శ్రీదేవి మరణంపై మేనమామ అనుమనాలు.. ఆస్తి కోసమే చేశారా..?

First Published 4, Jun 2020, 6:11 PM

అతిలోక సుందరి శ్రీదేవి హఠాత్తుగా ఈ లోకాన్ని విడిచిన సంగతి తెలిసిందే. అయితే ఆమె మరణం ఇప్పటికీ ఓ మిస్టరీగానే ఉంది. చిన్న వయసులోనే బాత్ టబ్‌లో మునిగి శ్రీదేవి చనిపోవటం పట్ల చాలా అనుమానాలు ఉన్నాయి.

వెండితెర మీద అతిలోక సుందరిగా ఓ వెలుగు వెలిగిన శ్రీదేవి జీవితంలో ఎన్నో విషాదాలు కూడా ఉన్నాయా..? ఆమె మరణం ప్రమాదం కాదా..? శ్రీదేవిని ఆస్తి కోసమే బోనీ కపూర్‌ పెళ్లి చేసుకున్నాడా..? ఇలాంటి ఎన్నో అనుమానాలు తెర మీదకు తీసుకువచ్చారు ఆమె మేనమామ వేణుగోపాల్ రెడ్డి.

శ్రీదేవి మరణించిన సమయంలో కూడా వేణుగోపాల్ రెడ్డి పలు అనుమానాలు వ్యక్తం చేశాడు. అప్పట్లోనే బోనీకపూర్‌తో పాటు ఆయన మొదటి భార్య కుమారుడు అర్జున్‌ కపూర్‌ మీద కూడా ఆయన అనుమానాలు వ్యక్తం చేశాడు. అయితే అప్పట్లో అందరినీ షాక్‌కి గురి చేసిన ఈ వ్యాఖ్యలు తరువాత మరుగున పడ్డాయి.

తాజాగా మరోసారి మీడియా ముందుకు వచ్చిన వేణుగోపాల్ రెడ్డి శ్రీదేవి మరణం మీద అనుమానాలు వ్యక్తం చేశాడు. బోని కపూర్‌ పై తన అనుమానాలకు కారణాలను కూడా వివరించాడు వేణుగోపాల్ రెడ్డి.

శ్రీదేవి పసితనం నుంచే సినిమాల్లో నటించిందన్న వేణుగోపాల్ రెడ్డి. ఆమెను హీరోయిన్‌ చేసేందుకు తల్లి ఎంతో కష్టపడిందని వివరించాడు. చిన్నతనంలో స్కూల్‌కి వెళ్లే అవకాశం లేకపోవటంతో ఓ మాస్టర్‌ ఎప్పుడు శ్రీదేవి వెంట ఉండి పాఠాలు చెప్పేవారని తెలిపాడు ఆమె మేనమామ. తల్లి ఎంతో కష్టపడి శ్రీదేవిని హీరోయిన్‌గా నిలబెట్టిందని వెల్లడించాడు.

అయితే ఆసమయంలో శ్రీదేవి ఆస్తులను చూసి ఆశపడే బోని కపూర్‌ శ్రీదేవిని పెళ్లి చేసుకున్నాడని ఆయన ఆరోపించాడు. పక్కా ప్లాన్‌తోనే శ్రీదేవి వలలో వేసుకొని ఆమెను పెళ్లి చేసుకున్నాడని తెలిపాడు వేణుగోపాల్ రెడ్డి.

బోని కపూర్‌ చెత్త సినిమాలు తీసి ఆస్తులు పోగొట్టుకున్నాడని ఆ సమయంలో తప్పని సరి పరిస్థితుల్లో శ్రీదేవి ని పెళ్లి చేసుకొని ఆమె ఆస్తులు అమ్మి తిరిగి నిలదొక్కుకున్నాడని చెప్పాడు. ఆ తరువాత కూడా సినిమాలు చేసి బోని కపూర్‌ నష్టపోయాడని తెలిపాడు.

ఆర్థిక నష్టాల కారణంగా కుటుంబం రోడ్డున పడకూడదన్న ఆలోచనతోనే శ్రీదేవి సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చిందదని తెలిపాడు వేణు గోపాల్ రెడ్డి. శ్రీదేవి పైకి సంతోషంగా కనిపించినా మనసులో ఎంతో మనో వేదన ఉండేదని ఆయన వెల్లడించాడు. బోని కపూర్ శ్రీదేవిని బలవంతంగా పెళ్లి చేసుకున్నాడని కూడా ఆయన ఆరోపించాడు.

undefined

loader