రాజమౌళి నోట ఆ మాట.. షాక్ అవుతున్న ఆడియన్స్

First Published 9, May 2020, 5:49 PM

బాహుబలి సినిమాతో ఇండియన్‌ సినిమాను జాతీయ స్థాయికి తీసుకెళ్లిన దర్శకుడు రాజమౌళి. అప్పటి వరకు రీజినల్ సినిమా వంద కోట్లు కలెక్ట్ చేయటమే కలగా అనుకుంటున్న సమయంలో బడ్జెట్‌ విషయంలోనే బౌండరీస్‌ మార్చేశాడు జక్కన్న. ఏకంగా బాహుబలి సినిమా కోసం 250 కోట్లు ఖర్చు చేయించాడు రాజమౌళి. బాహుబలి తరువాత ఓ చిన్న సినిమా చేస్తానంటూ  చెప్పిన రాజమౌళి తరువాత మాట మార్చాడు. మరోసారి భారీ బడ్జెట్‌తో ఆర్ ఆర్ ఆర్ మూవీని రూపొందిస్తున్నాడు. ఈ సినిమా కోసం ఏకంగా 400 కోట్లు ఖర్చు పెడుతున్నాడు రాజమౌళి.

అయితే తాజాగా కరోనా సినీ రంగం మీద కూడా తీవ్ర ప్రభావం చూపిస్తోంది. దాదాపు 45 రోజులుగా సినిమా షూటింగ్‌లు నిలిచిపోయాయి. తిరిగి పరిస్థితి ఎప్పుడు సాధారణ స్థితికి వస్తుందో ఇప్పట్లో చెప్పలేని పరిస్థితి.  దీంతో భారీ బడ్జెట్‌ సినిమాలు ఎంత వరకు సేఫ్ అన్న చర్చ జరుగుతోంది. అయితే ఈ విషయంపై రాజమౌళి కూడా స్పందించాడు. ప్రముఖ జర్నలిస్ట్ అనుపమా చోప్రాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

ప్రస్తుతం ఇండస్ట్రీ ఎదుర్కొంటున్న పరిస్థితుల నేపథ్యంలో కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సిన పరిస్థితి ఉందని తెలిపాడు. అంతేకాదు సినిమా బడ్జెట్‌ తో పాటు ఇతర విషయాల్లో కాస్త పొదుపు అవసరం అని చెప్పాడు. రాజమౌళి లాంటి భారీ చిత్రాల దర్శకుడే పొదుపు పాటించాలి అంటున్నాడంటే అభిమానులతో పాటు ఇండస్ట్రీ వర్గాలు కూడా షాక్‌ అవుతున్నారు.

రాజమౌళి క్వాలిటీ విషయంలో ఏ మాత్రం కాంప్రమైజ్‌ కాడు. తాను అనుకున్న పాత్రకోసం ఏ భాష నుంచైనా నటుడ్ని పిలిపించుకుంటాడు. తను అనుకున్న స్థాయిలో అవుట్ పుట్‌ వచ్చే వరకు సినిమాలు ఏళ్ల తరబడి చెక్కుతాడు. మరి అలాంటి జక్కన్నే కాస్ట్ కటింగ్ అంటున్నాడంటే ఇండస్ట్రీ ఎలాంటి గడ్డు పరిస్థితులను ఎదుర్కొన బోతుందో అన్న ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఫ్యాన్స్‌.

ఇక ఆర్ ఆర్ ఆర్‌ విషయానికి వస్తే రాజమౌళి తెరకెక్కిస్తున్న ఈ భారీ చిత్రంలో ఎన్టీఆర్‌, రామ్‌ చరణ్‌లు హీరోలుగా నటిస్తున్నారు. పీరియాడిక్‌ యాక్షన్‌ డ్రామగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఎన్టీఆర్‌ తెలంగాణ పోరాట యోధుడు కొమరం భీంగా నటిస్తుండగా, రామ్ చరణ్‌ అల్లూరి సీతారామ రాజు పాత్రలో నటిస్తున్నాడు.

భారీ బడ్జెట్‌ డీవీవీ దానయ్య, డీవీవీ ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్‌పై ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. ఇప్పటికే 60 శాతం వరకు సినిమా షూటింగ్ పూర్తయినట్టుగా తెలుస్తోంది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి 2021 జనవరి 8న సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని ప్లాన్ చేశారు. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో అనుకున్న సమయానికి రిలీజ్ కష్టమే అని తెలుస్తోంది.

loader