తల్లికి అరుదైన గౌరవం.. సోనూ సూద్ భావోద్వేగం..
First Published Jan 2, 2021, 7:42 AM IST
లాక్డౌన్ టైమ్లో విశేషమైన సేవా కార్యక్రమాలు చేసి రియల్ హీరో అనిపించుకున్నారు సోనూ సూద్. ఆ సేవా కార్యక్రమాలు ఇప్పటికి కూడా కొనసాగిస్తున్నారు. దీంతో తెరపై విలన్గా మెప్పించిన సోనూ సూద్ రియల్ లైఫ్లో మాత్రం హీరో అనిపించుకున్నారు. తాజాగా ఆయన తల్లికి అరుదైన గౌరవం దక్కడంతో భావోద్వేగానికి గురయ్యారు.

ఆపదలో ఉన్నవారు, గూడు లేని వారు తన తలుపు తడితే కాదనకుండా తనవంతు సాయం చేస్తున్నారు. దేశ వ్యాప్తంగా మంచి పాపులారిటీ తెచ్చుకున్నారు. ఆయన పేరుతో ఏకంగా వ్యాపారమే జరుగుతుంది.

ఇక సోనూ సూద్ తల్లికి అరుదైన గౌరవం దక్కింది. మెగాలో రహదారికి ఆమె పేరుని నామకరణం చేశారు. `ప్రొఫెసర్. సరోజ్సూద్ రోడ్`గా ప్రభుత్వం నామకరణం చేసింది. దీంతో సోనూ సూద్ భావోద్వేగానికి గురయ్యారు.
Today's Poll
మీరు ఎంత మందితో ఆన్ లైన్ గేమ్స్ ఆడడానికి ఇష్టపడుతారు?