రికార్డ్ క్రియేట్ చేసి, సైలెంట్‌గా ఫ్యామిలీతో వెకేషన్ ఎంజాయ్ చేస్తున్న `కేజీఎఫ్` స్టార్ యష్
First Published Jan 19, 2021, 1:28 PM IST
రాక్ స్టార్ యష్ ఇటీవల `కేజీఎఫ్2` టీజర్‌తో ఇండియన్ సినిమా రికార్డ్లను తిరగరాశారు. ఈ టీజర్ 120 మిలియన్స్ కిపైగా వ్యూస్‌ని రాబట్టి రికార్డ్ సృష్టించింది. ఈ మేనియా నుంచి బయటపడ్డా యష్ ఇప్పుడు ఎంజాయ్ చేస్తున్నారు. తన ఫ్యామిలీతో కలిసి మాల్డీవులకు చెక్కేశారు.

మాల్దీవుల్లో రాక్ స్టార్ యష్ ఫ్యామిలీతో సరదాగా వెకేషన్ గడుపుతున్న ఫోటోలను ఆయన ఇన్ స్టాగ్రామ్ ద్వారా పంచుకున్నారు.

ఈ సందర్భంగా యష్ `ఉష్టమండల స్వర్గం ఉంటే, అదిప్పుడు ఇలా ఉంటుంది. మాల్దీవులకు మేం వచ్చాం` అని పేర్కొన్నారు యష్.

ఫ్యామిలీతో మాల్లీవుల్లో దిగిన ఫోటోలను పంచుకున్నారు. ఇందులో భార్య రాధికా పండిట్, ఇద్దరు పిల్లలున్నారు.

ప్రస్తుతం యష్ హాలిడేస్ ఫోటోలు సోషల్ మీడియాలో విశేషంగా వైరల్ అవుతున్నాయి. ఫ్యాన్స్ ని అలరిస్తున్నాయి.

యష్ భార్య రాధిక బీచ్‌కి అనువైన డ్రెస్‌లో కనిపిస్తుంది. గ్లామరస్‌గా, స్టయిలీష్‌గా ఆకట్టుకుంటుంది. ఆమె నటిగా రాణించిన విషయం తెలిసిందే. ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.

2016 ఆగస్ట్ 12న ఎంగేజ్మెంట్ చేసుకున్న వీరిద్దరు, డిసెంబర్ 9న వివాహం చేసుకున్నారు. వీరికి కూతురు ఆయరా, కుమారుడు యతర్వ్ ఉన్నారు.

యష్ ప్రస్తుతం `కేజీఎఫ్‌ః ఛాప్టర్2`లో నటిస్తున్నారు. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రమిది. దాదాపు చిత్రీకరణ పూర్తి చేసుకుంది.

ఈ సమ్మర్లో విడుదలకు సిద్ధమవుతుంది. ఇటీవల విడుదలైన టీజర్ దేశ వ్యాప్తంగా రికార్డ్ వ్యూస్‌ని పొంది సినిమాపై భారీ అంచనాలను పెంచింది.
