చంపేస్తామంటూ కాల్స్ ఇండియా నుంచే ఎక్కువగా వచ్చాయంటూ..సన్నీ లియోన్ సంచలన వ్యాఖ్యలు
ఇండియా గురించి సన్ని లియోన్ సంచలన వ్యాఖ్యలు చేసింది. ఇండియన్స్ నుంచి తనకు కలిగిన ఇబ్బందుల గురించి సంచల వ్యాఖ్యలు చేసింది బ్యూటీ.

ఫారెన్ లో పుట్టి.. బాలీవుడ్ లో హీరోయిన్ గా ఎదిగింది సన్నీలియోన్. పొన్ స్టార్ గా సంచలనం సృష్టించిన ఈ బ్యూటీ. బాలీవుడ్ లో బ్రాండ్ గా మారింది. ఇటు సౌత్ లో కూడా పాగా వేయాలని చూసింది చిన్నది. రీసెంట్ ఇయర్స్ లో వరుసగా సౌత్ సినిమాలు చేస్తున్న సన్నీ లిమోన్ రీసెంట్ గా సంచలన విషయాలు వెల్లడించింది.
మంచు విష్ణు హీరోగా తెరకెక్కిన హారర్ థ్రిల్లర్ మూవీ జిన్నా. ఈ మూవీతో మరోసారి తెలుగు ప్రేక్షకులను పలకరించింది బాలీవుడ్ భామ సన్నీ లియోని. మిక్డ్స్ టాక్ తెచ్చుకున్నా.. ఈమూవీలో సన్నీలియోన్ అందాలకు ఫిదా అయిపోయారు జనాలు. సన్నీ కూడా చూపిచాల్సినంత చూపించి మురిపించింది.
ఈ మధ్య సౌత్ సినిమాలపై బాగా దృష్టిపెట్టింది సన్నీ లియోన్.. అందులో భాగంగా.. ఓ తమిళ సినిమాలో ఆమె నటించింది. ఇక ఈమూవీ ప్రమోషన్స్ లో జోరుగా పాల్గొంటోంది సన్నీ లియోని.. ఈ ప్రమోషన్స్‌లో భాగంగా పలు ఆసక్తికర విషయాలను మీడియాతో పంచుకుంది బాలీవుడ్ బ్యూటీ బాంబ్.
గతంలో ఆమె ఎదుర్కొన్న భయానక సంఘటనలను తలచుకుని ఎమోషనల్ అయిపోయింది సన్నీలియోన్. ఫిల్మ్ ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్తలో తనకు రకరకాలుగా బెదిరింపులు వచ్చాయని.. నేను ఇండియాలో అడుగుపెడతానని అనుకోలేదంటూ షాకింగ్ విషయాన్ని బయటపెట్టింది.
నా కెరీర్ ప్రారంభంలో నాకు బెదిరింపు మెయిల్స్ వచ్చేవి. చంపేస్తామంటూ కొంతమంది మెసేజ్‌లు పంపేవాళ్లు. ఎక్కువగా భారత్ నుంచే వచ్చేవి. దీంతో ఇక్కడ ప్రజలు నాపై చాలా కోపంగా ఉన్నారని అనుకున్నా. అప్పుడు నా వయసు కేవలం 20 ఏళ్లు మాత్రమే. ఆ బెదిరింపులు నన్ను తీవ్ర భయానికి గురి చేశాయంటూ అప్పటి రోజులు గుర్తు చేసుకుంది సన్నీ లియోన్.
అంతే కాదు అప్పుడు తనది చిన్నవయస్సు కావడంతో.. మంచిచెడులు చెప్పడానికి కూడా ఎవరూ లేరు. అలాంటివి ఇప్పుడు ఎదురైతే అవి నన్ను అంతగా ప్రభావితం చేసి ఉండేవి కావు.. ఎందుకంటే ఇప్పుడు నేను మానసికంగా చాలా బలంగా ఉన్నాను అంటూ చెప్పుకొచ్చింది సన్నీ లియోన్.
సన్నీ లియోన్ కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆమె కామెంట్స్ పై రకరకాలుగా స్పందిస్తున్నారు నెటిజన్లు. కోంత మంది సపోర్ట్ చేస్తుండగా.. కొంత మంది విమర్షిస్తున్నారు.