పెళ్లి చేసుకునేవాడికి ఉండాల్సిన క్వాలిటీస్ రివీల్ చేసిన రష్మిక మందన్నా.. ఆ లక్షణాలు మీలో ఉన్నాయా?
నేషనల్ క్రష్ రష్మిక మందన్నా పెళ్లిపై ఓపెన్ అయ్యింది. తనకు కావాల్సిన వాడు ఎలా ఉండాలో చెప్పేసింది. తనిని పెళ్లి చేసుకునే వాడికి ఉండాల్సిన లక్షణాలను రివీల్ చేసి షాక్ ఇచ్చింది. దీంతో ఇప్పుడు క్యూ పెరిగిపోతుందట.
క్రేజీ బ్యూటీ రష్మిక మందన్నా.. షార్ట్ టైమ్ శాండల్‌వుడ్ నుంచి బాలీవుడ్‌కి ఎదిగింది. కన్నడ, తెలుగు, తమిళం, హిందీ సినిమాలతో బిజీగా ఉంది. బాలీవుడ్లో పలు క్రేజీ ప్రాజెక్ట్ లో నటిస్తుంది.
తాజాగా `గుడ్ బై` సినిమా షూటింగ్ గ్యాప్‌లో అభిమానులతో ముచ్చటించింది రష్మిక. ఈ సందర్భంగా పలు ఆసక్తికర విషయాలను వెల్లడించింది. ఫ్యాన్స్ అడిగిన ప్రశ్నలకు ఓపికగా, తనదైన స్టయిల్లో సమాధానాలు తెలిపారు.
ఓ నెటిజన్లు `మీలాంటి అందమైన అమ్మాయిని పెళ్లి చేసుకోవాలంటే ఉండాల్సిన క్వాలిటీస్ ఏంట`ని ప్రశ్నించాడు. దీనికి స్ట్రెయిట్‌గా సమాధానం చెప్పింది రష్మిక.
మంచి వ్యక్తిత్వం కలిగి ఉండాలని తెలిపింది. ఎలాంటి హంగులు, ఆర్బాటాలు లేని ఓ సాధారణ వ్యక్తిగా కనిపించాలని పేర్కొంది. రష్మిక చెప్పిన సమాధానానికి నెటిజన్లు షాక్ అవుతున్నారు.
ఆమె చెప్పిన క్వాలిటీస్ మాలో ఉన్నాయని చాలా మంది నెటిజన్లు పోటీ పడుతున్నారట. రష్మికకి రిక్వెస్ట్ లు పెడుతున్నారట. దీంతో ఈ భామకి కొత్త తలనొప్పి తలెత్తబోతుందని చెప్పొచ్చు.
అంతేకాదు ఓ నెటిజన్ ఏకంగా నన్ను పెళ్లి చేసుకుంటావా? అని ప్రశ్నించాడు. దీంతో కనీసం ప్రపోజల్ అయినా మంచిగా చేయమని మూతి తిప్పుకుంటూ కౌంట్ ఇచ్చింది.
దీంతోపాటు స్పోకింగ్పై ఆమె స్పందిస్తూ తనకు స్పోకింగ్ అంటే అసహ్యమని, అలాంటి వారి పక్కన కూడా నిల్చోనని తెలిపింది.
తనకు విజయ్ దేవరకొండ బెస్ట్ ఫ్రెండ్ అని తెలిపింది. అల్లు అర్జున్ మంచి హార్డ్ వర్కర్ అని, మంచి వ్యక్తి అని తెలిపింది.
దళపతి విజయ్ అంటే ఇష్టమని చెబుతూ ఆయనతో కలిసి నటించాలని ఉందని పేర్కొంది. మరోవైపు ప్రపంచంలో ఎవరూ పర్ఫెక్ట్ కాదని, తనలోనూ లోపాలున్నాయని తెలిపింది.
రష్మిక ప్రస్తుతం తెలుగులో `పుష్ప` చిత్రంలో నటిస్తుంది. అలాగే `ఆడవాళ్లు మీకు జోహార్లు` అనే మరో సినిమా చేస్తుంది. హిందీలో `మిషన్ మజ్ను`, `గుడ్‌బై`తోపాటు మరో సినిమాకి కమిట్ అయ్యింది రష్మిక.