ఇన్సైడ్ ఇన్ఫో :ప్రభాస్ 'రాజా సాబ్' బడ్జెట్, డిటైల్డ్ ఫైనాన్సియల్ రిపోర్ట్
. స్టోరీ, సెట్స్, వీఎఫ్‌ఎక్స్ అన్నీ బాగుంటాయి. వీటన్నిటితో కూడిన కామెడీ ఎంటర్‌టైనర్ ఇది (Raja Saab Update).
Prabhas, The Raja Saab, maruthi
ప్రపంచంలో ఇప్పటివరకు ఎవరూ చూపించనంత హారర్‌ను ‘రాజా సాబ్’లో చూపించనున్నట్లు నిర్మాత టీజీ విశ్వప్రసాద్ చెప్పి సినిమాపై అంచనాలు పెంచేస్తున్నారు. ప్రభాస్ హీరోగా మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘రాజా సాబ్’ (Raja Saab).
ప్రభాస్ కు పెరిగిన క్రేజ్ దృష్య్యా భారీ ఎత్తున ఈ సినిమా బిజినెస్ చేస్తున్నారు. ఈ నేపధ్యంలో అసలు ఈ సినిమా ఎంత పెట్టారు. హారర్ సినిమా కాబట్టి ఒకే చోట చుట్టేసారా వంటి సందేహాలు వస్తున్నాయి. వాటికి ఫిల్మ్ సర్కిల్స్ నుంచి అందుతున్న ఇన్సైడ్ ఇన్ఫో చూద్దాం.
Prabhas, The Raja Saab, maruthi
మారుతి - ప్రభాస్ కాంబోలో వస్తోన్న తొలి చిత్రమిది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్ దీనిని నిర్మిస్తున్నారు. నిధి అగర్వాల్, రిద్ధి కుమార్, మాళవిక మోహన్ కథానాయికలుగా నటిస్తున్నారు.
‘సలార్’, ‘కల్కి 2898 ఏడీ’ వంటి బ్లాక్‌బస్టర్ సినిమాల తర్వాత ప్రభాస్ (Prabhas) నటిస్తున్న సినిమా కావడంతో దీనిపై భారీ అంచనాలు నెలకొన్నాయి. తాజాగా దీని గ్లింప్స్ విడుదల చేశారు. అందులో ప్రభాస్ సింహాసనం మీద ఓ చేతిలో సిగార్‌తో రాజు లుక్‌లో కనిపించి అభిమానుల్లో జోష్ నింపారు.
Actor Prabhas upcoming film The Raja Saab remuneration out
బడ్జెట్ విషయానికి వస్తే... అందుతున్న సమాచారం మేరకు రాజా సాబ్ మూవీ 450 కోట్ల భారీ బడ్జెట్ తో రూపొందుతోంది. హైదరాబాద్ అజీజ్ నగర్ లో సెట్స్ వేసి ఈ సినిమాని అక్కడే ఎక్కువ భాగం షూట్ చేసారు.
150 రోజుల్లో ఈ సినిమా షూటింగ్ వర్కింగ్ డేస్. మారుతి సినిమాలో మేజర్ పోర్షన్ షూటింగ్ పూర్తి చేసారు. అయితే ప్రభాస్ అందుబాటులో లేక ఆయన పోర్షన్ పెండింగ్ లో ఉంది. ఈ సంవత్సరం చివర లోపల షూటింగ్ పూర్తి చేయాలనేది ప్లాన్.
Prabhas, The Raja Saab, maruthi
ఈ సినిమాలో మేజర్ బడ్జెట్ VFX వర్క్ కు ఎలాట్ చేసారు. నిర్మాత టి.జి.విశ్వప్రసాద్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఈ విషయాలు చెప్తూ.....
‘ది రాజా సాబ్’ చిత్రాన్ని ఈమధ్యనే ప్రారంభం చేయలేదని.. ఈ సినిమాను రెండేళ్ల క్రిందటే ప్రారంభించామని ఆయన తెలిపారు. అంతేగాక, ఈ సినిమాకు చాలా ఎక్కువ బడ్జెట్ కేటాయించామని.. ఇప్పటివరకు ఇండియన్ స్క్రీన్‌పై చూడని హార్రర్ ఎలిమెంట్స్ ‘ది రాజా సాబ్’ మూవీలో ప్రేక్షకులు చూస్తారని ఆయన తెలిపారు.
Prabhas, The Raja Saab, maruthi
విశ్వప్రసాద్ మాట్లాడుతూ...‘‘రాజా సాబ్’ చాలా పెద్ద చిత్రం. భారీ బడ్జెట్‌తో ఇది తెరకెక్కుతుంది. రెండేళ్లక్రితమే ఈ సినిమాను మొదలుపెట్టాం. ‘కల్కి’ పూర్తికాగానే ఈ సినిమాను ప్రారంభించాం. దీని స్కేల్‌ను కూడా ఎవరూ ఊహించలేరు. స్టోరీ, సెట్స్, వీఎఫ్‌ఎక్స్ అన్నీ బాగుంటాయి.
