తెలుగు ఆడియెన్స్ ఈగర్‌గా వెయిట్‌ చేస్తున్న ఏడు క్రేజీ సీక్వెల్స్..

First Published Jan 14, 2021, 7:12 AM IST

ఓ హిట్‌ అయిన సినిమాకి ఎప్పుడూ క్రేజ్‌ ఉంటుంది. అది యూనివర్సల్‌ కాన్సెప్ట్ అయితే దానికి మరింత డిమాండ్‌. వాటిని రీమేక్‌ చేయడం, సీక్వెల్‌ తీయడం చేస్తుంటారు. అలా ప్రస్తుతం తెలుగులో అరడజనుకుపైగా సీక్వెల్స్ రాబోతున్నాయి. ఆవేంటి, వాటి కథేంటో చూద్దాం. 

మరో క్రేజీ సీక్వెల్‌ `ఎఫ్‌3`. రెండేళ్ల క్రితం వచ్చిన `ఎఫ్‌2` సూపర్‌ హిట్‌గా నిలిచింది. సంక్రాంతి కానుకగా విడుదలై, ఊహించని విధంగా వంద కోట్లకుపైగా వసూళ్లని రాబట్టింది. తాజాగా ఈ సినిమాకి సీక్వెల్‌ని  రూపొందిస్తున్నారు దర్శకుడు అనిల్‌ రావిపూడి. వెంకటేష్‌, వరుణ్‌ తేజ్‌ హీరోలుగా నటిస్తుండగా, తమన్నా, మెహరీన్‌ హీరోయిన్లుగా నటిస్తున్నారు. దిల్‌రాజు తన శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై  నిర్మిస్తున్నారు. తాజాగా సంక్రాంతి విషెస్‌ తెలియజేస్తూ ఈ చిత్రం నుంచి కొత్త పోస్టర్ ని విడుదల చేశారు.

ఇందులో వెంకటేష్‌, వరుణ్‌ తేజ్‌ రెండు వైపులు గొడుగుని రివర్స్ చేసి అందులో డబ్బు నోట్లతో నవ్వుతూ కనిపిస్తున్నారు. పై నుంచి నోట్లు పడుతుండగా, వాళ్లు గొడుల్లో పట్టుకుంటున్నట్టుగా ఉన్న ఈ నయా  పోస్టర్‌ ఆసక్తిని రేకెత్తిస్తుంది. ఈ సినిమా డబ్బు ప్రధానంగా సాగుతున్నట్టు తెలుస్తుంది. డబ్బుతో వచ్చే ఇబ్బందులు, దాని వల్ల పుట్టే కామెడీ ప్రధానంగా ఈ సినిమాని తెరకెక్కిస్తున్నట్టు దర్శకుడు అనిల్‌  రావిపూడి తెలిపారు. ఫన్‌ అండ్‌ ఫ్రస్టేషన్‌తో రూపొందుతున్న ఈ సినిమా కూడా క్రేజీగా మారింది.

ప్రస్తుతం సీక్వెల్స్ లో అత్యంత ప్రతిష్టాత్మకంగా, యావత్‌ దేశం ఎదురుచూస్తోన్న సినిమా `కేజీఎఫ్‌ః ఛాప్లర్‌ 2`. ఇది రెండేళ్ల క్రితం వచ్చిన `కేజీఎఫ్‌`కి సీక్వెల్‌. ఇందులో యష్‌ హీరోగా నటిస్తుండగా, ప్రశాంత్‌ నీల్‌  దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీనిధి శెట్టి హీరోయిన్‌. సంజయ్‌ దత్‌, రవీనా టండన్‌, రావు రమేష్‌ వంటి వారు కీలక పాత్రలు పోషిస్తున్నారు.

ఇప్పటికే విడుదలైన చిత్ర టీజర్‌ సినిమాపై భారీ అంచనాలను పెంచింది. అంతేకాదు ఏకంగా అది 120మిలియన్స్ కి పైగా వ్యూస్‌ని సొంతం చేసుకుని రికార్డ్ సృష్టించింది. ఇక సినిమా విడుదలైతే ఇంకెన్ని  రికార్డులు క్రియేట్‌ చేస్తుందనేలా ఉంది. ఇది కన్నడలో రూపొందుతుండగా, తెలుగు, హిందీ, తమిళం, మలయాళ భాషల్లో విడుదల చేయబోతున్నారు. పాన్‌ ఇండియా సినిమా కావడంతో భాషా బేధం లేదనే  చెప్పాలి.

సీక్వెల్‌గా వస్తోన్న మరో సినిమా `ఢీ`. మంచు విష్ణు, శ్రీనువైట్ల కాంబినేషన్‌లో వచ్చిన ఈ ఫ్యామిలీ డ్రామా ఎంటర్‌టైనర్‌ సూపర్‌ హిట్‌గా నిలిచింది. దాదాపు 13 ఏళ్ల తర్వాత దీనికి సీక్వెల్‌ని రూపొందిస్తున్నారు.  ఈ సీక్వెల్‌ని ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే.

