- Home
- Entertainment
- Karthika Deepam: అయ్యో వంటలక్కా.. డాక్టర్ బాబు గతం మర్చిపోయి అన్యాయం చేసేశాడుగా.. అడ్డం తిరిగిన కథ!
Karthika Deepam: అయ్యో వంటలక్కా.. డాక్టర్ బాబు గతం మర్చిపోయి అన్యాయం చేసేశాడుగా.. అడ్డం తిరిగిన కథ!
Karthika Deepam: బుల్లితెరపై ప్రసారమవుతున్న కార్తీకదీపం సీరియల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ సీరియల్ బుల్లితెర ప్రేక్షకులను ఎంతగా కనెక్ట్ చేసుకుందో చూసాం.

సెలెబ్రేటిలను సైతం ఈ సీరియల్ బాగా ఆకట్టుకుంది. ఇక ఈ సీరియల్ మొదటి నుండి బాగా ఆసక్తిగా కొనసాగింది. ముఖ్యంగా ఈ సీరియల్ ను ప్రేక్షకులు ఎక్కువగా డాక్టర్ బాబు, వంటలక్క కోసం చూసేవాళ్ళు. కానీ ఎప్పుడైతే డాక్టర్ బాబు దంపతులకు రోడ్డు ప్రమాదం జరిగిందో అప్పటినుంచి ప్రేక్షకులు ఈ సీరియల్ చూడడమే దూరం పెట్టేశారు. పిల్లలు పెద్దగా మారిన కూడా ఎందుకో కథలో ఆసక్తి లేకపోవడంతో ఈ సీరియల్ రేటింగ్ కూడా తగ్గింది.
దీంతో దర్శకుడు ఒక నిర్ణయానికి వచ్చి మొత్తానికి వంటలక్కను, డాక్టర్ బాబును రంగంలోకి దింపాడు. ప్రమాదం జరిగిన తర్వాత వంటలక్క ఇంతకాలం హాస్పిటల్లో కోమాలో ఉండగా దీంతో తనకు గతంలో జరిగిన ప్రమాదం గుర్తుకు రావడంతో కోమాలో నుండి బయటికి వచ్చి డాక్టర్ బాబు కోసం బాట పట్టింది. అంతేకాకుండా తన పిల్లల కోసం తిరిగి హైదరాబాద్ కు కూడా వెళ్ళింది. కానీ సౌందర్య ఆ ఇళ్ళు వదిలి వెళ్లిన సంగతి తెలిసిందే.
దీంతో దీప మొదట తన భర్త డాక్టర్ బాబుని వెతికి.. ఆ తర్వాత ఇద్దరు కలిసి తన పిల్లల కోసం వెతకాలి అని అనుకుంటుంది. అలా మొదట డాక్టర్ బాబును వెతికే క్రమంలో ఉండగా ఎట్టకేలకే డాక్టర్ బాబు దర్శనం ఇస్తాడు. కానీ అసలు ట్విస్ట్ ఇక్కడే మొదలయ్యింది. నిజానికి డాక్టర్ బాబును కలిసిన వెంటనే దీప పరుగులు తీసి డాక్టర్ బాబు అంటూ దగ్గరికి తీసుకునే ప్రయత్నం చేసింది.
కానీ డాక్టర్ బాబు.. ఈవిడ ఎవరు అన్నట్లుగా చూశాడు దీపని. అంటే డాక్టర్ బాబుకు ప్రమాదంలో తలకు గాయం కావడంతో గతం మర్చిపోయినట్లు చూపించాడు దర్శకుడు. పాపం.. తన భర్త దొరికాడని ఆనందపడాలో.. లేక తనను గుర్తుపట్టలేక ఉన్నాడు అని బాధపడలో అర్థం కాని పరిస్థితిగా మారింది వంటలక్కకు. పెళ్లి చేసుకున్నప్పటి నుండి డాక్టర్ బాబు, వంటలక్క జీవితం ఏ రోజు సాఫీగా సాగలేదు. సాఫీగా సాగుదాము అనుకున్న సమయంలో మోనిత ఎంట్రీ, కారు యాక్సిడెంట్ లాంటివి వీరి జీవితంలోకి వచ్చాయి.
అయినా కూడా ప్రాణాలతో బయటపడ్డారు వీరిద్దరు. కానీ ఏం లాభం.. మళ్లీ వంటలక్క కు కన్నీటి శోకం పెట్టాడు దర్శకుడు. ఇక వంటలక్క డాక్టర్ బాబుకు గతం గుర్తుకొచ్చేలా ఏం చేస్తుందో.. ఎన్ని తంటాలు పడుతుందో.. ఎన్ని దుఃఖాలు చూస్తుందో చూడాలి. అంతే కాదండోయ్ దర్శకుడు మరో ట్విస్ట్ కూడా పెట్టాడు. అదేంటంటే ఇప్పుడు డాక్టర్ బాబు మోనిత భర్త. ఇంకేంటి.. కథ మొత్తం అడ్డం తిరిగినట్లే. ఇంతకాలం మోనితతోనే వీరి జీవితంలోకి ఎన్నో దుఃఖాలు వచ్చాయి. మళ్ళీ మోనిత ఎంట్రీ ఉండటంతో ఇకనైనా వంటలక్క, డాక్టర్ బాబు మళ్లీ కలిసి ఉంటారా లేదా అనుమానాలు వస్తున్నాయి.