వీటన్నిటితో కూడిన కామెడీ ఎంటర్‌టైనర్ ఇది (Raja Saab Update). ప్రభాస్‌ను కొత్తగా చూస్తారు. ఇప్పటివరకు ప్రపంచంలో ఎవరూ చూపించనంత హారర్‌ను ఈ చిత్రంలో చూపించనున్నారు. తాజాగా గ్లింప్స్‌ను విడుదల చేశాం. అందులో చూపిన దానికంటే భారీ సెట్ వేశాం. కొంతమంది దాని గ్రాఫిక్స్ విషయంలో కామెంట్స్ చేశారు. కానీ.. ప్రభాస్ (Prabhas) లుక్‌కు మంచి స్పందన వచ్చింది’ అన్నారు. దీంతో ప్రభాస్ కెరీర్‌లో ఇది బెస్ట్ మూవీ అవుతుందని అభిమానులు భావిస్తున్నారు.
Prabhas, The Raja Saab, maruthi
ప్రభాస్ ‘రాజా సాబ్’లో ద్విపాత్రాభినయం చేస్తున్నాడన్నది స్పష్టం అయ్యింది. ఇంతకుముందు రిలీజ్ చేసిన గ్లింప్స్‌లో చూపించిన యంగ్ క్యారెక్టర్ ఒకటైతే.. ఇంకోటేమో లేటెస్ట్‌గా రిలీజ్ చేసిన పోస్టర్లో కనిపించిన మహా రాజు క్యారెక్టర్. ఇలా హీరో పాత్రను రెండు రకాలుగా చూడగానే జనాలకు చంద్రముఖి, నాగవల్లి సినిమాలు గుర్తుకు వస్తున్నాయి. అదే సమయంలో ఈ సినిమాలో ప్రభాస్ పాత్ర చాలా కొత్తగా ఉంటుందని చెప్తున్నారు.
Vishwa Prasad shopes about The Raja Saab Prabhas horror film updates out
మీడియా వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు మహా రాజు పాత్ర...ఈ సినిమాలో సెకండాఫ్ లో వస్తుంది. సాలిడ్ ఉండే ఈ ఫ్లాష్ బ్యాక్ ఇప్పటి ప్రభాస్ కు తాతగారి పాత్ర ను రివీల్ చేస్తుందని సమాచారం. ఈ పోర్షన్ దాదాపు అరగంట దాకా ఉంటుందని, ఈ ఎపిసోడ్ లో ప్రభాస్ చాలా క్రేజీగా ఉంటారని, డైలాగ్ డెలవరీ, మేనరిజమ్స్ చాలా గమ్మత్తుగా ఉంటాయని వినికిడి. ఇప్పటివరకూ ప్రభాస్ ని అలా చూసి ఉండరని చెప్తున్నారు.
malavika mohanan in prabhas movie the raja saab
ఇదిలా ఉండగా ప్రభాస్ కల్కి సూపర్ హిట్ తో ఆయన నెక్ట్స్ పిక్చర్ రాజా సాబ్ బిజినెస్ వర్గాల్లో క్రేజ్ మామూలుగా లేదు. మారుతి దర్శకుడు కాబట్టి పెద్దగా క్రేజ్ లేదనుకున్న వాళ్లకు ఈ ప్రాజెక్టుకు వస్తున్న బిజినెస్ ఆఫర్స్ చూస్తూంటే మతిపోతోంది. అఫ్ కోర్స్ అది ప్రభాస్ కు పెరిగిన ప్యాన్ ఇండియా మార్కెట్, సక్సెస్ , ఫామ్ లో ఉండటం వంటి కారణాలు కావచ్చు.
కానీ ప్రభాస్ తో సినిమా చేస్తున్న వాళ్లకి అవన్నీ కలిసొచ్చే అంశాలే. ప్రభాస్ సినిమా అంటే వందల కోట్లకు చేరుకుంది. అలాంటప్పుడు రిటర్న్స్ ఏ స్దాయిలో ఉంటాయా అని లెక్కలేసుకునే నిర్మాత చేస్తారు. కానీ సినిమాకు వస్తున్న బిజినెస్ ఆఫర్స్ ..ఆ లెక్కలను దగ్గర రానిచ్చే పరిస్దితి లేదంటున్నారు. తాజాగా ఈ చిత్రం ఆడియో రైట్స్ కు పలికిన రేట్లే అందుకు నిదర్శనం అంటున్నారు.