`ఢీ అండ్‌ ఢీ` పేరుతో దీన్ని రూపొందిస్తున్నారు. ఫెయిల్యూర్స్ లో ఉన్న మంచు విష్ణు, శ్రీనువైట్ల ఈ సీక్వెల్‌తో మళ్లీ పుంజుకోవాలని చూస్తున్నారు. వినోదం డబుల్‌ అనే కాన్సెప్ట్ తో వస్తున్నారు. మరి వీరికి  పూర్వవైభవాన్నితీసుకోస్తుందా అనేది చూడాలి.

అడవిశేషు విలక్షణ నటుడు. ఆయన ప్రతి సినిమా చాలా సెలెక్టీవ్‌గా చేయడంతోపాటు, కథా బలం ఉండేలా చూసుకుంటాడు. గతంలో ఆయన నటించిన `గూఢచారి` ఎంతటి విజయాన్ని సాధించిందో తెలిసిందే. ఈ  సినిమాకి శశి కిరణ్‌ తిక్క దర్శకత్వం వహించారు.యూనివర్సల్‌ కాన్సెప్ట్ కావడంతో దీనికి ఇప్పు సీక్వెల్‌ని రూపొందిస్తున్నారు.

మహేష్‌బాబు దీన్ని నిర్మిస్తుండటం విశేషం. ఈ సీక్వెల్‌ `మేజర్‌`కి `గూఢచారి`కి స్క్రీన్‌ప్లే రాసిన రాహుల్‌ పక్కాల దర్శకత్వం వహిస్తున్నారు. శోభితా దూళిపాల్ల, ప్రకాష్‌రాజ్‌, జగపతిబాబు కీలక పాత్రలు  పోషిస్తున్నారు. ముంబయి నవంబర్‌ 11 దాడిలో చనిపోయిన మేజర్‌ సందీప్‌ ఉన్నిక్రిష్ణన్‌ లైఫ్‌ ఆధారంగా ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఈసినిమాపై కూడా అంచనాలున్నాయి.

నిఖిల్‌ కెరీర్‌లో పెద్ద హిట్ చిత్రం `కార్తికేయ`. చందుమొండేటి రూపొందించిన ఈ సినిమాలో కలర్‌ స్వాతి హీరోయిన్‌గా నటిచింది. సస్పెన్స్ థ్రిల్లర్‌గా ఇది పెద్ద హిట్‌ అయ్యింది.

తాజాగా దీన్ని సీక్వెల్‌ `కార్తికేయ 2`ని రూపొందిస్తున్నారు. నిఖిల్‌ హీరోగా చందుమొండేటి తెరకెక్కిస్తుండగా, స్వాతి స్థానంలో అనుపమా పరమేశ్వరన్‌ హీరోయిన్‌గా నటిస్తుంది.

టాలీవుడ్‌లో వస్తున్న మరో క్రేజీ సీక్వెల్‌ `హిట్‌ః ది సెకండ్‌ కేస్‌`. రెండేళ్ల క్రితం వచ్చిన `హిట్‌`కిది సీక్వెల్‌. `హిట్‌` చిత్రానికి శైలేష్‌ కొలను దర్శకత్వం వహించగా, విశ్వక్‌ సేన్‌ హీరోగా నటించారు. ఆ సినిమా  మంచి విజయం సాధించింది. యూనివర్సల్‌ కాన్సెప్ట్ గా ఆకర్షించింది.

ఇప్పుడు సీక్వెల్‌లో హీరోగా అడవిశేషు నటిస్తుండటం విశేషం. శైలేష్‌కొలను రూపొందిస్తున్నారు. నాని తన వాల్‌పోస్టర్‌ సినిమా పతాకంపై నిర్మిస్తున్నారు.

తెలుగులో మరో క్రేజ్‌ సీక్వెల్‌ `భారతీయుడు2`. కమల్‌ హాసన్‌ కెరీర్‌లో బెస్ట్ చిత్రంగా నిలిచిన `భారతీయుడు`కిది సీక్వెల్‌. ఆ సినిమాకి శంకర్‌ దర్శకత్వం వహించగా, మనిషా కొయిరాలా హీరోయిన్‌గా  నటించింది. అందులో కమల్‌ ద్విపాత్రాభినయం చేశారు. అది భారతీయ సినిమా రికార్డ్ లను తిరగరాసింది.

తాజాగా దానికి సీక్వెల్‌ `భారతీయుడు 2`రూపొందుతుంది. దీనికి శంకర్‌ దర్శకత్వం వహిస్తుండగా, కాజల్‌,రకుల్‌ ప్రీత్‌ సింగ్‌, సిద్ధార్థ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. అయితే వరుస ప్రమాదాలు ఈ సినిమాని  వెంటాడుతుండటంతో ఈ సినిమా ఉంటుందా? లేదా? అనేది సస్పెన్స్ గా మారింది. అయితే సీక్వెల్స్ చాలా వరకు పరాజయం చెందాయి. మరి ఈ సినిమాల పరిస్థితేంటోచూడాలి.

Today's Poll

మీరు ఎంత మందితో ఆన్ లైన్ గేమ్స్ ఆడడానికి ఇష్టపడుతారు?