- Home
- Entertainment
- ఎల్లో డ్రెస్ లో శ్రీనిధి శెట్టి అందాలు అదుర్స్.. మత్తెక్కించే పోజులతో మైమరిపిస్తున్న ‘కేజీఎఫ్’ బ్యూటీ..
ఎల్లో డ్రెస్ లో శ్రీనిధి శెట్టి అందాలు అదుర్స్.. మత్తెక్కించే పోజులతో మైమరిపిస్తున్న ‘కేజీఎఫ్’ బ్యూటీ..
కన్నడ బ్యూటీ శ్రీనిధి శెట్టి (Srinidhi Shetty) అందాల ఆరబోతలో అదుర్స్ అనిపిస్తోంది. తనదైన శైలిలో ఫొటోషూట్లు చేస్తూ నెటిజన్లను ఆకర్షిస్తోంది. తాజాగా ట్రెడిషనల్ లుక్ లో మతిపోగొడుతోందీ సుందరి.

యంగ్ హీరోయిన్ శ్రీనిధి శెట్టి కేరీర్ మోడల్ గానే మొలైంది. అక్కడే మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ బ్యూటీకి చిత్ర పరిశ్రమ నుంచి సినీ అవకాశాలు ప్రారంభమయ్యాయి. తొలి చిత్రంతోనే సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఏకంగా పాన్ ఇండియన్ హీరోయిన్ గా మారిపోయింది.
సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ - కన్నడ సూపర్ స్టార్ యష్ కాంబినేషన్ లో వచ్చిన చిత్రం ‘కేజీఎఫ్ ఛాప్టర్ 1’, ‘కేజీఎఫ్ ఛాప్టర్ 2’లో హీరోయిన్ గా నటించింది. తన ఇప్పటి వరకు చేసిన సినిమాలూ ఇవే. కానీ ‘కేజీఎఫ్’ ప్రాంఛైజీ హిట్ గా నిలవడంతో శ్రీనిధికి కూడా మంచి డిమాండ్ ఏర్పడింది.
అయితే ఈ బ్యూటీ సోషల్ మీడియాలోనూ సత్తా చూపిస్తోంది. ఈ మేరకు ట్రెండీ ఫొటోషూట్లతో నెటిజన్లను ఆకర్షిస్తోంది. అదిరిపోయే అవుట్ ఫిట్స్ లో అందాల విందు చేస్తోంది. మత్తు చూపులు, మతిపోయే పోజులతో ఫొటోషూట్లు చేస్తూ కుర్రాళ్లను ఉక్కిరి బిక్కిరి చేస్తోంది.
తాజాగా ఎల్లో డ్రెస్ లో ఆకర్షణీయంగా కనిపిస్తోంది. లెహంగా, వోణీలో అచ్చమైన తెలుగమ్మాయిలా అందాలను ఆరబోసిందీ బ్యూటీ. తనదైన శైలిలో ఫొటోలకు పోజులిస్తూ మెస్మరైజ్ చేసింది. తాజాగా పిక్స్ కు తన అభిమానులు ఫిదా అవుతున్నారు.
ఈ కుర్ర హీరోయిన్ బిగ్ స్రీన్ పై ట్రెండీగా కనిపించినా.. నెట్టింట మాత్రం ట్రెడిషనల్ లుక్ లో చాలా క్యూట్ గా అభిమానులను పలకరిస్తోంది. ఫ్యాన్స్ కూడా ఈ బ్యూటీని సంప్రదాయ దుస్తుల్లోనే చూసేందుకు ఇష్టపడుతుంటారు. ఈ సుందరి పోస్ట్ చేసిన ఫొటోస్ కు లైక్స్, కామెంట్స్ పెడుతూ ఎంకరేజ్ చేస్తున్నారు.
కేరీర్ విషయానికొస్తే.. కేజీఎఫ్ తో అలరించిన ఈ బ్యూటీ తాజాగా తమిళ స్టార్ హీరో చియాన్ విక్రమ్ సినిమాలో అవకాశం దక్కించుకుంది. విక్రమ్ అప్ కమింగ్ ఫిల్మ్ ‘కోబ్రా’లో హీరోయిన్ గా నటిస్తోంది. త్వరలోనే ఈ చిత్రం కూడా ప్రేక్షకుల ముందుకు రానుంది. మరిన్నీ క్రేజీ ప్రాజెక్ట్స్ కూడా ఈ బ్యూటీ పేరునే పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది.