ఈషా రెబ్బా టాలీవుడ్‌లో హీరోయిన్‌గా రాణిస్తుంది. చిన్న చిన్న సినిమాలకే పరిమితం అయ్యిందీ భామ. పెద్ద సినిమాల్లో అవకాశాలు రాకపోవడం బాధాకరం. ఎన్ని ప్రయత్నాలు చేసినా ఒకటి అర ఓ మోస్తారు బడ్జెట్ సినిమాలే తప్ప. పెద్ద సినిమాలు రావడం లేదు. అందుకు తెలుగు హీరోయిన్ కావడం వల్లే అని వాపోతుంది ఈషా రెబ్బా.
తెలుగు హీరోయిన్లు అందాలు ఆరబోయరు, వారిని మరింత గ్లామర్‌గా చూపించలేం అనే భావన మేకర్స్ లో ఉంటుందనే కామెంట్ వినిపిస్తుంది. అదే సమయంలో తమకి కావాల్సిన కంఫర్ట్స్ తెలుగు హీరోయిన్లలో దొరకదనే భావన కూడా ఉంది. అందుకే మేకర్స్ ఇతర భాషల హీరోయిన్లని ఎంకరేజ్ చేస్తుంటారని టాక్.
దీని కారణంగా ఉన్న ప్రతిభ ఉన్న తెలుగు హీరోయిన్లు కూడా ఆదరణకు నోచుకోలేకపోతున్నారు. రాణించలేకపోతున్నారు. అందాలు ఆరబోసేందుకు ఈషా రెబ్బా సిద్ధమే అని చాలా సార్లు చెప్పింది. కానీ మేకర్స్ పట్టించుకోకపోవడం మరింత బాధాకరం. అయినా ఏమాత్రం నిరాశ చెందకుండా ఓటీటీ ఫిల్మ్స్, ఇతర భాషా చిత్రాలపై ఫోకస్ పెట్టింది ఈషా రెబ్బా. వచ్చిన ప్రతి ఛాన్స్ ని ఉపయోగించుకుని మనుగడ కోసం పోరాడుతుంది.
`అంతకు ముందు ఆ తర్వాత`, `అమీతుమీ` వంటి విజయాలు వచ్చినా ఈషాకి పెద్ద హీరోల సినిమాల్లో ఛాన్స్ లు రావడం లేదు. `అరవింద సమేత`లో సెకండ్ హీరోయిన్‌గా ఛాన్స్ ఇచ్చారు. కానీ అందులో ఆమె పాత్రకి ఏమాత్రం ప్రయారిటీ లేకపోవడంతో గుర్తింపు రాలేదు.
`దర్శకుడు`, `అ`, `బ్రాండ్‌బాబు`, `సుబ్రమణ్యపురం`, `రాగల 24గంటల్లో`, `పిట్టకథలు`, `మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్` వంటి చిత్రాల్లో మెరిసింది ఈషా. ప్రస్తుతం తమిళం, మలయాళంలో `ఒట్టు` అనే ఓ బైలింగ్వల్ చిత్రం చేస్తుంది.దీంతోపాటు `అయిరామ్ జెన్మంగల్`అనే తమిళ సినిమాలో నటిస్తుంది ఈషా రెబ్బా.