- Home
- Entertainment
- Samantha: సమంతని ఆట పట్టించిన సద్గురు.. మిమ్మల్ని చూస్తే నా పేరు కూడా మరచిపోతానన్న సామ్
Samantha: సమంతని ఆట పట్టించిన సద్గురు.. మిమ్మల్ని చూస్తే నా పేరు కూడా మరచిపోతానన్న సామ్
ఇటీవల సమంత హైదరాబాద్ లో సద్గురుతో జరిగిన సేవ్ సాయిల్ కార్యక్రమంలో పాల్గొంది. సద్గురుని సామ్ ఇంటర్వ్యూ చేసింది.

నాగ చైతన్యతో బ్రేకప్ తర్వాత సమంత బాగా బిజీగా మారిపోయింది. బాలీవుడ్ లో కూడా నటించేందుకు సామ్ రెడీ అవుతోంది. సమంత ఇటీవల నటించిన కన్మణి రాంబో ఖతీజా ఏప్రిల్ 28న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సమంత నటించిన అసలైన చిత్రాలు త్వరలో రిలీజ్ కు రెడీ అవుతున్నాయి. పాన్ ఇండియా మూవీ 'యశోద' ఆగస్టులో రిలీజ్ కి రెడీ అవుతోంది. అలాగే పౌరాణిక చిత్రం శాకుంతలం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటోంది.
అటు సినిమాల పరంగా, ఇటు సోషల్ మీడియాలో సమంత మామూలు బిజీగా లేదు. ఇటీవల సమంత ఇంస్టాగ్రామ్ ని గమనిస్తే మునుపెన్నడూ లేని విధంగా బోల్డ్ ఎక్స్ ఫోజింగ్ తో రెచ్చిపోతోంది. అలాగే సమంత ఆధ్యాత్మికంగా కూడా యాక్టివ్ అవుతోంది. చైతో బ్రేకప్ సమయంలో సమంత పలు దేవాలయాలని దర్శించిన సంగతి తెలిసిందే.
samantha
ఇటీవల సమంత హైదరాబాద్ లో సద్గురుతో జరిగిన సేవ్ సాయిల్ కార్యక్రమంలో పాల్గొంది. సద్గురుని సామ్ ఇంటర్వ్యూ చేసింది. ఈ కార్యక్రమం ప్రారంభం అయ్యే ముందు సద్గురు సమంతని సరదాగా అట పట్టించారు. సామ్ ప సద్గురు వేసిన జోకులు నవ్వులు పూయించాయి.
సమంత ఈ కార్యక్రమానికి ఆలస్యంగా వచ్చింది అని సద్గురు అన్నారు. ఎందుకంటే ఆమె బయలుదేరే సమయానికి నేను ఎల్లో కుర్తా ధరించినట్లు ఎవరో చెప్పారు. దీనితో సమంత మళ్ళీ బట్టలు మార్చుకు ఆలస్యంగా వచ్చింది అంటూ సద్గురు సరదాగా కామెంట్స్ చేశారు. సద్గురు కామెంట్స్ కి సమంత పగలబడి నవ్వుతూ కనిపించింది.
సామ్ కూడా యెల్లో డిజైన్ ఉన్న శారీలోనే ఈ కార్యక్రమానికి హాజరైంది. ఇక సామ్ మాట్లాడుతూ నేను సాధారణంగా ప్రశ్నలు అడిగేందుకు నోట్స్ క్యారీ చేయను. కానీ మిమ్మల్ని చూస్తే నా పేరు కూడా నేను మరచిపోతాను. అందుకే ఈ చీటీలు తెచ్చుకున్నా అని సామ్ ఫన్నీగా కామెంట్స్ చేసింది.
సమంత ఇలాంటి బహిరంగ కార్యక్రమంలో పాల్గొని చాలా కాలం అయిందనే చెప్పాలి. సమంత, సద్గురు మధ్య ఈ కార్యక్రమంలో అనేక విషయాలపై చర్చ జరిగింది.