- Home
- Entertainment
- పింక్ డ్రెస్ లో భీమ్లా నాయక్ బ్యూటీ మెరుపులు.. తన్మయత్వంలో సంయుక్త, లిప్స్ హాట్ నెస్ తో టెంప్టింగ్ ఫోజులు
పింక్ డ్రెస్ లో భీమ్లా నాయక్ బ్యూటీ మెరుపులు.. తన్మయత్వంలో సంయుక్త, లిప్స్ హాట్ నెస్ తో టెంప్టింగ్ ఫోజులు
భీమ్లా నాయక్ చిత్రంతో సంయుక్త మీనన్ టాలీవుడ్ లోకి అడుగు పెట్టింది. గ్లామర్ తో పాటు హుషారైన హీరోయిన్ గా సంయుక్త గుర్తింపు సొంతం చేసుకుంది.

భీమ్లా నాయక్ చిత్రంతో సంయుక్త మీనన్ టాలీవుడ్ లోకి అడుగు పెట్టింది. గ్లామర్ తో పాటు హుషారైన హీరోయిన్ గా సంయుక్త గుర్తింపు సొంతం చేసుకుంది. గత ఏడాది బింబిసార చిత్రంతో మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది ఈ మలయాళీ బ్యూటీ.
టైం ట్రావెల్ నేపథ్యంలో సాగిన బింబిసార చిత్రంలో సంయుక్త మీనన్ కళ్యాణ్ రామ్ సరసన హీరోయిన్ గా నటించింది. టాలీవుడ్ లోకి అడుగు పెట్టగానే సంయుక్త మీనన్ కి వరుస విజయాలు దక్కుతున్నాయి.
వరుస విజయాలతో టాలీవుడ్ లో సంయుక్త మీనన్ క్రేజ్ పెరుగుతోంది. సోషల్ మీడియాలో కూడా సంయుక్త సూపర్ యాక్టివ్ గా ఉంటూ ప్రతి అంశాన్ని అభిమానులతో పంచుకుంటోంది.
తాజాగా సంయుక్త మీనన్ ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేసిన ఫొటోస్ మెరుపులు మెరిపిస్తున్నాయి. పింక్ డ్రెస్ లో సంయుక్త మీనన్ వయ్యారాలు ఒలికిస్తూ ఇస్తున్న ఫోజులు చూడ ముచ్చటగా ఉన్నాయి.
పెదవుల అందంతో ఆమె ఊరిస్తున్న ఫోజులు కుర్రాళ్లని టెంప్ట్ చేసే విధంగా ఉన్నాయి. పైట ఎగరేస్తూ, తన్మయత్వంలో ఉన్నట్లు సంయుక్త మెస్మరైజ్ చేస్తోంది.
ఇక ఇటీవల సంయుక్త జిమ్ లో తెగ వర్కౌట్స్ చేస్తోంది. సంయుక్త మీనన్ ఈ రేంజ్ లో కష్టపడుతుంది కాబట్టే అంత అందంగా కనిపిస్తోంది అంటూ నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు.
సంయుక్త మీనన్ ఇదే జోరు కొనసాగిస్తే త్వరలోనే టాలీవుడ్ లో టాప్ లీగ్ లోకి ఎంటర్ కావడం ఖాయంగా కనిపిస్తోంది. ఆమె నటించిన రెండు చిత్రాలు వరుసగా విజయం సాధించడం అదృష్టం అనే చెప్పాలి. ప్రస్తుతం సంయుక్త మీనన్ ధనుష్ సరసన 'సార్' చిత్రంలో నటిస్తోంది.