- Home
- Entertainment
- చిరు నుంచి ఎన్టీఆర్ వరకు రామ్‌తో అన్‌సీన్ ఫోటోలు... టాలీవుడ్ హీరోల్లో అరుదైన ఘనత `రాపో`దే!
చిరు నుంచి ఎన్టీఆర్ వరకు రామ్‌తో అన్‌సీన్ ఫోటోలు... టాలీవుడ్ హీరోల్లో అరుదైన ఘనత `రాపో`దే!
ఎనర్జిటిక్ స్టార్ రామ్ టాలీవుడ్‌లో అరుదైన ఘనత సాధించారు. అంతేకాదు బర్గ్ డే బాయ్ రామ్ అన్‌సీన్ ఫోటోలు సందడి చేస్తున్నాయి. చిరంజీవి, బాలయ్య, వెంకీ, మహేష్, ప్రభాస్, రామ్‌చరణ్, ఎన్టీఆర్‌లతో చిత్రాలు తెగ వైరల్ అవుతున్నాయి.
114

నేడు(శనివారం-మే 15న) బర్త్ డే జరుపుకుంటోన్న రామ్ ఎనర్జిటిక్ స్టార్ గా టాలీవుడ్ లో ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు. డైలాగ్‌ల్లో, నటనలో, డాన్సుల్లోనూ ఆయన ఎనర్జీ కనిపిస్తుంది. అంతగా ఆయన వెండితెరపై మెరుస్తూ ఆడియెన్స్ కి ఎనర్జీనిస్తుంటారు.

214
మిగిలిన స్టార్స్ లా కాకుండా పూర్తి ప్రైవేట్ లైఫ్‌ని ఇష్టపడతారు రామ్. ఆయన ఈవెంట్లకి, ఫంక్షన్లకి చాలా వరకు దూరంగానే ఉంటారు. చాలా అరుదుగానే బయట కనిపిస్తుంటారు.

314
ఎన్ని ఫెయిల్యూర్స్ వచ్చినా రామ్ ఇమేజ్ ఏమాత్రం తరగనిది. సక్సెస్ ఫెయిల్యూర్‌కి అతీతంగా ఆయన హీరోగా రాణిస్తుంటారు. అదే సమయంలో రామ్ కెరీర్ ప్రారంభం నుంచి చాలా సెటిల్డ్ గానే సాగుతుంది.

414
కానీ `ఇస్మార్ట్ శంకర్`తో ఒక్కసారిగా ఇండస్ట్రీకి పెద్ద షాక్ ఇచ్చాడు. ఈ సినిమా ఊహించని విధంగా వంద కోట్లు కలెక్ట్ చేయడం విశేషం. పూరీ మార్క్ డైరెక్షన్, మాస్ ఎలిమెంట్స్, రామ్ ఎనర్జీ తోడవ్వడంతో సినిమా బాక్సాఫీసు బొమ్మని బద్దలు కొట్టింది.

514
ఇదిలా ఉంటే రామ్ గురించి ఓ అరుదైన విషయం బర్త్ డే సందర్భంగా చక్కర్లు కొడుతుంది. ఆయన నటించిన నాలుగు సినిమాలు బాలీవుడ్‌లో డబ్ అయి రికార్డ్ వ్యూస్‌నిసాధించాయి.

614
`ఇస్మార్ట్ శంకర్` హిందీ డబ్బింగ్ వర్షన్ వంద మిలియన్ వ్యూస్‌ని సాధించాయి. వీటితో పాటు మరో మూడు సినిమాలు ఈ మార్క్ ని చేరుకున్నాయి. టాలీవుడ్ హీరోలకు సంబంధించి బ్యాక్ టూ బ్యాక్ నాలుగు సినిమాలు హిందీ డబ్ వెర్షన్‌లో వంద మిలియన్స్ వ్యూస్‌ని రాబట్టుకోవడం రామ్ సినిమాలకే సాధ్యమైంది. అందుకే ఆయన అరుదైన ఘనత సాధించారు.

