ఏమైనా జరగనీ.. నేను మాత్రం హీరోయిన్ అవుతాను.. మహేష్ తనయ సితార బోల్డ్ కామెంట్
First Published Jan 2, 2021, 2:55 PM IST
సూపర్ స్టార్ మహేష్‌బాబు ముద్దుల తనయ సితార ఘట్టమనేని బోల్డ్ కామెంట్ చేసింది. తనకి యాక్టింగ్ అంటే చాలా ఇష్టమట. ఫ్యూచర్లో ఏం జరిగినా తాను మాత్రం హీరోయిన్ అవుతానని చెప్పింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మహేష్ గురించి, తన కెరీర్ గురించి అనేక ఆసక్తికర విషయాలను పంచుకుంది.

మహేష్‌బాబు తనయ సితార ప్రస్తుతం స్కూలింగ్‌లో ఉంది. క్యూట్ అందంతో ఆకట్టుకుంటుంది. తాను సొంతంగా యూట్యూబ్ ఛానెల్ పెట్టింది అందులో గేమ్స్, ఇంటర్వ్యూస్ చేస్తుంది. దీంతో చిన్నప్పుడే సెలబ్రిటీ హోదాని పొందింది సితార. తాను మల్టీ టాలెంట్‌గా రాణిస్తుంది. `ఫంటాస్టిక్ తారా` అనే 3డీ వెబ్ సిరీస్‌లోనూ నటించింది.

తాజాగా న్యూ ఇయర్ 2021 సందర్బంగా ఓ టీవీ ఛానెల్‌కి ఇంటర్వ్యూ ఇచ్చింది సితార. ఈ సందర్భంగా అనేక ఆసక్తికర విషయాలను పంచుకుంది. తనకు యాక్టింగ్ అంటే ఇష్టమని చెప్పింది.
Today's Poll
మీరు ఎంత మందితో ఆన్ లైన్ గేమ్స్ ఆడడానికి ఇష్టపడుతారు?