- Home
- Entertainment
- తాగేసి 30 మంది నాపై అటాక్.. బిగ్ బాస్ కౌశల్ లాంటి వ్యక్తుల వల్లే కమిట్మెంట్ మూవీ, తేజస్వి షాకింగ్ కామెంట్స్
తాగేసి 30 మంది నాపై అటాక్.. బిగ్ బాస్ కౌశల్ లాంటి వ్యక్తుల వల్లే కమిట్మెంట్ మూవీ, తేజస్వి షాకింగ్ కామెంట్స్
యంగ్ అండ్ బోల్డ్ బ్యూటీ తేజస్వి మడివాడ నటించిన తాజా చిత్రం 'కమిట్మెంట్'. శృంగారం, మహిళలపై జరుగుతున్న లైంగిక వేధింపుల నేపథ్యంలో ఈ చిత్రం తెరకెక్కింది.

యంగ్ అండ్ బోల్డ్ బ్యూటీ తేజస్వి మడివాడ నటించిన తాజా చిత్రం 'కమిట్మెంట్'. శృంగారం, మహిళలపై జరుగుతున్న లైంగిక వేధింపుల నేపథ్యంలో ఈ చిత్రం తెరకెక్కింది. ఆగష్టు 19న ఈ చిత్రాన్ని రిలీజ్ చేశారు. దీనితో తేజస్వి వరుసగా ఇంటర్వ్యూలలో పాల్గొంటూ తన చిత్రాన్ని ప్రమోట్ చేస్తోంది.
ఈ చిత్రంలో శృంగార సన్నివేశాలు, అసభ్యకరమైన డైలాగుల కారణంగా తేజస్వి ఇటీవల ట్రోలింగ్ కూడా ఎదుర్కొంది. లక్ష్మీ కాంత్ చెన్న దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కింది. తాజాగా తేజస్వి మదివాడ ఓ ఇంటర్వ్యూలో ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ సమస్య, తనపై జరిగిన దాడుల గురించి ప్రస్తావించింది.
ఇండస్ట్రీలో అమ్మాయిలకు ఎలాంటి సంఘటనలు ఎదురవుతాయి అనేందుకు ఇది ఒక ఉదాహరణ అని తేజస్వి పేర్కొంది. ఒకసారి నేను ఈవెంట్ నుంచి ఇంటికి వెళుతున్నాయి. బాగా రాత్రి అయింది. ఆ టైంలో 30 మంది తాగేసి వచ్చి నాపై దాడికి ప్రయత్నించారు. అంతమంది అటాక్ చేయడంతో తప్పించుకోవడం కష్టంగా మారింది. కానీ ఎలాగోలా తప్పించుకుని ఇంటికి వెళ్ళాను.
ఆ సంఘటన తలుచుకుని రాత్రంతా ఏడుస్తూ ఉన్నాను అని తేజస్వి పేర్కొంది. ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ నాకు కూడా ఎదురైంది. కొందరు ఫోన్ చేసి కమిట్మెంట్ అడుగుతారు. కొందరు మాటలతో చెప్పరు. కాయాన్ని వాళ్ళ చూపులోనే ఏదో ఆశిస్తున్నారని అర్థం అవుతుంది.
కేవలం చిత్ర పరిశ్రమలో మాత్రమే కాదు.. అన్ని రంగాల్లో కాస్టింగ్ కౌచ్ ఉంది అని తేజస్వి పేర్కొంది. సోషల్ మీడియా వల్ల అన్ని విషయాలు ఇప్పుడు బయటకి వస్తున్నాయి అని తేజస్వి పేర్కొంది. తేజస్వి బిగ్ బాస్ షోలో కూడా పాల్గొన్న సంగతి తెలిసిందే. అయితే బిగ్ బాస్ వల్ల తనకు ఒరిగింది ఏమీ లేదు అంటూ తేజస్వి షాకింగ్ కామెంట్స్ చేసింది.
బిగ్ బాస్ లో నా క్యారెక్టర్ బయట పడింది. ఉన్నది ఉన్నట్లు మాట్లాడేస్తాను. దీనితో ఈ అమ్మాయి గొడవలు పెట్టుకుంటుంది అనే మెసేజ్ వెళ్ళింది. దీనితో ఉన్న ఆఫర్స్ కూడా పోయినట్లు తేజస్వి కామెంట్స్ చేసింది. ఇక కమిట్మెంట్ చిత్రం గురించి మాట్లాడుతూ ట్రైలర్స్, పోస్టర్స్ లో చూసి ఇది అంతా బూతు చిత్రం అని మాత్రం భావించవద్దు అని తెలిపింది. ఈ మూవీలో ఎమోషనల్ మెసేజ్ కూడా ఉన్నట్లు పేర్కొంది.
బిగ్ బాస్ 2 విన్నర్ కౌశల్ ప్రస్తావన రాగానే.. తేజస్వి తీవ్ర వ్యాఖ్యలతో విరుచుకుపడింది. అమ్మాయిలని బదనాం చేసి ముందుకు వెళ్ళాలనే మనస్తత్వం అతడిది. కౌశల్ గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత బెటర్. దర్శకుడు నాకు కమిట్మెంట్ కథ చెప్పగానే.. ఇది ఇండస్ట్రీలో కౌశల్ లాంటి వ్యక్తుల గురించే అని అనిపించింది. అతడిపై రివేంజ్ లాగా అనిపించినట్లు తేజస్వి పేర్కొంది. బిగ్ బాస్ లో అతడి ప్రవర్తన అంతా ఫేక్ అని ఇప్పుడు ఆయన గురించి అందరికి తెలుసు అని తేజస్వి సంచలన వ్యాఖ్యలు చేసింది.