- Home
- Entertainment
- `గేమ్ ఛేంజర్`ని ఈ ఏడాది రిలీజ్ చేస్తారా?.. దిల్ రాజు, శంకర్‌లపై ట్రోల్స్.. మంచి డేట్ మిస్ చేశారే
`గేమ్ ఛేంజర్`ని ఈ ఏడాది రిలీజ్ చేస్తారా?.. దిల్ రాజు, శంకర్‌లపై ట్రోల్స్.. మంచి డేట్ మిస్ చేశారే
నిర్మాత దిల్ రాజు పేరు తరచూ వినిపిస్తుంది. ఎక్కువగా ఆయనపై ట్రోల్స్ జరుగుతుంటాయి. ఇప్పుడు రామ్‌చరణ్ ఫ్యాన్స్ టార్గెట్ చేశారు. అందుకు `గేమ్ ఛేంజర్` కారణం కావడం విశేషం.

rc15
దిల్ రాజు మొన్న సంక్రాంతికి ట్రోల్ అయ్యాడు. ఆయన కారణంగా `గుంటూరు కారం` సినిమాపై గట్టిగా ఎఫెక్ట్ పడింది. ఇప్పుడు ఆయన సొంత సినిమా విషయంలోనే ట్రోల్‌కి గురవుతున్నాడు. `గేమ్ ఛేంజర్` విషయంలో రామ్‌చరణ్ ఫ్యాన్స్ ఆడుకుంటున్నారు. సోషల్ మీడియా వేదికగా దిల్ రాజుని, ఆయన ప్రొడక్షన్ కంపెనీపై ఫైర్ అవుతున్నారు. నానా రచ్చ చేస్తున్నారు. మరి కారణం ఏంటనేది చూస్తే..
`గేమ్ ఛేంజర్` మూవీ ఈ సమ్మర్‌కి వస్తుందని భావించారు. కానీ రావడం లేదని ఇటీవల దిల్ రాజు తెలిపారు. సెప్టెంబర్‌లో విడుదల చేస్తామని తెలిపారు. సెప్టెంబర్ మొదటి వారంలోగానీ, రెండో వారంలోగానీ వస్తుందని భావించారు. అయితే చాలా వరకు సెప్టెంబర్ 27న మంచి టైమ్ అని భావించారు. అదే రోజు `గేమ్ ఛేంజర్` వస్తుందని అనుకున్నారు. చిత్ర వర్గాల నుంచి అదే ఊహాగానాలు వినిపించాయి. కానీ అధికారిక ప్రకటన రాలేదు.
అయితే ఇప్పుడు పవన్ కళ్యాణ్ నటిస్తున్న `ఓజీ` మూవీ అదే డేట్‌కి తీసుకురాబోతున్నారు. సెప్టెంబర్ 27న `ఓజీ` రిలీజ్ డేట్‌ని ఫిక్స్ చేశారట. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలోనే రానుందని తెలుస్తుంది. దీంతో ఇప్పుడు సరికొత్త రచ్చ ప్రారంభమైంది. రామ్‌చరణ్ ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు.
మంచి డేట్‌ని మిస్ చేసుకున్నారని, దిల్ రాజుని, దర్శకుడు శంకర్‌ని కలిపి ట్రోల్ చేస్తున్నారు. ఉన్న డేట్ కూడా పోయే అని, ఇక `గేమ్ ఛేంజర్`ని రిలీజ్ చేసే ఆలోచన లేదా? అని, అటు దిల్ రాజు, ఇటు దర్శకుడు శంకర్‌ని కలిపి ఆడుకుంటున్నారు. ఈ ఏడాది అయినా ఈ సినిమా వస్తుందా? అని అడుగుతున్నారు. ఇక ఈ మూవీ రాదు అని, ఇక `గేమ్ ఛేంజర్` లేనట్టే అని మండిపడుతున్నారు. ఉన్న డేట్స్ అన్ని పోగొట్టుకుని ఏం చేస్తారని ప్రశ్నిస్తున్నారు.
మరి దీనిపై నిర్మాత దిల్ రాజు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి. రామ్‌చరణ్ అభిమానుల ఆగ్రహాన్ని ఎలా చల్లార్చబోతున్నారనేది చూడాలి. ఇక శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న `గేమ్ ఛేంజర్` చిత్రంలో కియారా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తుంది. శ్రీకాంత్, అంజలి, సునీల్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. సుమారు 350కోట్లతో ఈమూవీ తెరకెక్కుతుందని తెలుస్తుంది. పొలిటికల్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ మూవీలో రామ్‌చరణ్ రెండు పాత్రలు పోషిస్తున్నారు. సీఎంగా, ఐఏఎస్ అధికారికగా కనిపించనున్నట్టు సమాచారం.