- Home
- Entertainment
- Guppedantha Manasu: మా ఆయన నా కొడుకుని మిస్ అవుతున్నారంటూ రిషీతో డైరెక్టుగా మాట్లాడిన జగతి!
Guppedantha Manasu: మా ఆయన నా కొడుకుని మిస్ అవుతున్నారంటూ రిషీతో డైరెక్టుగా మాట్లాడిన జగతి!
Guppedantha Manasu: బుల్లితెరపై ప్రసారమవుతున్న గుప్పెడంత మనసు (Guppedantha Manasu) సీరియల్ తల్లి కొడుకుల ప్రేమ అనే నేపథ్యంలో కొనసాగుతుంది. పైగా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. కాగా ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం.

రిషి, వసు (Vasu) లు ఒకచోట ఉండగా ఆ క్రమంలో వసు ప్రాజెక్ట్ కు మీరు జగతి మేడం ఇద్దరు రెండు కళ్ళ లాంటి వారు అని అంటుంది. మీ ఇద్దరి వల్లే ప్రాజెక్ట్ అంత పైకి వచ్చింది అని అంటుంది. ఇక ఆ మాటలు రిషి (Rishi) ఏమాత్రం పట్టించుకోకుండా వసు పై చిరాకు పడుతూ ఉంటాడు.
ఇక వసు (Vasu) రిషి చేయిని దగ్గరగా లాక్కుని నేను మనస్ఫూర్తిగా చెప్పిన మాటలు సార్ అని అంటుంది. ఆ క్రమంలో ఒకరికొకరు కళ్ళలో కళ్ళు పెట్టుకొని చూసుకుంటారు. ఇక రిషి (Rishi) ముద్దుపెట్టుకుంటునట్టుగా వసు దగ్గరికి వెళ్లి వసు జడలో ఉన్న క్లిప్ తీస్తాడు.
వసు (Vasu) దుప్పటి ముసుగేసుకుని రిషి తో టెక్స్ట్ చేస్తూ ఉండగా ఈలోపు అది గమనించిన జగతి (Jagathi) దుప్పటి లాగేస్తుంది. ఇక జగతి ఏం చేస్తున్నావ్ అని అడగగా మీ అబ్బాయి తో చాట్ చేస్తున్న అని అంటుంది. మిషన్ ఎడ్యుకేషన్ గురించి మాట్లాడుతున్నాము అని కవర్ చేస్తుంది.
ఇక ఆ తర్వాత జగతి (Jagathi) రిషి మనసుకు వసు రిలీఫ్ గా ఉంటుంది అని అనుకుంటుంది. కాలేజీలో మహేంద్ర రిషి ను కలుస్తాడు. అంతేకాకుండా నేను జగతి దగ్గరికి వెళ్ళాను కానీ నీకు దూరం అవ్వలేదు అని అంటాడు. అదే క్రమంలో రిషి (Rishi) మీరు ఎంత దూరం వెళ్ళినా నా మనసు మీ నీడలా నీ వెంటే ఉంటుంది అని అంటాడు.
ఆ తరువాత రిషి (Rishi) క్లాసు కి వెళ్లి అక్కడ వసు నోట్ బుక్ ఆడగకుండా వేరే ఒక అమ్మాయి నోట్ బుక్ అడుగుతాడు. అంతేకాకుండా జరిగిన టాపిక్ గురించి మళ్ళీ చెబుతాడు. ఈ క్రమంలో రిషి వసు (Vasu) ను క్లాస్ లో అందరి ముందు పిచ్చిదాన్ని చేస్తాడు.
ఇక తరువాయి భాగంలో జగతి (Jagathi) రిషి దగ్గరకు వచ్చి మా ఆయన టాబ్లెట్లు వేసుకోవడం లేదు. మా ఆయన మా కొడుకుని మిస్ అవుతున్నారు అని రిషి (Riahi) తో జగతి డైరెక్ట్ గా ఉంటుంది. ఇక ఈ క్రమంలో రేపటి భాగంలో ఏం జరుగుతుందో చూడాలి.