- Home
- Entertainment
- HBD Samantha: శకుంతలగా మతిపోగొడుతున్న సమంత, ఏంటా అందం.. 'యశోద' నుంచి క్రేజీ అప్డేట్
HBD Samantha: శకుంతలగా మతిపోగొడుతున్న సమంత, ఏంటా అందం.. 'యశోద' నుంచి క్రేజీ అప్డేట్
సౌత్ స్టార్ హీరోయిన్ సమంత నేడు తన 35వ జన్మదిన వేడుకలు జరుపుకుంటోంది. 'ఏమాయ చేశావే' చిత్రంతో టాలీవుడ్ లోకి అడుగుపెట్టిన సామ్ తొలి చిత్రం నుంచే మాయ చేయడం మొదలు పెట్టింది.

Samantha
సౌత్ స్టార్ హీరోయిన్ సమంత నేడు తన 35వ జన్మదిన వేడుకలు జరుపుకుంటోంది. 'ఏమాయ చేశావే' చిత్రంతో టాలీవుడ్ లోకి అడుగుపెట్టిన సామ్ తొలి చిత్రం నుంచే మాయ చేయడం మొదలు పెట్టింది. వరుస విజయాలతో స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. ఫ్యామిలీ మ్యాన్ 2 వెబ్ సిరీస్ తో సమంత నార్త్ లో కూడా క్రేజ్ సొంతం చేసుకుంది.
Samantha
ప్రేమ, పెళ్లి వ్యవహారాలతో కూడా సమంత హాట్ టాపిక్ గా మారింది. గత ఏడాది నాగ చైతన్య నుంచి విడిపోవడం అభిమానులకు బిగ్ షాక్. విడాకుల తర్వాత సమంత సినిమాల విషయంలో ఇంకా జోరు పెంచింది. ప్రస్తుతం సామ్ మూడు చిత్రాల్లో నటిస్తోంది. తమిళ తెలుగు ద్విభాషా చిత్రం కన్మణి రాంబో ఖతీజా నేడు విడుదలవుతోంది.
Samantha
గుణశేఖర్ దర్శకత్వంలో పౌరాణిక చిత్రం 'శాకుంతలం' లో శకుంతలగా సామ్ నటిస్తోంది. సమంత కెరీర్ లోనే ఇది బిగ్ బడ్జెట్ మూవీ. మరోవైపు పాన్ ఇండియా చిత్రం యశోదలో కూడా సామ్ లీడ్ రోల్ లో నటిస్తోంది. ఈ రెండు చిత్ర యూనిట్స్ నుంచి సామ్ ఫాన్స్ కి బర్త్ డే ట్రీట్ అందింది.
Samantha
శాకుంతలం టీం కొత్త పోస్టర్ రిలీజ్ చేస్తూ సమంతకి బర్త్ డే విషెస్ తెలిపింది. ఈ పోస్టర్ లో సమంత నిజంగానే దేవకన్యలాగా వెలిగిపోతోంది. తెల్ల చెరలో సమంత మతిపోగోట్టే విధంగా శకుంతల లుక్ లో కనిపిస్తోంది. పోస్టర్ డిజైన్, సమంత మేకోవర్ అదుర్స్ అనే చెప్పాలి.
Samantha
క్రేజీ డైరెక్టర్ గుణశేఖర్.. దుష్యంతుడు, శకుంతల కథని అద్భుత దృశ్యకావ్యంగా వెండితెరపై ఆవిష్కరించబోతున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటోంది. ఇక సమంత నటిస్తున్న మరో మూవీ యశోద. సమంత బర్త్ డే సందర్భంగా క్రేజీ అప్డేట్ ఇచ్చారు. యశోద ఫస్ట్ గ్లింప్స్ ని మే 5న ఉదయం 11.07 గంటలకు రిలీజ్ చేయబోతున్నట్లు ప్రకటించారు.
Samantha
ప్రస్తుతం సమంత నార్త్ లో కూడా హాట్ టాపిక్ గా మారింది. ఫ్యామిలీ మ్యాన్ 2 తర్వాత హిందీలో కూడా ఆమెకు వరుస అవకాశాలు వస్తున్నాయి. త్వరలో సమంత తాను బాలీవుడ్ లో నటించబోయే ప్రాజెక్ట్స్ ప్రకటించనుంది.