ఆకలితో అలమటించా.. చీకటిలో బతికా.. రణ్‌వీర్‌ సింగ్‌ భావోద్వేగం..

First Published Dec 11, 2020, 12:23 AM IST

రణ్‌వీర్‌ సింగ్‌.. బాలీవుడ్‌లో నెపోటిజం అనే జాడ్యాన్ని పక్కన పెట్టి, ప్రతిభ ఉంటే ఏ శక్తి ఆపలేదని నిరూపించిన, నిరూపించుకున్న నటుడు. యంగ్‌ ఏజ్‌లోనే స్టార్‌ హీరోగా ఎదిగారు. ఆ ఐదుగురు స్టార్లకి అతీతంగా ఎదిగి తనకంటూ ఓ ఇమేజ్‌ని, గుర్తింపుని సొంతం చేసుకున్నారు. అద్భుత నటనతో గర్వించదగ్గ నటుడిగా రణ్‌వీర్‌ సింగ్‌ ఎదిగిన వైనం స్ఫూర్తిదాయకం.

రణ్‌వీర్‌ ఒక అనుపమానమైన నటుడు. వైవిధ్యమైన కథలతో, పాత్రలో మెస్మరైజ్‌ చేస్తూ వస్తున్నారు. తనలోని నటుడిని కొత్తగా ఆవిష్కరిస్తూనే ఉన్నాడు. `బ్యాండ్‌ బాజా బారాత్‌`లో ప్రేమికుడైన బిట్టూ శర్మగా, `లూటేరా`లో బంగారు మనస్సు ఉన్న దొంగగా, `రామ్‌లీలా`లో దూకుడుతో కూడిన ప్రేమికుడుగా, `బాజీరావు మస్తానీ`లో   రాజపుత్రయోధుడు పేష్వా బాజీరావ్‌గా, ప్రేమికుడిగా, `దిల్‌ దడక్‌నే దో` లో కూల్‌, కాంప్లికేటెడ్‌ కబీర్‌ మెహతాగా, `పద్మావత్‌`లో క్రూరుడైన అల్లావుద్దీన్‌ ఖిల్జీగా, `సింబా`లో   అవినీతిని అంతమొందించేందుకు కంకణం కట్టుకున్న అవినీతిపరుడైన పోలీసుగా, `గల్లీబాయ్‌`లో మైమరపింపజేసే వీధి గాయకుడైన మురాద్‌గా ఇలా విభిన్న పాత్రల్లో విలక్షణ   నటనతో కనువిందు చేస్తున్నారు. అబ్బురపరుస్తున్నారు.  ఆయన గురువారం కెరీర్‌ ప్రారంభించి పదేళ్లు పూర్తి చేసుకున్నారు. ఆయన నటించిన తొలి సినిమా `బ్యాండ్‌ బాజా   బరాత్‌` విడుదలై డిసెంబర్ పదితో పదేళ్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా ఆయన పలు ఆసక్తిక విశేషాలను పంచుకున్నారు.

రణ్‌వీర్‌ సింగ్‌ తన పదేళ్ళ కెరీర్‌నీ విశ్లేషిస్తూ,..  నేను నటుడిగా పదేళ్లు పూర్తి చేసుకోవడం నా జీవితంలో అతి పెద్ద మైలురాయి, మొదటి చిత్రానికి సెలక్ట్‌ కావడమే. ఆ క్షణాన్ని అంతా సులభంగా మర్చిపోలేను. ఆ క్షణాన్ని   గుర్తు చేసుకుంటే ఇప్పటికీ నా రోమాలు నిక్కబొడుచుకుంటాయి. నాలాంటి నేపథ్యం నుంచి వచ్చినవారు ఈ స్థాయికి చేరడమన్నది కలకు కూడా అందని ఊహ. ఆ కలలన్నీ   నిజమయ్యాయి. నటుడిగా, పబ్లిక్‌ ఫిగర్‌గా, సృజనాత్మక వ్యక్తిగా నేర్చుకోవడం, ఎదగడం, అభివృద్ధి అంతా కూడా విధి ఆడిన నాటకంలో భాగమే.

సంవత్సరం గడుస్తున్న కొద్ది, చేస్తున్న ప్రతీ సినిమా ద్వారా ఈ కళ గురించి ఏదో ఒకటి నేను నేర్చుకుంటూనే ఉన్నాను. నా గురించి తెలుసుకుంటూ నా నైపుణ్యాన్ని   మెరుగుపరుచుకునే ప్రయత్నం చేస్తున్నాను. ప్రతీ సినిమాతో, ప్రతీ పాత్రతో నన్ను నేను అన్వేషించుకోవాలని ఆశిస్తాను. ఈ ప్రయాణంలో కలుసుకున్న ప్రతీ ఒక్కరు నన్ను   బాగా అర్థం చేసుకొని ఉంటారని భావిస్తున్నా. ప్రతీ అనుభవం, ప్రతీ సినిమా నన్ను సుసంపన్నం చేసింది. ప్రతీ ఒక్కరికి, ప్రతీ అవకాశానికి నేను కృతజ్ఞతలు చెప్పుకుంటున్నా.

