- Home
- Entertainment
- చిరంజీవితో ఆ పాత్రలో నటించే ప్రసక్తే లేదు.. ఆల్రెడీ వార్నింగ్, హీరోయిన్ రాధిక కామెంట్స్
చిరంజీవితో ఆ పాత్రలో నటించే ప్రసక్తే లేదు.. ఆల్రెడీ వార్నింగ్, హీరోయిన్ రాధిక కామెంట్స్
సీనియర్ హీరోయిన్ రాధిక శరత్ కుమార్ గురించి పరిచయం అవసరం లేదు. 80,90 దశకాల్లో రాధిక టాలీవుడ్ లో హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగారు. ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవి, రాధికలది వెండితెరపై తిరుగులేని కాంబినేషన్.

Radhika Sarathkumar
సీనియర్ హీరోయిన్ రాధిక శరత్ కుమార్ గురించి పరిచయం అవసరం లేదు. 80,90 దశకాల్లో రాధిక టాలీవుడ్ లో హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగారు. ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవి, రాధికలది వెండితెరపై తిరుగులేని కాంబినేషన్. ఇప్పటికి చిరంజీవి, రాధిక నటించిన చిత్రాల్లోని హిట్ సాంగ్స్ వైరల్ అవుతుంటాయి.
Radhika Sarathkumar
రాధిక, చిరంజీవి కాంబినేషన్ లో అభిలాష, దొంగమొగుడు, యమకింకరుడు, రాజా విక్రమార్క, హీరో లాంటి బ్లాక్ బస్టర్ చిత్రాలు వచ్చాయి. వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన సాంగ్స్ చాలా మంది యువతకు ఇప్పటికీ ఫేవరిట్ గా ఉంటాయి. అంతలా చిరు, రాధిక జంట మ్యాజిక్ చేసింది. ప్రస్తుతం రాధిక తన వయసుకు తగ్గ పాత్రల్లో నటిస్తోంది. రీసెంట్ గా రాధిక.. ఆడవాళ్లు మీకు జోహార్లు చిత్రంలో నటించింది.
Radhika Sarathkumar
తాజాగా ఓ ఇంటర్వ్యూలో రాధిక ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. చిరంజీవితో తానూ నటించిన సినిమాలని, స్నేహాన్ని గుర్తు చేసుకున్నారు. చిరంజీవి నేను సెట్స్ లో తాము అండ్ జెర్రీ లాగా ఉండేవాళ్ళం అని రాధికా గుర్తు చేసుకున్నారు. ఇంటర్వ్యూలో యాంకర్ చిరంజీవితో మళ్ళీ నటించడానికి రెడీనా అని అడగగా.. తల్లిగా మాత్రం అసలు నటించను అని నవ్వుతూ చెప్పారు.
Radhika Sarathkumar
ఆల్రెడీ చిరంజీవికి కూడా వార్నింగ్ ఇచ్చినట్లు తెలిపారు.. చిరు నీ సినిమాలో తల్లిగా నటించను అని చెప్పారట. చిరంజీవి సెల్ఫ్ మేడ్ మ్యాన్ అని రాధిక ప్రశంసలు వర్షం కురిపించింది. షూటింగ్ సమయంలో చిరంజీవి డిసిప్లేన్ గా ఉంటారు. దర్శకుడు చెప్పేది శ్రద్దగా వింటారు అని రాధిక కొనియాడారు.
Radhika Sarathkumar
ఇక ఇతర చిత్రాల విషయానికి వస్తే తాను నటిని కాబట్టి అన్ని రకాల పాత్రలు చేస్తానని రాధికా క్లారిటీ ఇచ్చారు. ఇప్పుడున్న హీరోలలో జూ.ఎన్టీఆర్ ఎనర్జీ లెవల్స్ అద్భుతం అని రాధిక అన్నారు.
Radhika Sarathkumar
అలాగే అల్లు అర్జున్, రాంచరణ్ మా కళ్ళముందు పెరిగారు. తెలుగులో చాలా మంది యంగ్ హీరోలు అద్భుతంగా చేస్తున్నారు అని రాధిక ప్రశంసించారు. హీరోయిన్లకు కూడా మంచి పాత్రలు సృష్టిస్తున్నారు. కీలక పాత్ర దక్కితే నటించాలనే ఆసక్తి కూడా పెరుగుతుంది అని రాధిక తెలిపారు.