రేప్ చేసి, ఆ వీడియోలతో బ్లాక్ మెయిల్.. సినీ నిర్మాత అరెస్టు
అత్యాచార వీడియోను సోషల్ మీడియా సైట్లలో పెట్టకుండా రూ.5 లక్షలు ఇవ్వాలని బెదిరింపులకి
- FB
- TW
- Linkdin
Follow Us
)
సినిమాల్లో వెలిగిపోదామని నమ్మి హైదరాబాద్, చెన్నై, ముంబై ఇలా వచ్చే చాలా మంది మోసపోతూండటం వింటూంటాం. చూస్తూంటాం. ఈ వార్తలన్నీ మీడియాలో వస్తూంటాం. అయినా సరే జాగ్రత్తలు తీసుకోకుండా వచ్చి దెబ్బ తినేవాళ్లు కనపడుతూంటారు. తాజాగా మరో కేసు చెన్నైలో నమోదు అయ్యింది. సినిమా నిర్మాత ఒకరు...తమ దగ్గరకు వచ్చిన ఓ అమ్మాయిని మోసం చేసారు.
వివరాల్లోకి వెళితే... చెన్నై కొళత్తూర్‌కి చెందిన మొహ్మద్ అలీ సినీ నిర్మాత. అతను చెన్నై కీళ్‌అయనంబాక్కంలో ఆఫీస్ నడుపుతున్నాడు. అందులో గతేడాది సెప్టెంబర్‌లో కొరట్టూర్‌కి చెందిన యువతి పనిలో చేరింది. ఆమె సినిమాలపై ఆశతో చెన్నైకు వచ్చింది. బ్రతుకు తెరవు కోసం ఈ సినిమా ఆఫీస్ లో పనికి చేరింది. ఈ విషయం తెలుసుకున్న నిర్మాత ఆమెను మోసం చేసారు.
ఈ నేపథ్యంలో 28 సంవత్సరాల ఆ అమ్మాయి అంబత్తూర్ ఆల్ ఉమెన్ పోలీస్‌స్టేషన్‌లో నిర్మాత మొహ్మద్ అలీపై ఫిర్యాదు చేసింది. మొహ్మద్ అలీ తనకు వివాహమైన విషయాన్ని దాచి, తనను ప్రేమిస్తున్నానని, పెళ్లి చేసుకుంటానని మాయమాటలు చెప్పాడని, తనకు కూల్‌డ్రింక్స్‌లో మత్తుమందు కలిపి అత్యాచారం చేసి, వీడియో రికార్డ్ చేసినట్లు తెలిపింది.
అలాగే తాను గర్భం దాల్చడంతో విటమిన్ మాత్రలు అని చెప్పి అబార్షన్ మాత్రలు ఇచ్చాడని, విషయం బయటకు చెబితే చంపేస్తానని బెదిరించినట్లు పేర్కొంది. తాను గత సెప్టెంబర్ నుంచి అతని వద్ద పనిచేస్తున్నట్లు చెప్పింది. అతన్ని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేసింది.
gang rape mp
అదేవిధంగా అత్యాచార వీడియోను సోషల్ మీడియా సైట్లలో పెట్టకుండా రూ.5 లక్షలు ఇవ్వాలని బెదిరింపులకి పాల్పడుతున్నట్లు తెలిపింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేయగా ఆమె ఆరోపణలు నిజమని తేలడంతో మొహ్మద్ అలీని అరెస్టు చేశారు.