మామ నాగార్జున ఇచ్చిన అతిపెద్ద గిఫ్ట్ అదే.. జీవితంలో ఎప్పటికీ వదిలేయలేనుః రివీల్ చేసిన సమంత
First Published Jan 19, 2021, 12:38 PM IST
కింగ్ నాగార్జున తనయుడు, హీరో నాగచైతన్యని స్టార్ హీరోయిన్ సమంత పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. వీరి వివాహ బంధానికి మూడేళ్లు పూర్తయ్యింది. తాజాగా మామ నాగార్జున తనకు ఇచ్చిన అతిపెద్ద గిఫ్ట్ ఏంటో రివీల్ చేసింది సమంత. అది వింటే ఎవ్వరైనా అవాక్కవ్వాల్సిందే.

నాగార్జున, సమంత మామ కోడలు కంటే ఎక్కువ అనుబంధంతో కలిసి ఉంటారు.

నాగార్జున, అమలతోపాటు, చైతన్య, సమంత కూడా చాలా సార్లు విదేశాలకు టూర్లకి వెళ్లిన సందర్భాలు కూడా ఉన్నాయి.

నాగ్ ఫ్యామిలీలో తొందరగా కలిసిపోయింది సమంత. సామ్‌లోని చలాకీ, ఓపెన్ మైండ్ సెట్టే అందుకు కారణమని చెప్పొచ్చు.

చైతూతో పెళ్లి సందర్భంగా కూడా సమంత.. నాగ్ని హగ్ చేసుకుని అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది.

ఇటీవల నాగార్జున, సమంత కలిసి కలిసి గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లోనూ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మామ విసిరిన ఛాలెంజ్‌ని స్వీకరించిన సమంత, మూడు మొక్కలను నాటారు. అంతేకాదు కీర్తిసురేష్, రష్మిక మందన్నా, శిల్పారెడ్డిలను నామినేట్ చేశారు.

సమంత, నాగార్జున కలిసి `రాజుగారి గది 2`లోనూ నటించారు. వీరి కాంబినేషన్‌కి మంచి పేరొచ్చింది. దీంతోపాటు `మనం`లోనూ వీరు నటించిన విషయం తెలిసిందే.

ఇదిలా ఉంటే ఇటీవల సమంత తన అభిమానులతో సోషల్ మీడియాలో ఛాట్ చేసింది. ఈ సందర్భంగా ఫ్యాన్స్ అడిగిన పలు ప్రశ్నలకు సమాధానం చెప్పింది సమంత.

ఓ అభిమాని ఇప్పటి వరకు మీకు నాగార్జున ఇచ్చిన అతిపెద్ద గిఫ్ట్ ఏంటి? అని ప్రశ్నించారు. అందుకు సమంత, ఏ వస్తువో, మరేదైనా ఖరీదైన వస్తువో చెబుతారని అంతా ఊహించారు. కానీ అందుకు భిన్నంగా స్పందించింది సమంత.


నా లైఫ్‌లో నాగార్జున మామ ఇచ్చిన అతిపెద్ద గిఫ్ట్ `ఎస్` చెప్పడమే అని తెలిపింది. ఈ లెక్కన నాగచైతన్యతో తమ ప్రేమని అంగీకరించి, పెళ్లికి `ఎస్` చెప్పడమే అతిపెద్ద గిఫ్ట్ అని పేర్కొంది. ఇంత కంటే పెద్ద గిఫ్ట్ తనకేది ఉండదని, దాన్ని జీవితాంతం వదులుకోనని చెప్పింది సమంత.

వీరి వివాహం 2017 అక్టోబర్7న వైభవంగా జరిగింది. టాలీవుడ్ చిత్ర పరిశ్రమ మొత్తం కదిలి వచ్చింది.

మరోవైపు చైతూతోనూ ఎంతో అన్యోన్యంగా ఉంటుంది సమంత. వీరిది ప్రస్తుతం టాలీవుడ్లో చూడముచ్చటైన జంటగా చెప్పుకుంటున్నారు.
