రేటు భారీగా పెంచిన రష్మిక మందన్నా. మేకర్స్ ను గట్టిగా డిమాండ్ చేస్తోన్న శ్రీవల్లి
నేషనల్ క్రష్ రష్మిక మందన్నా డిమాండ్ పెరిగిపోయింది. దాంతో రేటు కూడా భారీగా పెంచిందట శ్రీవల్లి. మేకర్స్ ను గట్టిగా అడిగిమరీ వసూలు చేస్తోందట. ఇంతకీ రష్మిక ఎంత వసూలు చేస్తోంది.

పుష్ప సినిమా తరువాత ఆ తర్వాత వరుస ఆఫర్లు రావడంతో రష్మిక డిమాండ్ పెరిగిపోయింది. పాన్ ఇండియా రేంజ్ లో ఆఫర్లు వస్తుండటంతో.. ప్రస్తుతం ఈ నేషనల్ క్రష్ ఫుల్ బిజీగా మారిపోయింది. తెలుగు, తమిళంలోనే కాకుండా హిందీలోనూ వరుస సినిమాలతో దూసుకెళ్తుంది. సీతారామం లాంటి సినిమాల్లో అప్పుడప్పుడు ప్రత్యేక పాత్రల్లోనూ కనిపించి అభిమానులను అలరిస్తుంది.
తాజాగా సీతారామం సినిమాలో ఓ స్పెషల్ క్యారెక్టర్‌లో చేసి ఆకట్టుకుంది రష్మిక..ముస్లిం అమ్మాయిగా డిఫరెంట్ పాత్రలో కనిపించింది. ఇలా వరుస సినిమాలు.. వరుసగా హిట్లతో దూసుకెళ్తూ తన గ్రాఫ్‌ని పెంచుకున్న రష్మిక.. తాజాగా తన రెమ్యునరేషన్‌ని కూడా భానీగా పెంచేసిందట.
పుష్ప కంటే ముందు రష్మిక కోటి నుంచి రెండు కోట్ల మధ్యలో తీసుకునేదట. కానిఇప్పుడు అమ్మడిస్థాయి భారీగా పెరగడంతో పారితోషికం ఏకంగా నాలుగు కోట్లకు పెంచేసిందట. మేకర్స్ ను గట్టిగా డిమాండ్ చేస్తుందట. అయితే తాను చేస్తున్న బాలీవుడ్ సినిమాలకు 4 కోట్లు, సౌత్ సినిమాలు ముఖ్యంగా తెలుగు సినిమాలకు 3 కోట్లు రెమ్యుషనరేషన్‌గా ఇవ్వాలంటుందట.
రష్మీకా మందన్నా ఇటీవల బాలీవుడ్ ఆఫర్స్ ని సొంతం చేసుకుంది. సిద్ధార్థ్ మల్హోత్రాతో కలిసి `మిస్టర్ మజ్ను` చిత్రంలో నటిస్తుంది. దీంతోపాటు అమితాబ్‌తో కలిసి మరో సినిమా చేయబోతుందని టాక్. ఈ సినిమాల షూటింగ్‌లు ముంబయిలో జరుగుతుండటంతో విజయ్, రష్మిక కలుసుకుంటున్నారని టాక్.
ఇక రష్మిక స్టార్ డమ్ దృష్టిలో ఉంచుకుని.. పాన్ ఇండియా స్థాయిలో ఆమెకు ఉన్న డిమాండు ను చూసుకుని.. తమ సినిమాల కోసం భారీ మొత్తంలో పారితోషికం ఇవ్వడానికి నిర్మాతలు కూడా సరే అంటున్నారట. దాంతో కన్నడ కస్తూరి ఆడింది ఆట.. పాడింది పాటగా మారిపోయింది.
ఈ వార్తల్లో నిజం ఎంతో తెలియదు కాని.. ప్రస్తుతం స్టార్ హీరోలు రెమ్యూనరేషన్ తగ్గించుకుని నిర్మాతలను నష్టాల నుంచి బయట పడేయాలంటూ.. కోరుకుంటుంటే.. హీరియన్లు ఇలా డిమాండ్ చేస్తుండటం.. చర్చనీయాంశం అయ్యింది.
మొత్తానికి రష్మిక దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకోవాలి అన్న సామెతను ఫాలో అవుతోంది. హీరోయిన్ల కెరీర్ చాలా తక్కువ టైమ్ ఉంటుంది. అందుకే ముందే గట్టిగా వెనకేసుకుంటుంది బ్యూటీ. మరి ముందు ముందు ఎంత పెంచుతుందో.. మేకర్స్ ఏం చేస్తారో చూడాలి.