సమంత సోషల్ మీడియా ద్వారా పొందుతున్న సంపాదన తెలిస్తే షాక్ అవ్వాల్సిందే.. సినిమాలకు మించి
కాదేదీ కవితకి అనర్హం అన్నాడో కవి.. కానీ కాదేదీ వ్యాపారానికి అనర్హం అంటున్నారు సినీ తారలు. వాళ్లు ఇంటి నుంచి కాలు బయటపెడితే సంపాదనే అనేది గతం మాట.. ఇంట్లో ఉన్నా సంపాదనే అనేది ఇప్పటి మాటగా మారిపోయింది. సోషల్ మీడియా ద్వారా సమంత పొందుతున్న ఇన్కమ్ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే.
సమంత టాలీవుడ్లో స్టార్ హీరోయిన్. తెలుగు, తమిళంలో ఈ అమ్మడు స్టార్ ఇమేజ్‌తో రాణిస్తుంది. ప్రస్తుతం లేడీ ఓరియెంటెడ్ చిత్రాలకు కేరాఫ్‌గా నిలుస్తుంది. పలు క్రేజీ ప్రాజెక్ట్ ల్లో నటిస్తుంది సమంత. టాలీవుడ్ హీరోయిన్లలో టాప్ రెమ్యూనరేషన్ అందుకుంటోందీ అక్కినేని కోడలు.
ప్రస్తుతం సమంత ఒక్కో సినిమాకి ఐదు కోట్లు తీసుకుంటుందని భోగట్టా. దీంతోపాటు కమర్షియల్ యాడ్స్ తోనూ దూసుకుపోతుంది. కమర్షియల్ యాడ్స్ కి కూడా వాటి వ్యాల్యూని బట్టి కోటిలోపు అందుకుంటోందని టాక్. ప్రస్తుతం అరడజనుకుపైగా యాడ్స్ సమంత చేతిలో ఉన్నాయి.
ఇదిలా ఉంటే సమంతకి ఓ `సాకి` అని లేడీస్‌కి డిజైనర్ వేర్ ఆన్లైన్ బిజినెస్ కూడా ఉంది. దీంతోపాటు `ఏకం` అనే ఫ్రీ స్కూల్‌ని కూడా నడిపిస్తుంది. ఇలా సినిమాలతోపాటు ఈ రూపంలోనూ సమంత బాగానే సంపాదిస్తుంది.
ఇప్పుడు కొత్తగా మరో ఇన్కమ్ సోర్స్ యాడ్ అయ్యింది. సోషల్ మీడియా ద్వారా కూడా సమంత బాగానే పొందుతుందని ప్రచారం జరుగుతుంది. ప్రస్తుతం సమంతకి ఇన్‌గ్రామ్ లో 18 మిలియన్స్ ఫాలోవర్స్ ఉన్నారు. అంటు కోటీ ఎనభై లక్షల మంది సమంతని ఇంటర్నెట్లో ఫాలో అవుతున్నారు. అంటే సమంత పెట్టే ప్రతి పోస్ట్ ని కోటీ ఎనభై లక్షల మంది చూస్తారు. ఇంతటి భారీ రీచ్ ఉంది కాబట్టే సమంతకి సోషల్ మీడియాలోనూ ఫుల్ డిమాండ్ ఏర్పడింది.
ఆ డిమాండ్‌ని క్యాష్ చేసుకుంటోంది సమంత. ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టే ప్రైవేట్ పోస్ట్ లకు ఓ లెక్కుందట. సమంత తన ఇన్‌స్టాలో ఒక్కో యాడ్ పోస్ట్ పెట్టాలంటే ఏకంగా ముప్పై లక్షల వరకు తీసుకుంటుందని టాక్. సినిమాల కంటే ఎక్కువగా ఇలా యాడ్ పోస్ట్ ల ద్వారానే పొందుతుందని టాక్. దీపం ఉన్నప్పుడు ఇళ్లు చక్కబెట్టుకోవడమంటే
ప్రస్తుతం సమంత తెలుగులో `శాకుంతలం` చిత్రంలో నటిస్తుంది. మైథలాజికల్ చిత్రమిది. శకుంతలగా సమంత కనిపించబోతుంది. అయితే తాజాగా ఈ సినిమాలో సమంత పార్ట్ షూటింగ్ పూర్తయ్యిందట. ఈ విషయాన్ని చిత్ర బృందం తెలిపింది.
ఈ సందర్బంగా సమంతకి ధన్యవాదాలు తెలియజేస్తూ కేక్ కట్ చేయించారు. సమంతకి గ్రాండ్‌గా వీడ్కోలు పలికారు. దర్శకుడు గుణశేఖర్ హాస్పిటాలిటీకి సమంత ఫిదా అయ్యింది. ఆయనకు ధన్యవాదాలు తెలిపింది. ఈ సందర్బంగా పంచుకున్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మూడు రోజుల క్రితం బాల భరతుడి పాత్రలో నటిస్తున్న అల్లు అర్జున్ తనయ అల్లు అర్హ పాత్ర షూటింగ్ కూడా పూర్తయిన విషయం తెలిసిందే.
ఇక ఈ చిత్రంలో సమంత, దేవ్ మోహన్, అల్లు అర్హ కీలక పాత్రలు పోషిస్తుండగా, గుణశేఖర్ దర్శకత్వం వహిస్తున్నారు. నీలిమా, దిల్‌రాజు నిర్మిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమాని థియేటర్ లోకి తీసుకురాబోతున్నారు. దీంతోపాటు తమిళంలో `కాథు వాకుల రెండు కాదల్` అనే సినిమాలో నయనతార, విజయ్‌సేతుపతిలతో కలిసి నటిస్తుంది. విఘ్నేష్ శివన్ దర్శకుడు.