- Home
- Entertainment
- సెట్‌లో మీడియా ముందు సుస్మితా సేన్‌ని తీవ్ర అవమానం.. నీకు యాక్టింగ్ రాదంటూ స్టార్ డైరెక్టర్ ఫైర్..
సెట్‌లో మీడియా ముందు సుస్మితా సేన్‌ని తీవ్ర అవమానం.. నీకు యాక్టింగ్ రాదంటూ స్టార్ డైరెక్టర్ ఫైర్..
మాజీ మిస్ యూనివర్స్, బాలీవుడ్ అందాల తార సుస్మితా సేన్.. కెరీర్ ప్రారంభంలో తాను ఫేస్ చేసిన అవమానాన్ని బయటపెట్టింది. సెట్‌లో మీడియా ముందు స్టార్ డైరెక్టర్ ఎంతగా అవమానించాడో ఆమె వెల్లడించింది.

sushmita sen
మాజీ మిస్ యూనివర్స్, అందాల తార సుస్మితా సేన్.. ప్రపంచ అందగత్తెగా నిలిచి సంచలనంగా మారితే, ఆ తర్వాత సినిమాల్లోనూ సంచలనాలకు కేరాఫ్‌గా నిలిచింది. నటన రాదనే అవమానాల నుంచి అనేక అవార్డుల కూడా దక్కించుకుంది. దశాబ్దన్నర పాట బాలీవుడ్‌ని ఏలింది. తన మార్క్ ని చాటుకుంది. తాజాగా తాను నటిగా ఎంట్రీ ఇచ్చిన ప్రారంభంలో ఎదుర్కొన్న అవమానాలను సుస్మితా సేన్ బయటపెట్టింది. ఏకంగా సినిమా షూటింగ్ సెట్‌లో అందరి ముందు స్టార్ డైరెక్టర్ అవమానించిన తీరుని వెల్లడించింది సుస్మితా సేన్. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆమె ఈవిషయాన్ని బయటపెట్టింది.
మోడల్‌గా కెరీర్‌ని ప్రారంభించిన సుస్మితా సేన్ 1994లో `మిస్ యూనివర్స్` కిరీటం గెలుచుకుంది. దీంతో ఒక్కసారిగా అందరి చూపు తనవైపు తిప్పుకుంది. అంతేకాదు కేవలం 18ఏళ్ల వయస్సులో మిస్ యూనివర్స్ టైటిల్ విన్నర్‌గా నిలిచిన మొదటి భారతీయ మహిళగా చరిత్ర సృష్టించింది సుస్మిత. అదేఏడాది ముందుగా `ఫెమినా మిస్ ఇండియా`గానూ నిలిచింది సుస్మితా. ఇలా పలు అందాల పోటీల్లో విన్నర్‌గా నిలిచింది.
మోడల్ నుంచి నెక్ట్స్ లెవల్ సినిమాలు. సుస్మితా కూడా సినిమాల్లోకి వచ్చింది. ఆమె 1996లో బాలీవుడ్ చిత్రం 'దస్తక్'తో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. తొలిసినిమానే మహేష్ భట్ వంటి స్టార్ డైరెక్టర్ సినిమాలో నటించే ఛాన్స్ దక్కించుకుంది. అయితే అది సుస్మితాకి గొప్ప అవకాశమనే చెప్పాలి. కానీ అంతే అవమానాలు కూడా ఎదుర్కొందట. ఆ విషయాన్ని బయటపెట్టింది సుస్మితా సేన్. అక్షయ్ భార్య ట్వింకిల్ ఖన్నాతో ఈ విషయాన్ని పంచుకుంది. ఇందులో సుస్మితా చెబుతూ, మహేష్ భట్ తనను అవమానించిన సంఘటన బయటపెట్టింది.
Photo Courtesy: Instagram
మహేష్ భట్ అద్భుతమైన దర్శకుడు, కానీ అదే సమయంలో తనని దారుణంగా అవమానించారని చెప్పింది సుస్మిత. `దస్తక్` సినిమా షూటింగ్ సెట్‌లో 40 మంది మీడియా వ్యక్తులు, 20 మంది ప్రొడక్షన్ కుర్రాళ్ల ముందు తనని తిట్టాడని చెప్పింది. నటన రాదంటూ అవమానించాడట. తనకు తానుగా నటించలేనని ముందే చెప్పానని, అలాంటప్పుడు మీరు నన్ను ఎందుకు ఎంపిక చేసుకున్నారు? అని కూడా ప్రశ్నించిందట.దానికి మహేష్ భట్ స్పందిస్తూ.. "క్యా లేకే ఆయే హో కెమెరా లో ఇలా మిస్ యూనివర్స్ ట్యాగ్ ని ప్లే చేస్తున్నాను` అన్నారట. కానీ ఆ సమయంలో ఆ సంఘటనని ఎలా ఫేస్ చేయాలో కూడా అర్థం కాలేదట. అలాంటి నిస్సాయహా స్థితికి వెళ్లిపోయానని, చాలా బాధపడినట్టు చెప్పింది సుస్మితా సేన్.
దర్శకుడు మహేష్ భట్ తనని తిట్టడంతో కోపంలో ఏడ్చేస్తూ సెట్ నుంచి బయటకు వెళ్లిపోయిందట. కానీ దర్శకుడు తన చేతిని పట్టుకునే ప్రయత్నం చేయగా, మీరు నాతో అలా మాట్లాడకండి` అంటూ ఆయన చేతిని వదిలించుకుని కోపంగా వెళ్లిపోయిందట. తాను మళ్లీ చేయి పట్టుకుని వెనక్కి వచ్చి కెమెరా ముందుకు వెళ్లు అని అన్నారట. ఆ కసితో ఆమె మళ్లీ ఆ షార్ట్ చేసిందట. ఒకేదెబ్బకి అది పర్‌ఫెక్ట్ గా వచ్చిందని చెప్పింది సుస్మితా సేన్. ఆ సమయంలో తాను చాలా బాధపడినా, ఆ తర్వాత దర్శకుడి ప్రతిభను ఆమె మెచ్చుకోవడం విశేషం.
ఇలా సుస్మితా సేన్ కెరీర్ ప్రారంభంలో నటన కూడా రాదనే అవమానాలు ఎదుర్కొంది. ఆ తర్వాత అద్భుతమైన నటిగా, అందాల తారగా పేరు తెచ్చుకుంది. తిరుగులేని స్టార్ ఇమేజ్‌ని సొంతం చేసుకుంది. అత్యధిక పారితోషికం అందుకున్న హీరోయిన్‌గానూ నటించింది. తనని విమర్శించిన వారిని తన నటనతో వారి నోళ్లు మూయించింది సుస్మిత. `హిందూస్తాన్ కి కసమ్`, `మైనే ప్యార్ క్యున్ కియా`, `సిర్ఫ్ తుమ్`, `బీవీ నంబర్ 1`, `ఫిజా`, `ఆంఖేన్`, `మై హూ నా` వంటి చిత్రాలతో స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది. 2010 తర్వాత ఆమె సినిమాలకు గుడ్ బై చెప్పింది. మళ్లీ 2020లో `ఆర్య` అనే వెబ్ సిరీస్‌లో మెరిసి, హిట్ కొట్టింది.