నా పోర్న్ చిత్రాల వల్లే మా అమ్మ మద్యానికి బానిసైంది.. సోనమ్ కపూర్, అమీర్ ఖాన్ ఇచ్చిన సపోర్ట్ మరువలేను
శృంగార తార సన్నీలియోన్ కి యువతలో ఎలాంటి క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. పోర్ట్ స్టార్ గా గుర్తింపు పొందిన సన్నీలియోన్ ప్రస్తుతం బాలీవుడ్ చిత్రాలలో రాణిస్తోంది.
శృంగార తార సన్నీలియోన్ కి యువతలో ఎలాంటి క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. పోర్ట్ స్టార్ గా గుర్తింపు పొందిన సన్నీలియోన్ ప్రస్తుతం బాలీవుడ్ చిత్రాలలో రాణిస్తోంది. తన గత జీవితాన్ని పక్కన పెట్టి సన్నీలియోన్ ఇప్పుడు నటిగా రాణిస్తోంది.
బాలీవుడ్ లో సన్నీలియోన్ హైవోల్టేజ్ రొమాంటిక్ మూవీస్ లో నటిస్తూ యువతని అలరిస్తోంది. ప్రస్తుతం ఆమెకి ఉన్న డిమాండ్ అంతా ఇంతా కాదు. తెలుగులో కూడా సన్నీలియోన్ కరెంట్ తీగ అనే చిత్రంలో నటించింది. గరుడ వేగ మూవీలో ఐటెం సాంగ్ చేసింది. ప్రస్తుతం సన్నీలియోన్ పలు చిత్రాల్లో నటిస్తోంది. మంచు విష్ణు జిన్నా చిత్రంలో సన్నీలియోన్ కీలక పాత్రలో నటించింది, అయితే ఆ మూవీ డిజాస్టర్ గా నిలిచింది.
సన్నీలియోన్ నటిగా ఎన్ని చిత్రాలు చేస్తున్నప్పటికీ ఆమె గత జీవితం గురించి ఎప్పుడూ చర్చ జరుగుతూనే ఉంటుంది. ఎందుకంటే సన్నీలియోన్ పోర్న్ ఇండస్ట్రీ నుంచి వచ్చింది. తాజాగా సన్నీలియోన్ ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది. ఇందులో తన గత జీవితాన్ని గుర్తు చేసుకుని మరోసారి ఎమోషనల్ అయింది. పంజాబీ కుటుంబ నేపథ్యం ఉన్న సన్నీలియోన్ కెనడాలో పెరిగింది.
అయితే ఫ్యామిలీ ఆర్థిక సమస్యల కారణంగానే తాను పోర్న్ ఇండస్ట్రీని ఆ టైం లో ఎంచుకోవాల్సి వచ్చింది అని పలు సందర్భాల్లో సన్నీలియోన్ పేర్కొంది. సన్నీలియోన్ 2012లో పోర్న్ ఇండస్ట్రీని వదిలిపెట్టి బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. తొలిసారి జిస్మ్ 2 చిత్రంలో నటించింది. ఆ తర్వాత బాలీవుడ్ లో సన్నీలియోన్ కి విపరీతమైన క్రేజ్ ఏర్పడింది.
అయితే తాజా ఇంటర్వ్యూలో తన కన్నీటిగాధ వివరిస్తూ.. తన కెరీర్ వల్ల జీవితంలో ఎన్నో అవమానాలు నిందలు భరించానని సన్నీలియోన్ తెలిపింది. అందులో ఒకటి మా అమ్మ మద్యానికి బానిస కావడం. మద్యానికి బానిసైన సన్నీలియోన్ తల్లి 2008లో మరణించారు. ఆ సమయంలో అంతా నన్ను నిందించారు. అయితే నేను అడల్ట్ ఫిలిమ్స్ లోకి వెళ్లక ముందే మా అమ్మకు మద్యం అలవాటు ఉంది.
అలాగని నేను ఏమాత్రం కారణం కాదు అని చెప్పను. ఎందుకంటే నేను అడల్ట్ ఇండస్ట్రీకి వెళ్లడం మా అమ్మకి ఏమాత్రం ఇష్టం లేదు. దానివల్ల ఆమె మరింతగా మద్యానికి బానిస అయ్యారు అని సన్నీలియోన్ పేర్కొంది. ఆ భారాన్ని తాను ఇంకా భరిస్తూనే ఉన్నట్లు సన్నీలియోన్ తెలిపింది. అలాగే 2016లో ఓ జర్నలిస్ట్ తో చేసిన ఇంటర్వ్యూ నేషనల్ వైడ్ గా వివాదం గా మారింది. ఆ ఇంటర్వ్యూలో సదరు జర్నలిస్ట్ సన్నీలియోన్ ని ఎక్కువగా ఆమె అడల్ట్ కెరీర్, శృంగారం గురించే వరుసగా ప్రశ్నలు సాధించారు. ఆమెని అవమానించే విధంగా ప్రశ్నలు అడిగారు.
కానీ సన్నీలియోన్ సహనం కోల్పోకుండా సమాధానాలు ఇచ్చింది. ఆ సమయంలో జర్నలిస్ట్ ని దుమ్మెత్తిపోస్తూ పలువురు బాలీవుడ్ తారలు సన్నీలియోన్ కి అండగా నిలిచారు. వారిలో అమీర్ ఖాన్, హృతిక్, సోనమ్ కపూర్, అనిల్ కపూర్ లాంటి వారు ఉన్నారు. వారందరికీ మరోసారి సన్నీలియోన్ కృతజ్ఞతలు తెలిపింది.