714
మరోవైపు బర్త్ డే సందర్భంగా టాలీవుడ్ బిగ్ స్టార్స్ తో రామ్ ఉన్న పలు అరుదైన, అన్‌సీన్ ఫోటోలు వైరల్ అవుతున్నాయి. చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, ప్రభాస్, మహేష్, ఎన్టీఆర్, రామ్‌చరణ్ వంటి హీరోలతో ఆయన ఉన్న చిత్రాలు సోషల్ మీడియాలో చక్కర్లుకొడుతున్నాయి.

814
బర్త్ డే సందర్భంగా రామ్ గురించి ఓ లుక్కేస్తే.. రామ్ పోతినేని మే 15, 1988న మురళీ పోతినేని, పద్మశ్రీ దంపతులకు జన్మించారు. ప్రముఖ సినీ నిర్మాత `స్రవంతి`రవికిశోర్ తమ్ముడే మురళీ పోతినేని. పెదనాన్న అడుగుజాడల్లో నడుస్తూ.. సినిమాలపై వైపు వచ్చాడు. 2002లో తమిళంలో తెరకెక్కిన అడయాళం అనే షార్ట్ ఫిలిమ్‌తో రామ్ తన యాక్టింగ్ కెరీర్‌ని ప్రారంభించారు.

914
2006లో వైవీఎస్ చౌదరీ దర్శకత్వం వహించిన `దేవదాస్` చిత్రంతో వెండితెరకు పరిచయం అయ్యాడు. తొలి సినిమాలోనే రామ్ అదరగొట్టాడు. తన నటన, డ్యాన్స్‌కు తెలుగు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఈ సినిమా హిట్‌తో రామ్‌కి తెలుగులో వరుసగా ఆఫర్లు వచ్చాయి. రెండో చిత్రం `జగడం`పరాజయం చెందినప్పటికీ నటుడిగా రామ్‌కి మంచి పేరొచ్చింది.

1014
ఆ తర్వాత శ్రీను వైట్ల దర్శకత్వంలో `రెడీ`తో బాక్సాఫీస్ వద్ద సత్తా చాటాడు. `కందిరీగ`తో మరో సక్సెస్ కొట్టాడు. ఆ తర్వాత `మస్కా`, `రామరామ కృష్ణకృష్ణ`, `ఎందుకంటే ప్రేమంట`, `ఒంగోలు గిత్త`, `మసాలా`, `పండగ చేస్కో`, `హైపర్`, `హలో గురు ప్రేమ కోసమే` వంటి చిత్రాల్లో నటించగా అన్నీ అంతగా ఆకట్టుకోలేదు.

1114
ఈ క్రమంలో ఆయన పూరీ జగన్నాథ్‌తో `ఇస్మార్ట్ శంకర్` బాక్సాఫీస్‌ని షేక్ చేయడంతోపాటు అటు పూరీకి, ఇటు రామ్‌కి పూర్వవైభవాన్ని తీసుకొచ్చింది. ఇది వంద కోట్లు కలెక్ట్ చేయడం విశేషం.

1214
దిలా ఉంటే రామ్.. వెంకటేష్‌తో `మసాలా` అంటూ మల్టీస్టారర్ సినిమా చేశారు. అలాగే రీసెంట్‌గా `రెడ్`లో ద్విపాత్రాభినయం చేశారు. ఈ రెండు సినిమాలు ఆయన కెరీర్‌లో స్సెషల్ మూవీస్‌గా నిలిచాయి.

1314
ప్రస్తుతం రామ్ లింగుస్వామి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు.

1414
ప్రభాస్‌తో రామ్, అన్‌సీన్ ఫోటో.
ప్రభాస్‌తో రామ్, అన్‌సీన్ ఫోటో.
Latest Videos