- Home
- Entertainment
- పిచ్చెక్కించే పోజులతో ఉక్కపోత పెంచుతున్న శివాత్మిక రాజశేఖర్.. బోల్డ్ ఫోటోలతో ఇంటర్నెట్‌లో రచ్చ
పిచ్చెక్కించే పోజులతో ఉక్కపోత పెంచుతున్న శివాత్మిక రాజశేఖర్.. బోల్డ్ ఫోటోలతో ఇంటర్నెట్‌లో రచ్చ
స్టార్ కిడ్ శివాత్మిక రాజశేఖర్ తెలుగు హీరోయిన్ అయినప్పటికీ తన మూస ధోరణులకు బ్రేక్ చెబుతుంది. చుట్టూ వేసుకున్న కంచెని ఛేదించుకుని దూసుకుపోతుంది. అందాల ఆరబోతలో తగ్గేదెలే అంటూ సామాజిక మాధ్యమాల్లో రచ్చ చేస్తుంది.

రాజశేఖర్ కూతురు శివాత్మిక రాజశేఖర్(Shivathmika Rajashekar) సినిమాల్లో కంటే సోషల్ మీడియాలోనే ఎక్కువగా కనిపిస్తుంది. ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో ఫుల్ యాక్టివ్‌గా ఉంటోంది. రోజు ఏదో ఒక పోస్ట్ తో తన అభిమానులను ఆకట్టుకుంటుంది. తన చుట్టూ తిప్పుకుంటోంది. గ్యాప్ లేకుండా గ్లామర్ ఫోటోలు షేర్ చేస్తూ నెటిజన్లని ఎంగేజ్ చేస్తుంది శివాత్మిక.
తాజాగా మరోసారి రెచ్చిపోయింది. తన బోల్డ్ (Shivathmika Bold Photos) ఫోటోలను పంచుకుంది. వరుస ఫోటో షూట్ సిరీస్‌లో భాగంగా మరికొన్ని హాట్ ఫోటోలను షేర్ చేసింది. ఇందులో శివాత్మిక మరింత హాట్‌గా ఉండటం విశేషం. ఘాటెక్కించే అందాలతో కుర్రాళ్ల బాడీలో ఉక్కపోత పెంచుతుంది. అసలే మండే ఏండకి, ఉక్కపోతతో విలవిలలాడుతున్నారు కుర్రాళ్లు. అలాంటి సమయంలో శివాత్మిక ఇలా అందాలు ఆరబోస్తూ మరింత హీటు పెంచుతుంది.
శివాత్మిక నయా హాట్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. పిచ్చెక్కించే పోజులు నెటిజన్లని తెగ ఆకట్టుకుంటున్నాయి. ఈ అమ్మడి సహజమైన అందాలను చూసేందుకు ఎగబడుతున్నారు. శివాత్మిక కసిగా చూస్తూ కవ్విస్తూ చూపుతిప్పుకోనివ్వడం లేదు.
శివాత్మిక రాజశేఖర్ కెరీర్‌ని ఇప్పుడిప్పుడే బిల్డ్ చేసుకుంటుంది. ఆమె వెండితెరపై మెరిసింది ఇప్పటి వరకు ఒక్క చిత్రంతోనే. `దొరసాని` సినిమాలో దొరసానిగా నటించి ఆకట్టుకుంది. దొర కూతురు పాత్రలో ఒదిగిపోయింది. గడీల కాలం నాటి కథతో రూపొందిన `దొరసాని` చిత్రంలో ఆమె ఆనంద్ దేవరకొండతో కలిసి నటించింది. వీరిద్దరికిది తొలి చిత్రం కావడం విశేషం. దర్శకుడికి కూడా డెబ్యూనే.
ఈ సినిమాకి క్రిటికల్‌గా ప్రశంసలు దక్కాయి. కానీ కమర్షియల్ గా ఆదరణ దక్కలేదు. కానీ ఇందులో శివాత్మిక నటనకు మంచి మార్కులే పడటం విశేషం. తొలి చిత్రంలోనే మంచి నటన ప్రదర్శించిందన్నారు. హవభావాలు బాగా పలికించిందనే పేరొచ్చింది. నటన పరంగానూ చాలా సెటిల్డ్ గా చేసింది. అయితే తొలి చిత్రానికి తగ్గట్టుగానే ఆమె పాత్ర ఉండటంతో రెండూ కలిసొచ్చాయి.
శివాత్మిక తొలి చిత్రం విడుదలై మూడేళ్లు అవుతున్నా, ఆమె నుంచి మరో సినిమా రాలేదు. ప్రస్తుతం బ్రహ్మానందం ప్రధాన పాత్రలో నటించిన `పంచతంత్రం`లో కీలక పాత్ర పోషిస్తుంది. ఇందులో స్వాతిరెడ్డి(కలర్స్ స్వాతి), సముద్రఖని కూడా నటిస్తుండటం విశేషం. ఈ చిత్రంలోని పాటలు విడుదలై ఆకట్టుకున్నాయి. సినిమా త్వరలోనే థియేటర్‌లోకి రాబోతున్నట్టు టాక్.
మరోవైపు కృష్ణవంశీ దర్శకత్వంలోనూ `రంగమార్తాండ` అనే చిత్రంలో కీ రోల్ చేస్తుంది శివాత్మిక. ప్రకాష్ రాజ్, రమ్యకృష్ణ, బ్రహ్మానందం, అనసూయ కూడా నటిస్తున్న ఈ చిత్రం విడుదలపై ఇంకా క్లారిటీ లేదు. కానీ చాలా రోజులుగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్న దర్శకుడు కృష్ణవంశీ. ఓ టైటిల్ లుక్‌ని కూడా విడుదల చేశారు. కానీ ఇప్పటి వరకు దీనికి సంబంధించి ఎలాంటి అప్‌డేట్ లేకపోవడం గమనార్హం. వీటితోపాటు తమిళంలోకి ఎంట్రీ ఇస్తూ `ఆకాశం` అనే చిత్రంలో నటిస్తుంది. మరో కోలీవుడ్ సినిమా కూడా చేస్తుంది శివాత్మిక.