- Home
- Entertainment
- Janaki Kalaganaledu: జ్ఞానంబ మీద గృహహింస కేసు పెట్టిన యోగి.. తల్లడిల్లిపోతున్న రామచంద్ర!
Janaki Kalaganaledu: జ్ఞానంబ మీద గృహహింస కేసు పెట్టిన యోగి.. తల్లడిల్లిపోతున్న రామచంద్ర!
Janaki Kalaganaledu: బుల్లితెరపై ప్రసారమవుతున్న జానకి కలగనలేదు (Janaki Kalaganaledu) సీరియల్ తల్లి కొడుకుల మధ్య ప్రేమ అనే నేపథ్యంలో కొనసాగుతుంది. పైగా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. కాగా ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం.

మల్లిక (Mallika) ఉగాది పండుగ రోజున ఆనందంగా అందరూ ఈ పండగను జరుపుకుందాం అంటూ హడావిడి చేస్త్తుంది. కానీ ఫ్యామిలీ మొత్తం రామచంద్ర జానకి లు ఇంటిలో లేనందుకు ఉగాది పండుగను లైట్ తీసుకుంటారు. మరో వైపు జానకి (Janaki) రామచంద్రలు ఉగాది పండుగను ఆనందంగా జరుపుకుంటూ ఉంటారు.
ఇక జ్ఞానాంబ (Jnanaamba) ఆనందంగా ఉగాది పచ్చడి తయారు చేస్తూ ఉంటుంది. ఇక గోవిందరాజు (Govinda raju) అందరూ బాధతో ఉంటే ఉగాది పండుగ ఎలా జరుపుకుంటారు జ్ఞానం అని అంటాడు. ఇక జ్ఞానాంబ ఈరోజు నుంచి కొత్త సంవత్సరం.. కొందరు మన దగ్గర నుంచి వెళ్లిపోయిన అంతమాత్రాన కాలం ఆగదు కదా అని అంటుంది.
ఇక గోవింద రాజు (Govinda raju) జానకి రామచంద్రల ను ఉగాది పచ్చడి తినండి అని పెడతాడు. ఆ తర్వాత జ్ఞానాంబ (Jnanaamba) నా కొడుకుని ఈ అమ్మకు వ్యతిరేకంగా ఉండే స్థాయికి నా కొడుకుని మార్చేసింది అని మనసులో అనుకుంటూ ఉంటుంది.
ఆ తర్వాత జానకి (Janaki), రామచంద్రులు గుడికి వెళతారు. ఇక గుడిలో జానకి.. తల్లి గురించి కొడుకు.. కొడుకు గురించి తల్లి బాధపడుతూ ఉన్నారు. నా విషయంలో ఏదైనా తప్పు జరిగితే నన్ను క్షమించు అని దేవతను కోరుకుంటుంది. మరోవైపు యోగి పోలీస్ స్టేషన్ కు వెళ్లి జ్ఞానాంబ (Jnanaamba) మీద గృహ హింస కేసు పెడతాడు.
ఒకవైపు జ్ఞానంబ.. జానకి (Janaki) దంపతులు అంటున్న పూరి గుడి లోకి వెళుతుంది. అక్కడ జ్ఞానాంబ (Jnanaamba) ఫోటో ను చూసి కొడుకు ప్రేమను గ్రహించుకుంటుంది. మనిద్దరం ఇలా దూరంగా ఉండడానికి కారణం కేవలం నీ భార్య కారణం నాన్న అని బాధపడుతుంది.
ఇక రేపటి భాగం లో పోలీసులు జ్ఞానంబ (Jnanaamba) ను జీప్ లో ఎక్కించుకొని తీసుకుని వెళతారు. ఇక అదే క్రమంలో అటుగా సైకిల్ వేసుకుని వస్తున్న రామ చంద్ర చుస్తాడు. గట్టిగా అమ్మ.. అమ్మ అని అరచుకుంటూ ఆ జీప్ వెంటపడతాడు. ఇక ఈ క్రమంలో రేపటి భాగంలో రామచంద్ర (Ramachandra) పోలీసులపై ఎలా రియాక్ట్ అవుతాడో చూడాలి.