ఎక్కువ రోజులు ఖాళీగా కూర్చోలేను.. రకుల్ ప్రీత్ సింగ్ కామెంట్స్..
టైమ్ దొరికితే ఇంటికే పరిమితం అవుతానంటోంది రకుల్ ప్రీత్ సింగ్. అలా అని ఎక్కువ రోజులు ఖాళీగా కూర్చోలేనంటోంది. తనకు పని ఉంటేనే ఆరోగ్యంగా ఉన్న ఫీలింగ్ కలుగుతుందట. అందుకే ఎప్పుడూ షూటింగ్స్ బిజీ ఉండేలా చూసుకుంటాను అంటోంది రకలు. ఇలా మరిన్ని విషయాలను ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నారు రకుల్ ప్రీత్ సింగ్.

షూటింగ్ లేకపోతే.. ఖాళీ టైమ్ ను తన స్నేహితులతో గడిపేస్తుందట రకుల్. అంతే కాదు ఇంట్లో వారితో కలిసి గడపడం అంటే చాలా ఇష్టం అంటోంది రకుల్. ఖాళీగా ఉంటే గోల్ఫ్ ఆడతాను. ఇష్టమైన సినిమాలు చూస్తాను అంటోంది. అవన్నీ చేస్తాను కాని అసలు ఎక్కువ రోజులు ఖాళీగా కూర్చోలేను. నేను వర్క్ హాలిక్ అంటోంది రకుల్ ప్రత్ సింగ్.
పెళ్లి గురించి ఆలోచించే టైమ్ లేదంటుంది రకుల్. ఆ పని సోషల్ మీడియా చూసుకుంటుది కదా.. అనేక పుకార్లు వస్తున్నాయి రానివ్వండి.. ప్రస్తుతం చేతినిండా సినిమాలున్నాయి. అవి అయిపోయిన తరువాత ఇతర విషయాలు గురించ ఆలోచిస్తాను అంటుంది. ప్రస్తుతం దేని గురించీ ఆలోచించేంత సమయం లేదు అని క్లారిటీ ఇచ్చేసింది బ్యూటీ.
సినిమాల్లో అప్పటికీ ఇప్పటికీ.. పురుషులదే ఆధిపత్యం అంటోంది రకుల్. అందులోను మనం ఉన్నది కూడా పురుషాధిక్య సమాజంలోనే. అయినంత మాత్రాన దేనికీ భయపడాల్సిన అవసరం లేదు అని చెపుతోంది. ఓటమిని అంగీకరించి వెనకడుగు వేయోద్దంటోంది రకుల్. ఈ విషయంలో తన పేరెట్స్ కూడా ఎలాంటి వివక్ష లేకుండా పెంచారంటోంది.
సినిమాల్లో అప్పటికీ ఇప్పటికీ.. పురుషులదే ఆధిపత్యం అంటోంది రకుల్. అందులోను మనం ఉన్నది కూడా పురుషాధిక్య సమాజంలోనే. అయినంత మాత్రాన దేనికీ భయపడాల్సిన అవసరం లేదు అని చెపుతోంది. ఓటమిని అంగీకరించి వెనకడుగు వేయోద్దంటోంది రకుల్. ఈ విషయంలో తన పేరెట్స్ కూడా ఎలాంటి వివక్ష లేకుండా పెంచారంటోంది.
జీవితం పర్వతారోహణ లాంటిది. పైకి వెళ్లేకొద్దీ సవాళ్లే. అక్కడితో ఆగిపోతే.. చరిత్రహీనులుగా మిగిలిపోతాం. ఎన్ని అవరోధాలు ఎదురైనా సరే.. లక్ష్యాన్ని చేరుకోవాల్సిందే. శిఖరాన్ని ముద్దాడాల్సిందే. పరిశ్రమ మీద మనదైన ముద్ర వేయాలంటే.. కష్టపడాలి, విమర్శల్ని తట్టుకోవాలి. అమితాబ్ సర్ సహా.. ప్రతి నటుడూ నాకు ఓ పాఠమే అంది రకుల్.
చాలా మంది చేసే తప్పులో ఒకటి గతాన్ని తవ్వుకోవడం. ఎప్పుడో ఏదో జరిగినదాన్ని పట్టుకుిన వేలాడటం నాకు ఇష్టం ఉండదు. సక్సెస్, ఫెయిల్యూర్స్ వస్తూనే ఉంటాయి. వాటినే తలుచుకుంటూ కుంగిపోవడమో, పొంగిపోవడమో తెలివైన పని కాదు. ప్రస్తుతం నా ఫోకస్ మొత్తం రాబోయే సినిమాల మీదే. ప్రతి స్క్రిప్ట్ జాగ్రత్తగా చదువుతాను. నిర్ణయం తీసుకున్నాక మాత్రం గెనకడుగు వేయనంటోంది రకుల్ ప్రీత్ సింగ్.
సంపాదన కోసం సినిమాల్లోకి రావద్దంటుంది రకుల్ ప్రీత్ సింగ్. కష్టపడేమనస్తత్వం ఉండి...ఇండస్ట్రీలో అడుగు పెట్టాలంటోంది. మాది సైనిక కుటుంబం అందుకే దేనికి భయపడను.. ముఖ్యంగా సవాళ్లను ఇష్టపడతాను.అంటొంది. సినిమా వాళ్లు అంటే కడుపునిండా తిండి ఉండదు.. కంటినిండా నిద్ర ఉండదు.. ఇష్టమైన చోటికి వెళ్ళలేం నలుగురిలో తిరగలేం.. ఇలాంటి ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటూ సినిమాల్లో నిలబడాల్సి ఉంటుంది అంటుంది రకుల్ ప్రీత్.