వల్గర్, లాజిక్ లేని చిత్రాలకు అవార్డులు అంటూ తెలుగు సినిమాపై ట్రోలింగ్.. సూర్యకి అన్యాయం జరిగిందా ?
గురువారం రోజు ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్ కాస్టింగ్ మంత్రిత్వ శాఖ నేషనల్ అవార్డ్స్ జ్యూరి మెంబర్స్ తో కలసి 69వ జాతీయ చలన చిత్ర అవార్డుని ప్రకటించింది. నేషనల్ ఫిలిం అవార్డ్స్ లో తెలుగు సినిమా హవా స్పష్టంగా కనిపించింది.
గురువారం రోజు ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్ కాస్టింగ్ మంత్రిత్వ శాఖ నేషనల్ అవార్డ్స్ జ్యూరి మెంబర్స్ తో కలసి 69వ జాతీయ చలన చిత్ర అవార్డుని ప్రకటించింది. నేషనల్ ఫిలిం అవార్డ్స్ లో తెలుగు సినిమా హవా స్పష్టంగా కనిపించింది. పుష్ప చిత్రానికి రెండు జాతీయ అవార్డులు, ఆర్ఆర్ఆర్ చిత్రానికి 6 అవార్డులు, ఉప్పెన చిత్రానికి ఒక అవార్డు దక్కింది. జాతీయ ఉత్తమ నటుడి అవార్డు కూడా తెలుగు హీరో అల్లు అర్జున్ కే దక్కడం విశేషం.
చరిత్రని తిరగరాస్తూ అల్లు అర్జున్ జాతీయ ఉత్తమ నటుడిగా అవతరించాడు. ఈ అవార్డుకి అల్లుఅర్జున్ పూర్తి
ఎందుకంటే నేషనల్ అవార్డు జ్యూరీ సభ్యులు సూర్య జై భీమ్, ధనుష్ కర్ణన్ లాంటి విమర్శకుల ప్రశంసలు అందుకున్న చిత్రాలని పూర్తిగా పక్కన పెట్టేశారు. దీనికి గల కారణాలు అంతుచిక్కడం లేదు. జై భీమ్ చిత్రం ఆస్కార్ అవార్డ్స్ సమయంలో కూడా హాట్ టాపిక్ గా నిలిచింది. ఈ చిత్రం ఆస్కార్ నామినేషన్స్ లో ఎంట్రీ ఇస్తుందని అప్పట్లో భావించారు. కానీ మిస్ అయింది.
వివక్ష అంశంపై టిజి జ్ఞానవేల్ ఎంతో అద్భుతంగా జై భీమ్ చిత్రాన్ని రూపొందించారు. ఈ చిత్రానికి పలు జాతీయ అవార్డులు ఖాయం అని అనుకున్నారు. మరోసారి సూర్య జాతీయ ఉత్తమ నటుడు అవుతాడని తమిళులు భావించారు. కానీ ఈ చిత్రాన్ని జ్యూరీ సభ్యులు పట్టించుకోలేదు.
గత ఏడాదే సూర్య ఆకాశం నీ హద్దురా చిత్రంతో జాతీయ ఉత్తమ నటుడిగా అవార్డు అందుకున్నారు. దీనితో వరుసగా రెండవ ఏడాది కూడా ఒకే నటుడికి జాతీయ అవార్డు ఇవ్వడం కుదరదనే అభిప్రాయం వినిపిస్తోంది. అయితే మిగిలిన విభాగాల్లో ఈ చిత్రానికి ఎందుకు అవార్డు లభించలేదు? కర్ణన్ లాంటి చిత్రాన్ని కూడా జ్యూరీ ఎందుకు విస్మరించింది అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
ఈ నేపథ్యంలో తమిళ ప్రేక్షకులు తెలుగు సినిమాపై ట్రోలింగ్ తో విరుచుకుపడుతున్నారు. పుష్ప లాంటి వల్గారిటీ ఉన్న చిత్రానికి, లాజిక్ లేని ఇతర తెలుగు చిత్రాలకు అవార్డులు ఇచ్చారు. కానీసహజసిద్ధమైన నటనతో, భావోద్వేగాలతో ఆకట్టుకున్న జైభీమ్ చిత్రానికి మాత్రం మొండిచేయి చూపారు అంటూ తమిళ ఆడియన్స్ ట్రోల్ చేస్తున్నారు.
బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్ విభాగంలో మిమి చిత్రానికి గాను పంకజ్ త్రిపాఠికి అవార్డు లభించింది. నిజాయతీగా ఆలోచిస్తే ఆ వార్డు జైభీమ్ చిత్రంలో మణికందన్ నటనకి దక్కాలి అని అంటున్నారు. మరికొందరు తమిళ ఆడియన్స్ టాలీవుడ్ వాళ్ళకి బిజెపితో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. కాబట్టే అవార్డులన్నీ వాళ్ళకే దక్కాయి అంటూ విమర్శిస్తున్నారు.