- Home
- Entertainment
- రెడ్ శారీలో సూపర్ హాట్ గా రాశీ ఖాన్నా, కియారా- సిద్ధార్థ్ సిసెప్షన్ లో తళుక్కుమన్న తార
రెడ్ శారీలో సూపర్ హాట్ గా రాశీ ఖాన్నా, కియారా- సిద్ధార్థ్ సిసెప్షన్ లో తళుక్కుమన్న తార
రెడ్ శారీలో దేవకన్యలా మెరిసింది హీరోయిన్ రాశీ ఖాన్నా. సిద్దార్ధ్, కియారా వెడ్డింగ్ రిసెప్షన్ లో తళ్ళుక్కున మెరిసింది టాలీవుడ్ బ్యూటీ. ఈవెంట్ ప్రత్యేకంగా నిలిచింది.

టాలీవుడ్ టాప్ హీరోయిన్లలో రాశీ ఖన్న ఒకరు. తెలుగులో వరుస సినిమాలు.. వరుస విజయాలతో దూసుకుపోయిన బ్యూటీ.. ఈమధ్య కాస్త వెనకబడింది. ఈక్రమంలోనే బాలీవుడ్ లో ఎక్కువగా అవకాశాల కోసం చూస్తోంది. అక్కడే సినిమాలు చేస్తోంది కూడా.
సినిమాలతో పాటు.. వెబ్ సిరీస్ లపై కన్నేసిన ఈ బ్యూటీ.. బాలీవుడ్ ఫంక్షన్స్ లో కూడా మెరుపులు మెరిపిస్తోంది. నిన్న జరిగిన బాలీవుడ్ జంట కియారా అద్వాని, సిద్దార్థ్ మల్హోత్రా వెడ్డిండ్ రిసెప్షన్ లో ప్రత్యేకంగా నిలిచింది బ్యూటీ. అందానికి అందం అద్దినట్టు ఉంది చిన్నది.
ఎరుపు చీరలో.. ఎరుపెక్కిన అందాలతో మెస్మరైజ్ చేసింది బ్యూటీ. కాస్త ఎద అందాలు బయటపడేలా.. నడుము సోగసులు బయటపడేలా ఆమె డ్రెస్సింగ్ స్టైల్ కు అంతా ఫిదా అవుతున్నారు.
పార్టీ మొత్తంలో ప్రత్యేకంగా నిలిచింది రాశీ ఖన్నా.. ఈవెంట్ లోకి ఎంటర్ అయిన రాశీ.. ఫోటోలకు ఫోజులిస్తుంటే.. తదేకంగా ఆమెనే గమనించారు అతిధులు. అటు రాశీ కూడా మునిపటికంటే కూడా ఎక్కువగా అందాన్ని పోగేసుకుని వచ్చినట్టుంది.
ఊహలు గుసగుసలాడే చిత్రంతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన రాశి యువతలో మంచి క్రేజ్ తెచ్చుకుంది. వరుస సినిమాలు చేసింది కానీ స్టార్ హీరోయిన్ అనిపించుకోలేకపోయింది. ఇక ఈ మధ్య రాశి ఖన్నాకి అంతగా కలసి రావడం లేదు.
గత ఏడాది రాశి ఖన్నాకి ఏమాత్రం కలసి రాలేదు. ఆమె నటించిన పక్కా కమర్షియల్, థాంక్యూ సినిమాలు బ్యాక్ టు బ్యాక్ డిజాస్టర్స్ గా నిలిచాయి. దీనితో రాశి ఖన్నా తన కెరీర్ రీ చెక్ చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.
ప్రస్తుతం రాశి ఖన్నా తమిళంలో కొన్ని సినిమాలు చేస్తోంది. వాటితో పాటు బాలీవుడ్ లోకూడా ప్రయత్నాలు చేస్తోంది. కొత్త హీరోయిన్ల హవా నేపథ్యంలో రాశి ఖన్నాకి పోటీ తప్పడం లేదు. హిందీలో ఫార్జి అనే వెబ్ సిరీస్ లో రాశి ఖన్నా ప్రత్యేక పాత్రను చేసింది. అవకాశాల కోసం చూస్తోంది.