- Home
- Entertainment
- సౌందర్య వాళ్లకు బయపడి ఎక్స్ పోజింగ్ చేయలేదు, చిరు మూవీ నుండి తొలగించారు... ఆమని కీలక కామెంట్స్
సౌందర్య వాళ్లకు బయపడి ఎక్స్ పోజింగ్ చేయలేదు, చిరు మూవీ నుండి తొలగించారు... ఆమని కీలక కామెంట్స్
బన్నీ అంటే ఆమనికి ఎందుకంత ఇష్టం? అప్పట్లో సౌందర్య ఎక్సపోజింగ్ కి దూరంగా ఉండడడానికి కారణం ఏమిటీ? చిరంజీవితో ఆమని ఎందుకు నటించలేదు? సిసింద్రీ సమయంలో అఖిల్ తో పడ్డ బాధలు ఏమిటీ? జగపతి బాబుకు భార్యగా మళ్ళీ ఆమని చేస్తున్నారా? ఇలాంటి అనేక ఆసక్తిర విషయాలకు సమాధానం తెలియాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే..
110

అందాల నటి ఆమనిని చూస్తే మన ఊరిలో మనకు పరిచయం ఉన్న మనిషి భావన కలుగుతుంది. తెలుగు తెరపై భార్య పాత్రలకు ఆమని కొత్త అర్థం చెప్పారు. శుభలగ్నం, మావిడాకులు, మిస్టర్ పెళ్ళాం వంటి చిత్రాలు ఆమె నటనకు కొన్ని మచ్చుతునకలు. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా రెండో ఇన్నింగ్స్ స్టార్ చేసిన ఆమని వరుస ఇంటర్వ్యూలలో పాల్గొంటున్నారు.
Photo courtesy: Mana stars
210
చావు కబురు చల్లగా మూవీలో యంగ్ హీరో కార్తికేయకు అమ్మ పాత్ర చేస్తున్నారు ఆమని. ఈ మూవీ ప్రీ రిలీజ్ వేడుకకు వచ్చిన బన్నీని వేదికపై ఆమె ఆప్యాయంగా కౌగిలించుకున్నారు. అసలు బన్నీ అంటే తనకు ఎంత ఇష్టమో ఆమనీ తెలిపారు.
Photo courtesy: Mana stars
310
ఆమని బన్నీకి పెద్ద ఫ్యాన్ అట. ఆయన డాన్సులు, స్టైల్, ఫైట్స్ కొత్తగా, యూనిక్ గా ఉంటాయట. చావు కబురు చల్లగా వేడుకలో బన్నీని చూసిన ఆమని, ఒక సెల్ఫీ దిగాలని ఆశపడ్డారట. తన పిల్లలకు కూడా బన్నీ అంటే ఇష్టం కాగా.. ఆ ఫోటో చూపించి వాళ్ళను సంతోష పెట్టాలని అనుకున్నారట.
Photo courtesy: Mana stars
410
అయితే వేదికపై బన్నీ ఆమనిని గొప్ప నటిగా పొగడడంతో తన ఆనందం కంట్రోల్ చేసుకోలేకపోయారట. తాను ఓ సెలెబ్రిటీ అన్న విషయం మరచి... వెళ్లి బన్నీని కౌగిలించుకున్నానని ఆమని తెలిపారు. భవిష్యత్ లో బన్నీకి అమ్మగా, అత్తగా ఎలాంటి పాత్ర అయినా చేస్తానని ఆమని తెలిపారు.
Photo courtesy: Mana stars
510
ఇక పరిశ్రమలో తనకు బెస్ట్ ఫ్రెండ్ ఎవరంటే... సౌందర్య గారట. ఇద్దరూ కన్నడ వాళ్ళు మరియు బెంగుళూరు వాళ్ళు కావడంతో చాలా సన్నిహితంగా ఉండేవారట. అన్నీ విషయాలు ఒకరికి మరొకరు పంచుకొనేవారట.
Photo courtesy: Mana stars
610
ఓ సంధర్భంలో ఆమని... నీవు ఎక్స్పోజింగ్ ఎందుకు చేయవే.. అని సౌందర్యను అడిగారట. మన సినిమాలు మన కుటుంబ సభ్యులు కూడా చూస్తారు. భవిష్యత్ లో భర్త, పిల్లలు కూడా చూస్తారు. ఇప్పుడు డబ్బుల కోసం ఎక్స్పోజింగ్ చేస్తే... రేపు వాళ్ళు ఎందుకు ఇలా చేశావ్ అని అడిగితే ఏం సమాధానం చెబుతాం.. అన్నారట సౌందర్య.
Photo courtesy: Mana stars
710
అంత చిన్న వయసులో అఖిల్ తో పర్ఫెక్ట్ గా మూవీ ఎలా చేశారని అడిగితే.. చాలా కష్టపడ్డట్లు ఆమని అన్నారు. సెట్ లో లైట్స్, సౌండ్స్ కారణంగా ఒక్కొక్కసారి అఖిల్ ఏడ్చేవాడు. అమల, నాగార్జున దగ్గర ఉండి ఓదార్చేవారు అన్నారు.
Photo courtesy: Mana stars
810
సిసింద్రీ కోసం చాలా కష్టపడ్డామని.. చిన్న వయసులోనే అఖిల్ ని చాలా కష్టపెట్టాం అని ఆమెని తెలిపారు. అఖిల్ మొదటి బర్త్ డే ఊటీ షూట్ లో జరుపగా... ఆరోజంతా ఎందుకో ఏడుస్తూనే ఉన్నాడని ఆమని ఆరోజులు గుర్తు చేసుకున్నారు ఆమని. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ లో అఖిల్ కి మరోమారు ఆమని అమ్మగా నటిస్తున్నారు.
Photo courtesy: Mana stars
910
స్టార్ హీరోయిన్ గా ఫేమ్ తెచ్చుకున్నప్పటికీ ఆమని, మెగాస్టార్ చిరంజీవితో ఒక్క మూవీ కూడా చేయలేదు. అయితే రిక్షావోడు సినిమాలో ఆమని చేయాల్సి ఉండగా.. చిత్ర దర్శకుడు మారడంతో తనని కూడా ఆ సినిమా నుండి తీసేశారని ఆమని వివరించారు.
Photo courtesy: Mana stars
1010
ఇక వెండితెర దంపతులుగా వెలిగారు జగపతి బాబు, ఆమని. భార్య భర్తలుగా బ్లాక్ బస్టర్స్ కొట్టిన వీరిద్దరూ మరలా అలా కనిపించనున్నారట. సాయి ధరమ్ తేజ్ మూవీతో పాటు ఓ వెబ్ సిరీస్లో ఆమని, జగపతి బాబు భార్య పాత్ర చేస్తున్నారట.
Photo courtesy: Mana stars
Latest Videos