Karishma Kapoor: 47ఏళ్ల వయసులో రెండో వివాహం? ఓపెన్ అయిన కరిష్మా కపూర్!
కరిష్మా కపూర్ తన పెళ్లి గురించి అభిమానులతో ఓపెన్ అయింది. వారితో ఇంటరాక్షన్ సెషన్ లో తన రెండో పెళ్లి గురించి ఆమె ఓపెన్ కామెంట్స్ చేసింది

బాలీవుడ్ లో కపూర్ కుటుంబాలదే హవా. ఈ ఫ్యామిలీ నుండి అనేక మంది స్టార్ హీరోలు, హీరోయిన్స్ అయ్యారు. వారిలో కరిష్మా కపూర్ ఒకరు. చెల్లి కరీనా కపూర్ కంటే ముందు బాలీవుడ్ లో ఓ ఊపు ఊపింది కరిష్మా. 1991లో నటిగా ఎంట్రీ ఇచ్చిన కరిష్మా కపూర్ టాప్ స్టార్స్ తో జతకట్టారు.
బాలీవుడ్ లో కపూర్ కుటుంబాలదే హవా. ఈ ఫ్యామిలీ నుండి అనేక మంది స్టార్ హీరోలు, హీరోయిన్స్ అయ్యారు. వారిలో కరిష్మా కపూర్ ఒకరు. చెల్లి కరీనా కపూర్ కంటే ముందు బాలీవుడ్ లో ఓ ఊపు ఊపింది కరిష్మా. 1991లో నటిగా ఎంట్రీ ఇచ్చిన కరిష్మా కపూర్ టాప్ స్టార్స్ తో జతకట్టారు.
అభిమానులు అడిగిన అన్ని ప్రశ్నలకు సహనంగా సమాధానం ఇచ్చింది. కరిష్మా కపూర్‌ను తనకు ఇష్టమైన ఆహారం, ఇష్టమైన నటీనటులు ఎవరు, ఇష్టమైన రంగు గురించి అడిగారు.. కరిష్మా తనకు ఇష్టమైన ఆహారం బిర్యానీ అని చెప్పింది. అదే సమయంలో, అలాగే నలుపు రంగు అంటే చాలా ఇష్టం అన్నారు.
మరొక అభిమాని మీకు రన్బీర్ కపూర్, రణవీర్ సింగ్‌లలో ఎవరిని ఎక్కువగా ఇష్టపడతారు అని అడగగా ఈ ప్రశ్నకు ఆమె స్పందిస్తూ 'ఇద్దరూ ఇష్టమే' అని చెప్పింది. చివరిగా ఓ అభిమాని మీరు మళ్లీ పెళ్లి చేసుకుంటారా? అని అడిగారు. అయితే ఈ ప్రశ్నకు సమాధానంగా, కరిష్మా ఒక అమ్మాయి ఫోటో ఉన్న జిఫ్ షేర్ చేసింది. అంతే కాకుండా దాని మీద 'డిపెండ్స్' అంటూ రాసుకొచ్చింది. అంటే ఆమె చేసుకోను అని చెప్పలేదు, అలాగే చేసుకుంటాను అని కూడా చెప్పలేదు. పరిస్థితులను బట్టి ఆధారపడి ఉంటుంది అని చెప్పుకొచ్చింది.
గతంలో కరిష్మా కపూర్ రెండో పెళ్లిపై ఎటువంటి కామెంట్స్ చేయకపోవడంతో లేటెస్ట్ సమాధానం ప్రాధానత్య సంతరించుకుంది. కరిష్మా ఢిల్లీకి చెందిన వ్యాపారవేత్త సంజయ్ కపూర్‌ను 2003లో వివాహం చేసుకుంది.ఈ క్రమంలోనే ఈ జంటకు కుమార్తె అదారా, కుమారుడు కియాన్ ఉన్నారు.
అయితే 2014 సంవత్సరం నాటికి, కరిష్మా - సంజయ్ మధ్య దూరం పెరగడంతో 2016 సంవత్సరంలో, కరిష్మా సంజయ్ విడాకులు తీసుకున్నారు. ఇక విడిపోయిన సమయంలో వారిద్దరూ ఒకరిపై ఒకరు చాలా తీవ్రమైన ఆరోపణలు చేసుకున్నారు. ఈ కారణంగా వారి విడాకులు అప్పట్లో వార్తలు వచ్చాయి.
ఇక కరిష్మా కపూర్ చెల్లి కరీనా కపూర్ ప్రేమ వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. ఇద్దరు టీనేజ్ పిల్లలకు తండ్రైన నటుడు సైఫ్ అలీ ఖాన్ ని ఆమె వివాహం చేసుకున్నారు. 2012 అక్టోబర్ 16న సైఫ్-కరీనా వివాహం జరిగింది. సైఫ్ కూతురు సారా అలీఖాన్ హీరోయిన్ గా రాణిస్తుండగా, కొడుకు ఎంట్రీకి సిద్ధమవుతున్నాడు. ఇక కరీనా కపూర్ తో ఆయనకు ఇద్దరు అబ్బాయిలు పుట్టారు.