'హిట్' ఫేమ్ శైలేష్ కొలను డైరక్షన్ లో ‘గేమ్ ఛేంజర్’షూటింగ్..
శాసన సభ వ్యవస్థను నిర్దేశించే ఎన్నికల అధికారి పాత్రలో చరణ్ నటిస్తున్న సంగతి తెలిసిందే. కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రం..

పెద్ద సినిమాలకు ఫస్ట్ యూనిట్ డైరక్టర్,సెకండ్ యూనిట్ డైరక్టర్ ఉంటూంటారు. కీ సీన్స్, హీరో కు సంభందించిన సీన్స్ మెయిన్ డైరక్టర్ డైరక్ట్ చేస్తే..ఇన్సర్ట్ సీన్స్, హీరోలేని సీన్స్ సెకండ్ యూనిట్ డైరక్టర్ తీస్తూంటారు. లేకపోతే సినిమా స్పీడుగా ఫినిష్ కాదు. అది రెగ్యులర్ గా జరిగే వ్యవహారమే. అయితే హాలీవుడ్ సినిమాకు వేసినట్లు మనకు క్రెడిట్ కార్ట్స్ లో ఆ విషయం ప్రస్తావన రాదు. ఇప్పుడు శంకర్, రామ్ చరణ్ కాంబోలో రూపొందుతున్న గేమ్ ఛేంజర్ సినిమాకు హిట్ సినిమా దర్శకుడు శైలేష్ కొలను కొన్ని సీన్స్ షూట్ చేసినట్లు ఫిల్మ్ నగర్ వర్గాల సమాచారం. వివరాల్లోకి వెళితే...
శంకర్ దర్శకత్వంలో ప్యాన్ ఇండియా రేంజ్ లో వందల కోట్ల బడ్జెట్ తో రూపొందుతున్న ఈ పొలిటికల్ కం యాక్షన్ డ్రామా గేమ్ చేంజర్ . ఈ సినిమాలో శాసన సభ వ్యవస్థను నిర్దేశించే ఎన్నికల అధికారి పాత్రలో చరణ్ నటిస్తున్న సంగతి తెలిసిందే. కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రం ఓ రేంజ్ లో ఉంటుందని ఇన్ సైడ్ టాక్ బలంగా ఉంది. ఈ నేపధ్యంలో ఈ సినిమాకు సంభందించిన ప్రతీ వార్తా ఆసక్తికరంగా మారిపోయింది.
తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం టాలెంటెడ్ ఫిల్మ్ మేకర్ శైలేష్ కొలను ఈ సినిమాకు సంభందించిన కొన్ని ఇన్సర్ట్ సీన్స్ కు దర్శకత్వం వహించారనే వార్త బయిటకు వచ్చింది. నిన్న శుక్రవారం ఈ షూట్ జరిగిందని, మళ్లీ సోమ,మంగళవారాల్లో ఈ షూట్ ఉండబోతోందని వార్త. ఈ షూట్ లో లీడ్ ఆర్టిస్ట్ లు లేరని, మిగతా కొంతమంది ఆర్టిస్ట్ లతో ఈ సీన్స్ తీసారని, అవి కీ సీన్స్ అని వినికిడి. హైదరాబాద్ శంకరపల్లి రోడ్ల మీద ఈ షూట్ జరిగిందని సమాచారం.
ఇక ఇండియన్ 2 కోసం దర్శకుడు శంకర్ గేమ్ చేంజర్ కి బ్రేక్ ఇచ్చారు. ఆ షూట్ లో బిజీగా ఉన్నారు. దాంతో రామ్ చరణ్ మీద తీసే కీ సీన్స్ కు సంభందించిన షూట్ తిరిగి ఎప్పుడు మొదలవుతుందాని ఎదురు చూస్తున్నారు. 2024 సంక్రాంతికి వచ్చే అవకాశం లేదని ప్రచారం జరుగుతోంది. సమ్మర్ కి రిలీజ్ ఉండే అవకాసం ఉందంటున్నారు. అంటే పోస్ట్ ప్రొడక్షన్ పనులు వేగమందుకుంటే తప్ప ఖచ్చితంగా చెప్పలేని పరిస్థితి.
