ఫుడ్ కంటే సెక్స్ నే ఇష్టపడతా.. సమంత సంచలన కామెంట్
టాలీవుడ్ స్టార్ హీరోయిన్, అక్కినేని కోడలు సమంత బోల్డ్ కామెంట్ చేసింది. మీకు ఫుడ్ ఇష్టమా? సెక్స్ ఇష్టమా ? అంటే సంచలన కామెంట్ చేసింది. అభిమానులను షాక్ కి గురి చేసింది.
టాలీవుడ్ టాప్ హీరోయిన్లో ఒకరిగా రాణిస్తున్న సమంత చివరగా ఈ ఏడాది `జాను` సినిమాలో మెరిసింది. ఈ సినిమా సక్సెస్ కాలేకపోయింది.
ప్రస్తుతం సమంత చేతిలో ఒక్క సినిమా కూడా లేదు. కానీ బ్యాక్ టూ బ్యాక్ పలు బ్రాండ్లకు అంబాసిడర్‌గా వ్యవహరిస్తుంది. తన భర్త నాగచైతన్యతో కలిసి స్కాందాన్షి ఇన్ ఫ్రా కంపెనీకి ప్రచారకర్తగా వ్యవహరిస్తుంది. ఓ అరడజన్ యాడ్స్ చేస్తూ ఫుల్ బిజీగా ఉంది.
మరోవైపు `సాకీ` పేరుతో ఫ్యాషన్ డిజైనింగ్ వేర్ని ప్రారంభించిందీ అమ్మడు. అలాగే `యుర్లైఫ్` పేరుతో ఉపాసన ప్రారంభించిన హెల్త్ ఛానెల్‌కి గెస్ట్ ఎడిటర్‌గా వ్యవహరిస్తుంది.
సమంతకి డాగ్ అంటే ఇష్టం. దానికి దగ్గరుండి మరీ ఫీడ్ చేస్తుంది. తనే అన్నీ చూసుకుంటుంది.
సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్‌గా ఉంటూ తన అభిమానులను అలరిస్తున్న సమంతకి ఓ విచిత్రమైన ప్రశ్న ఎదురైంది.
సమంత నేచురల్ అగ్రికల్చర్ చేస్తుంది. తన ఇంట్లోనే కెమికల్ రహిత కూరగాయలు పండిస్తూ ఆదర్శంగా నిలుస్తుంది. ఆరోగ్యానికి పెద్ద పీఠ వేస్తుంది.
మీరు శృంగారానికి ప్రయారిటీ ఇస్తారా? ఫుడ్‌కి ప్రయారిటీ ఇస్తారా? అని సమంతని ప్రశ్నించగా, సామ్ అందుకు సంచలన కామెంట్ చేసింది.
ఎంత ఆకలితో ఉన్నా, ఆహారం కంటే సెక్స్ నే ఇష్టపడతానని తెలిపి షాకింగ్ కామెంట్ చేసింది. దీంతో ఆమె అభిమానులు ఒక్కసారిగా అవక్కవుతున్నారు. సమంత నుంచి ఇలాంటి సమాధానాన్ని ఊహించలేదంటున్నారు.
సమంత, చైతు మ్యారేజ్ జరిగి మూడేళ్ళు పూర్తయ్యింది. ఇప్పటికీ వీరు పిల్లల గురించి ఎలాంటి వార్త చెప్పలేదు. ప్రస్తుతం సినిమాలు చేయడం లేదు, బహుశా పిల్లల కోసం ప్లాన్ చేస్తున్నట్టు వార్తలొస్తున్నాయి.
దీనిపై సమంతని ప్రశ్నించగా, అందుకు సామ్ స్పందిస్తూ, నాకు పిల్లలు ఎప్పుడైతే కావాలని కోరుకుంటానో, నాకు బిడ్డ పుట్టినప్పుడే, ఆ బిడ్డే నాకు ప్రపంచమవుతుంది` అని పేర్కొంది.
సోషల్ మీడియాలో భారీ ఫాలోయింగ్ ఉన్న సమంత ప్రస్తుతం ఇన్‌స్టాగ్రామ్‌లో 13మిలియన్ ఫాలోవర్స్ ని దాటుకుంది.
మరోవైపు ఇటీవల టీవీ ప్రేక్షకులకు సర్ప్రైజ్ ఇచ్చింది సమంత. బిగ్‌బాస్4 లో ఏడో వారం హోస్ట్ గా వచ్చి మెస్మరైజ్ చేసింది.
దసరా స్పెషల్‌గా సాగిన మహాఎపిసోడ్కి హోస్ట్ గా అదరగొట్టింది. దీనికి గానూ సమంత భారీగా పారితోషికం తీసుకుంటున్నట్టు తెలుస్తుంది.