Guppedantha Manasu: వసుని మాటలతో బాధ పెడుతున్న దేవయాని..బాధతో కుమిలిపోతున్న వసు..?
Guppedantha Manasu: తెలుగు బుల్లితెరపై గుప్పెడంత(Guppedantha Manasu) మనసు సీరియల్ కుటుంబ కథా నేపథ్యంలో కొనసాగుతూ ప్రేక్షకులను అలరిస్తూ దూసుకుపోతోంది. కాగా ఈ రోజు ఏప్రిల్ 29 న ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం..

ఎపిసోడ్ ప్రారంభంలో మహేంద్ర(Mahendra), రిషిని నిలదీస్తూ వసుని అర్హతతో ఇంట్లోకి పిలుచుకొని వచ్చావు అని అడుగుతాడు. అప్పుడు దేవయాని కూడా అదే మాట అడగడంతో అప్పుడు వసు అక్కడి నుంచి వెళ్ళి పోతూ ఉండగా రిషి,(rishi) వసు చేయి పట్టుకొని నువ్వు ఎక్కడికి వెళ్ళడానికి వీలు లేదు అని ఇంట్లోకి పిలుచుకొని వస్తాడు.
అప్పుడు దేవయాని(devayani)తో మాట్లాడుతూ పెద్దమ్మ తనకు ఒక కష్టం వచ్చింది అని అనడంతో అప్పుడు దేవయాని మాట్లాడుతుండగా ఇంతలో పనింద్ర ఇప్పుడే మాట్లాడకు అని అంటాడు. మీరు లోపలికి వెళ్ళిండి రిషి అని చెబుతాడు ఫణింద్ర. రిషి(rishi), వసు చేయి పట్టుకొని ఇంట్లోకి తీసుకొని వెళ్తాడు. ఆ తర్వాత పనింద్ర, అమ్మ ధరణి అసలు ఏం జరిగిందో వసు ని అడిగి నాకు మళ్ళీ చెప్పు అని అనడంతో ధరణి సరే మామయ్య అని అంటుంది.
దేవయాని మాత్రం కోపంతో రగిలిపోతూ ఉంటుంది. ఆ తరువాత వసు(vasu),దగ్గరికీ వెళ్లిన జగతి వసు ను ఓదారుస్తుంది. ఆ తర్వాత వసు జరిగినదంతా జగతికీ వివరిస్తుంది. ఇంతలో అక్కడికి మహేంద్ర,ధరణి(dharani) వచ్చి మీకు అండగా ఉంటాము అని దైర్యం చెబుతారు. ఆ తర్వాత మహేంద్ర, రిషి ని అడిగిన ప్రశ్నలకు జగతి సీరియస్ అవుతుంది.
మరొకవైపు గౌతమ్ (Gautham),రిషి వసు గురించి మాట్లాడుకుంటూ వుంటారు. ఇంతలో అక్కడికి వచ్చిన మహేంద్ర ఎంత మందికి ఇలా ఆన్సర్ చెప్పకుండా దాటేస్తావు అని అంటాడు. వారు ముగ్గురు కలిసి కాసేపు మాట్లాడుకుంటూ ఉంటారు. ఆ తర్వాత అందరూ అడిగిన మాటలకు రిషి (rishi)పక్కకు వెళ్లి ఒంటరిగా ఆలోచిస్తూ ఉంటాడు.
వసు కీ,నాకు మధ్య అందరూ అనుకుంటున్న విధంగా నిజంగానే ప్రేమ ఉందా అని ఆలోచిస్తూ ఉంటాడు. ఆ తరువాత కిచెన్ లోకి వెళ్ళి వసు(vasu) కీ కాఫీ చేసి ఇస్తాడు. జరిగినదాని గురించి మాట్లాడుతూ ఉంటారు. అదంత కూడా చాటుగా దేవయాని వింటూ ఉంటుంది. ఇంతలో ఇంట్లోనే ఉన్న జగతి(jagathi) కీ ఫోన్ చేసి, వసు నిన్ను పిలుస్తుంది అని చెబుతుంది.
ఆ తరువాత వసు(vasu) ఒంటరిగా కూర్చుని బాధపడుతూ ఉండగా ఇందులో జగతి అక్కడికి వచ్చి చెప్పు వసు అనగా ఇంతలో అక్కడికి వచ్చిన దేవయాని (devayani )నేను నిన్ను రమ్మని పిలిచాను అని అంటుంది. ఆ తర్వాత లేనిపోని మాటలు అని వసుధార ని బాధ పెడుతుంది. రేపటి ఎపిసోడ్ లో భాగంగా ఏం జరుగుతుందో చూడాలి మరి.