‘నాటు నాటు’కు ఆస్కార్ రావడంపై రామ్ చరణ్ ఎమోషనల్ కామెంట్స్.. మెగా పవర్ స్టార్ హార్ట్ ఫెల్ట్ నోట్..
‘ఆర్ఆర్ఆర్’కు ఆస్కార్ దక్కడంతో భారతీయులు గర్విస్తున్నారు. ఈ సందర్భంగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఎమోషనల్ గా స్పందించారు. సుధీర్ఘమైన థ్యాంక్యూ నోట్ ద్వారా తన సంతోషాన్ని వ్యక్తం చేశారు.
సెన్సేషనల్ ఫిల్మ్ ‘ఆర్ఆర్ఆర్’ ఇండియన్ సినీ చరిత్రలో చెరగని ముద్ర వేసుకుంది. అత్యంత ప్రతిష్టాత్మకమైన ఆస్కార్ అవార్డును సొంతం చేసుకుని ప్రతి ఒక్క భారతీయుడిని గర్వించేలా చేసింది. చిత్రంలోని Naatu Naatu సాంగ్ కు ఆస్కార్ అవార్డు లభించడమే ఇందుకు కారణం. దీంతో భారతీయులు గర్వంగా ఫీలవుతున్నారు. ‘ఆర్ఆర్ఆర్’ టీమ్ పై ప్రశంస వర్షం కురిపిస్తున్నారు. ఈ క్రమంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) కూడా తన సంతోషాన్ని అభిమానులతో పంచుకున్నారు. ఆస్కార్ కోసం ఎదురుచూసిన వారందరికీ ఈ సందర్భంగా థ్యాంక్ నోట్ విడుదల చేశారు.
థ్యాంక్యూ నోట్ లో.. RRR మన జీవితాల్లో, భారతీయ సినిమా చరిత్రలో అత్యంత ప్రత్యేకమైన చిత్రంగా నిలిచిపోతుంది. ఆస్కార్ అవార్డును అందించినందుకు నేను అందరికీ కృతజ్ఞతలు మాత్రమే చెప్పలేను. ఎందుకంటే ఇంకా నేను కలలోనే ఉన్నట్టుగా అనిపిస్తోంది. మీ తిరుగులేని మద్దతు, ప్రేమకు ప్రతి ఒక్కరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఇక SS రాజమౌళి, MM కీరవాణి మన ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో అత్యంత విలువైన రత్నాలు. ప్రస్తుతం నాటు నాటు ప్రపంచవ్యాప్తంగా ఒక ఎమోషన్ గా మారింది. ఈ కళాఖండంలో భాగమయ్యే అవకాశం ఇచ్చినందుకు మీ ఇద్దరికీ ధన్యవాదాలు.
ప్రముఖ లిరిసిస్ట్ చంద్రబోస్ గారు, సింగర్స్ రాహుల్ సిప్లిగంజ్ మరియు కాల భైవర అందించి గాత్రం అద్భుతం. వాటి పాటకు ప్రేమ్ రక్షిత్ సార్ అదిరిపోయే ఆటతో ఓ ఎమోషన్ ను తీసుకొచ్చారు. నా కో స్టార్ తారక్‌కు ధన్యవాదాలు. మీతో కలిసి డ్యాన్స్ చేసి మళ్లీ రికార్డులు సృష్టించాలని ఆశిస్తున్నాను. అలాగే తనకు జోడీగా నటించిన అలియా భట్‌కూ కూడా స్పెషల్ థ్యాంక్స్ తెలిపారు.
ఈ ఆస్కార్ అవార్డు ప్రతి భారతీయ నటుడికి, సాంకేతిక నిపుణుడికి మరియు సినిమా ప్రేక్షకుడికి చెందుతుందని రామ్ చరణ్ పేర్కొన్నారు. మీఅందరి ప్రేమ, మద్దతు ఎనలేనిది. అలాగే ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. ఇది మన దేశం సాధించిన విజయం’ అంటూ నోట్ రాసుకొచ్చారు.
ఆస్కార్క్ వేడుకల సందర్భంగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రమోషన్స్ లో చాలా చురుకుగా పాల్గొన్న విషయం తెలిసిందే. హాలీవుడ్ మీడియా, టాక్ షోలలో ఆకట్టుకునేలా మాట్లాడారు. తన కామెంట్స్ తో అందరినీ ఆకర్షించారు. మరోవైపు అక్కడ ఉన్న ఫ్యాన్స్ ను కలిసి సందడి చేశారు. అమెరికాలోనూ చరణ్ కు భారీ మద్దుతు రావడం.. క్రేజ్ దక్కడంతో ఏకంగా గ్లోబల్ స్టార్ గా మారిపోయాడు.
ఈరోజు అమెరికాలోని లాస్ ఎంజెల్స్ లో నిర్వహించిన 95వ ఆస్కార్ వేడుక అట్టహాసంగా జరిగింది. అతిరథ మహారథుల మధ్య వేడుక చాలా ఘనంగా జరిగింది. బెస్ట్ కేటగిరీల్లోని విభాగాలకు అతిథులు అవార్డులను ప్రకటించారు. ఈ క్రమంలో ఇండియా నుంచి బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో ఎంపికైన ‘నాటు నాటు’ సాంగ్ కు Oscar Award 2023 దక్కింది. ప్రముఖ సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి (MM Keeravani) మరియు లిరిసిస్ట్ చంద్రబోస్ (Chandra Bose) ఆస్కార్ వేదికపై అవార్డును స్వీకరించారు. తమ భావోద్వేగమైన స్పీచ్ తో ఆకట్టుకున్నారు.