అయితే మరో ప్రక్క టాలీవుడ్ క్రేజీ బజ్ ప్రకారం ఈ మూవీ 2023, డిసెంబర్ 22న రిలీజ్ చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. 2024 జనవరికి మరికొన్ని సినిమాలు రిలీజ్ కి రెడీ అవుతుండడంతో ఈ డేట్ ని గేమ్ ఛేంజర్ మేకర్స్ లాక్ చేశారట. అయితే దీని పై మేకర్స్ నుండి అఫీషియల్ గా ప్రకటన మాత్రం రావాల్సి ఉంది.
ఇదిలా ఉంటే ఈ క్లారిటీ లేకపోవటంతో చరణ్ ఫ్యాన్స్ ఈ విషయమై మండిపడుతున్నారు. కమల్ హాసన్ మీద ప్రత్యేక శ్రద్ధతోనే రామ్ చరణ్ ది శంకర్ పూర్తిగా పక్కన పెడుతున్నారనే అభిమానుల అభియోగం. ట్విట్టర్ ఫ్యాన్స్ ఈ విషయం మీదే నిరంతర చర్చలు జరుగుతున్నాయి.
ఈ మూవీని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. థమన్ సంగీతం అందిస్తున్న ఈ మూవీలో అంజలి, ఎస్ జె సూర్య, జయరామ్, సునీల్, శ్రీకాంత్, సముద్రకని, నవీన్ చంద్ర, నాజర్, రాజీవ్ కనకాల తదితరులు కీలక పాత్రలు చేస్తున్నారు.
ఇక విక్టరీ వెంకటేష్ 75వ లాండ్ మార్క్ మూవీ 'సైంధవ్' కు టాలెంటెడ్ ఫిల్మ్ మేకర్ శైలేష్ కొలను దర్శకత్వం వహిస్తున్నారు. నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ పై వెంకట్ బోయనపల్లి ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. హై-ఆక్టేన్ యాక్షన్ ఎంటర్ ట్రైనర్ రూపొందుతున్న ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.
చిత్ర యూనిట్ రీసెంట్ గా మరో కీలక షెడ్యూల్ షూటింగ్ ని పూర్తి చేసుకుంది. హీరో వెంకటేష్ తో పాటు శ్రద్ధా శ్రీనాథ్, రుహాని శర్మ ఇతర తారాగణం సెట్స్ లో వున్న వీడియోని పంచుకున్నారు మేకర్స్. నెక్స్ట్ ఫైనల్ మిషన్ వైపు దూసుకు వెళ్తున్నట్లు మేకర్స్ తెలియజేశారు. ఈ చిత్రంలో ప్రముఖ తారాగణం కనిపిస్తోంది.
బాలీవుడ్ వెర్సటైల్ యాక్టర్ నవాజుద్దీన్ సిద్ధిఖీ ఈ చిత్రంతో టాలీవుడ్ అరంగేట్రం చేస్తున్నారు. మనోజ్ఞ పాత్రలో శ్రద్ధా శ్రీనాథ్ హీరోయిన్ గా నటిస్తుండగా, డాక్టర్ రేణు పాత్రలో రుహాని శర్మ, జాస్మిన్ పాత్రలో ఆండ్రియా జెర్మియా కనిపించనున్నారు. ఇప్పటికే విడుదలైన వారి ఫస్ట్ లుక్స్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ చిత్రానికి సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్నారు. ఎస్ మణికందన్ కెమెరామెన్ గా, గ్యారీ బిహెచ్ ఎడిటర్ గా, అవినాష్ కొల్లా ప్రొడక్షన్ డిజైనర్ గా పని చేస్తున్న ఈ చిత్రానికి కిషోర్ తాళ్లూరు సహ నిర్మాత.