- Home
- Entertainment
- ప్రాణభయంతో బుల్లెట్ ప్రూఫ్ కారు కొన్న సల్మాన్.. భాయ్ ప్రాణానికి కృష్ణజింకను వేటాడిన కేసుకి సంబంధం తెలుసా?
ప్రాణభయంతో బుల్లెట్ ప్రూఫ్ కారు కొన్న సల్మాన్.. భాయ్ ప్రాణానికి కృష్ణజింకను వేటాడిన కేసుకి సంబంధం తెలుసా?
బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్.. సెక్యూరిటీ పెంచుకుంటున్నాడు. బెదిరింపుల నేపథ్యంలో ఆయన అనూహ్యంగా మార్పులు చేపట్టారు. తాజాగా ఆయన బుల్లెట్ ప్రూఫ్ కారు కొన్నట్టు సమాచారం.

సల్మాన్ ఖాన్(Salman Khan) సెక్యూరిటీ పెంచుకుంటున్నాడు. ఇటీవలే లైసెన్స్ గన్ తీసుకున్నారు. ఇప్పుడు బుల్లెట్ ప్రూఫ్ కారు కొన్నాడు. తాజాగా ఆయన కొత్త కారు ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతుంది. అనేక లగ్జరీ కార్లు కలిగిన సల్మాన్.. ఉన్నట్టుండి సడెన్ గా బుల్లెట్ ప్రూఫ్ కారు కొనడానికి కారణం ఇప్పుడు సర్వత్రా హాట్ టాపిక్ అవుతుంది. పెద్ద రచ్చ లేపుతుంది.
సల్మాన్ ఖాన్ తాజాగా ఎయిర్ పోర్ట్ వద్ద తన కొత్త కారుతో కనిపించారు. టయోటా ల్యాండ్ క్య్రూయిజ్ ఎస్‌యువీ కారు అది. దాని గ్లాసెస్ చాలా మందంగా కనిపిస్తున్నాయి. చూస్తుంటే బుల్లెట్ ప్రూఫ్(Salman Khan Bullet Proof Car) కారని తెలుస్తుంది. హిందీ మీడియాలో ఈ వార్త వైరల్‌గా మారుతుంది. అయితే దీని విలువ సైతం షాకిస్తుంది. కోటిన్నర రూపాయలతో సల్మాన్ ఈ కొత్త కారు కొన్నట్టు తెలుస్తుంది.
బుల్లెట్ ప్రూఫ్ కారు కనిపించడంతో సరికొత్త కథనాలు తెరపైకి వస్తున్నాయి. సల్మాన్ ఈ అనూహ్య మార్పులు చేపట్టడానికి కారణం ఆయనకు వస్తోన్న బెదిరింపులే అని తెలుస్తుంది. ఇటీవల పంజాబీ సింగర్ సిద్దు మూసేవాలాకి పట్టిన గతే పడుతుందంటూ దొరికిన చీటీనే ఇప్పుడు సల్లూభాయ్ భయాందోళనకు గురి చేస్తుంది. అభిమానులను కలవర పెడుతుంది. దీంతో వెంటనే ఆయన లైసెన్స్ గన్ తీసుకున్నారని, దీనికితోడు ఇప్పుడు బుల్లెట్ ప్రూఫ్ కారుని కొనడం జరిగిందంటున్నారు.
సల్మాన్‌కి గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ నుంచి బెదిరింపులు వచ్చాయి. ఆయన ఇటీవల పంజాబీ సింగర్ సిద్దూ మూసేవాలాని మర్డర్ చేసిన విషయం తెలిసిందే. సింగర్ హత్యలో ఆయన ప్రధాన నిందితుడిగా ఉన్నారు. మరోవైపు లారెన్స్ అతిపెద్ద క్రైం సిండికేట్‌ని నడిపిస్తున్నారు. అందులో భాగంగా ఇప్పుడు సల్లూభాయ్‌ని బెదిరించారని తెలుస్తుంది.
బిష్ణోయ్ బెదిరింపులకు ప్రధాన కారణం సల్మాన్ ఖాన్ పై ఉన్న కృష్ణ జింకని వేటాడిన కేసు అని తెలుస్తుంది. కృష్ణజింకని బిష్ణోయ్ వంశస్థులు దేవుడితో సమానంగా భావిస్తారు. దేవుడికి మరో అవతారంగా కొలుస్తుంటారు. దీని వల్లే ఆయన సల్మాన్‌పై కక్ష పెంచుకున్నట్టు సమాచారం. అయితే ఇప్పటికే 2018లో ఓ వీడియోలో పోలీసుల ముందే సల్మాన్ ఖాన్‌ని చంపుతానని బెదిరింపులకు దిగాడు లారెన్స్ బిష్ణోయ్. 2020లో ఏకంగా సల్మాన్ ఇంటి వద్ద ఈ గ్యాంగ్‌స్టర్ కి చెందిన వ్యక్తి రెక్కీ నిర్వహించినట్టు పోలీసులు గుర్తించారు. అతను ఏకంగా నాలుగు లక్షలు పెట్టి ఓ గన్ కూడా కొన్నట్టుగా ముంబయి పోలీసులు చెబుతున్నారు.
ఇవన్నీ చూస్తుంటే అనేక అనుమానాలకు, అనేక భయాందోళనలకు గురి చేస్తుంది. సల్మాన్ వంటి సూపర్ స్టార్‌కే బెదిరింపులు రావడం, రెక్కీ నిర్వహించడం, ఇప్పుడు బెదిరింపు నోట్ రావడంతో అందరిని కలవరానికి గురి చేస్తుంది. గతంలో ఇలాంటి బెదిరింపుల నేపథ్యంలో సల్మాన్‌కి ప్రభుత్వం భద్రత కల్పించారు. ఇప్పుడు సల్మాన్ సైతం తన భద్రతని పెంచుకోవడం విశేషం. మొత్తంగా సల్మాన్ కృష్ణజింకని వేటాడిన కేసు ఇప్పుడు ఆయన ప్రాణాలకే ముప్పుగా మారడం అత్యంత విచారకరం.
god father
సల్మాన్ ఖాన్ ప్రస్తుతం `కభీ ఈద్ కభీ దివాళీ` చిత్రంలో నటిస్తున్నారు. ఇందులో పూజా హెగ్డే కథానాయికగా నటిస్తుండగా, వెంకటేష్ కీలక పాత్ర పోషిస్తున్నారు. మరోవైపు రామ్‌చరణ్ సైతం ఓ పాటలో గెస్ట్ గా మెరవనున్నారు. దీంతోపాటు `టైగర్ 3` చిత్రంలో నటిస్తున్నారు సల్మాన్. తెలుగులోకి ఎంట్రీ ఇస్తూ ఆయన చిరంజీవి `గాడ్ ఫాదర్`లో గెస్ట్ రోల్ చేస్తుండటం విశేషం.