హీరోగా రాణించడం నుంచి ఇప్పుడున్న పరిస్థితులపై రణ్‌వీర్‌ స్పందిస్తూ,...   నేను ఎదుర్కొన్న సంఘర్షణ అంత సులభమైనది కాదు.  ఆ సమయంలో మాంద్యం కారణంగా  సినిమా వ్యాపారం అంతా ఫలప్రదంగా లేదు. జనాలు కూడా సినిమాలు తక్కువ   చూసేవారు. కాబట్టి, నేటితో పోల్చితే ఆ రోజుల్లో నటులకు అవకాశాలు కూడా చాలా తక్కువే లభించేవి. మాకు వెబ్‌ వేదికలు, ఓటీటీ వేదికలు లేవు. మంచి అవకాశాలు చాలా   అరుదుగా వచ్చేవి. మొదటి మూడు, మూడున్నర సంవత్సరాలు నా పోర్టుఫోలియో పట్టుకొని ప్రతీ ఆఫీసు చుట్టు తిరిగాను. పని కోసం పడరాని పాట్లు పడుతూ చీకట్లోనే   మగ్గిపోయాను.

ప్రముఖ హిందీ సినిమాల్లో కీలక పాత్రలు పోషించే అవకాశం నాకు దొరుకుతుందనే ఆలోచన కూడా అప్పట్లో కలుగకపోయేది. అయినప్పటికీ నేను శ్రమించాను. నా తల్లిదండ్రుల   ప్రేమ, ఆశీర్వదాలు, త్యాగాలు, చేయూతతో నిలదొక్కుకునేందుకు నేను ప్రయత్నించాను. చాలాసార్లు ఆకలితో తల్లడిల్లాను, కొన్నిసార్లు తెలివితక్కువగా వ్యవహరించాను, ఏది   ఏమైనా నేను పట్టుదలగా ఉన్నాను.  నేను ప్రయత్నాలు ప్రారంభించినప్పుడు నా వయస్సు 21, నాకు అద్భుతమైన అవకాశం వచ్చింది 24లో.  ఆ కథలన్నీ చెరిగిపోని   జ్ఞాపకాలే. `పటియాల హౌస్‌` చిత్రంలో ఓ చిన్నపాత్రతో నేను తెరంగేట్రం చేసేవాడినే. అనురాగ్‌ ప్రత్యక్షంగా/పరోక్షంగా రూపొందిస్తున్న చిన్న బడ్జెట్‌ చిత్రాల్లో కూడా దాదాపుగా   నేను నటించాను. సంఘటనలు ఎలా మొదలయ్యాయో, ఇప్పుడు ఎలా ముందుకు సాగుతున్నానో చూస్తే అనురాగ్‌ సర్‌, నిఖిల్‌ సర్‌ బహుశా ఆశ్చర్యపోతారేమో.

తన కెరీర్‌ మలుపుతిరగడం గురించి చెబుతూ,..  నా తొలి చిత్రం విడుదలైనప్పుడు నాకు జరిగిన సంఘటనలు, కెరీర్‌లో ఎదుర్కొన్న దెబ్బలు, నా ఈ ప్రయాణమూ ఏది నేను కల్లో కూడా ఊహించలేదు. నాకు జరిగిన, నాతో   జరిగిన, నా చుట్టుపక్కల జరిగిన విషయాలేవి కూడా నేను కలగనలేదు. ఇలాంటిది జరుగుతుందని ఊహించే దృష్టి నాకు లేదు.  ఏదో ఒకటి జరిగిపోతుందని నేను   అనుకున్నాను, ఇలా జరుగుతుందని నేను కలలో కూడా ఊహించలేదు. గొప్ప కలలు కనమని చెప్తారు, కాని నేనేప్పుడు అలాంటి కలగనలేదు. ఇవాళ నేను ఉన్న స్థితిని   చూసుకుంటే నాకంతా అవాస్తవంగానే అనిపిస్తుంది.

వారసత్వం గురించి చెబుతూ,...  నాదైన ముద్ర ఉండేలా ప్రతీరోజు నేను కష్టపడుతున్నాను. నేను గర్వపడేలా నా చిత్రాలు ఉండాలన్నది నా కోరిక. కళారంగానికి నేను గణనీయ తోడ్పాటు అందించడమే కాదు,   నా సీనియర్లు నాకు ఎలాగైతే ప్రేరణగా నిలిచారో ఇతర కళాకారులకు నేనూ ప్రేరణగా నిలవాలని కోరుకుంటున్నాను. చరిత్ర అందరినీ ఎప్పటికీ గుర్తుపెట్టుకోవాలన్నది మా   ఆకాంక్ష. ఈ రంగంలోని మనుషులకు ఇదే సహజమే.

నేను చేసే సినిమాలు దేశంలోనే ఉత్తమమైనవిగా నిలిచిపోవాలని. గొప్ప ఎంటర్‌టైనర్‌గా, ఒక వైవిధ్యభరితమైన నటుడిగా గుర్తుండిపోవాలని నేను కోరుకుంటున్నాను. ఇవన్నీ   గొప్ప లక్ష్యాలు. నేను ఎంచుకున్న రంగం అంటే హిందీ చిత్రసీమలో పనిచేయడం ద్వారా నా దేశాన్ని గర్వంగా నిలబెట్టేందుకు నేను ప్రతీ రోజు నా వంతు కృషి చేస్తున్నాను. నా   లక్ష్యాన్ని ఇంకా వివరంగా చెప్పాలంటే ప్రజలకు కేవలం వినోదాన్ని అందించాలన్నది నా అభిమతం.

Today's Poll

మీరు ఎంత మందితో ఆన్ లైన్ గేమ్స్ ఆడడానికి ఇష్టపడుతారు?