వాళ్ళతో పోల్చితే మనం సెక్స్ చేయనట్టే, అందుకే.. బ్యాంకాక్‌లో!
పూరి జగన్నాథ్ సినిమా డైలాగ్‌లే ఒకటికి నాలుగు సార్లు విని ఎంజాయ్ చేస్తూంటారు. ఆయన డైలాగుల్లో నిజ జీవిత సత్యాలు దొర్లుతూంటాయి. మనం నార్మల్ గా బయిట మాట్లాడుకునే మాటలే డైలాగుల రూపంలో వినిపిస్తూంటాయి. అంతేకాదు బయట ఆయన మాటలు కూడా ఘాటుగానే ఉంటాయి. అయితే ప్రస్తుతం లాక్డౌన్ కారణంగా పూరి మాటలు సినిమాల్లో విందామంటే కుదరే పరిస్దితి లేదు. దీంతో యూట్యూబుల్లో, ఓటీటీల్లో పాత సినిమాల డైలాగ్‌లు విని ఆనందిస్తున్నారు ఫ్యాన్స్. అయితే ఆయన మాటలన్నీ మూటగట్టి ఓ పాడ్‌కాస్ట్‌ను రూపొందించాడు. పాడ్‌కాస్ట్ ‘మ్యూజింగ్స్’’ అంటూ పాడ్‌కాస్ట్‌ను మొదలుపెట్టారు పూరి. అందులో భాగంగా తాజాగా కామసూత్రపై ఆయన మాట్లాడారు. ఆ పాడ్ కాస్ట్ ఇప్పుడు వైరల్ అవుతోంది. ఆయన అందులో ఏం చెప్పారో చూద్దాం.
పూరి జగన్నాథ్ మాట్లాడుతూ...మన పూర్వికులతో పోల్చితే మనం సెక్స్ చేయనట్టే లెక్క అంటూ రెచ్చిపోయారు పూరి జగన్నాథ్. రీసెంట్ గా విడుదల చేసిన పోడ్కాస్ట్ ఆడియోలో కామ సూత్రాలన్నీ విప్పి చెప్పారు.
పూరి మాటల్లోనే...''కామసూత్ర.. ఈ పేరు వినగానే మనలో కోటి వీణలు మోగుతాయి. కామం అంటే అంతిష్టం మనకి. ప్రపంచానికి సెక్స్ అంటే ఏంటో నేర్పింది మనమే. కామసూత్ర చదివి జ్ఞానం సంపాదించుకొని ఆ తర్వాత సెక్స్ స్టార్ట్ చేయమని మన పెద్దల భావం.
కానీ మనమేం చేస్తాం.. ముందు సెక్స్ చేస్తూ పోతాం. మధ్యలో ఎక్కడైనా కామసూత్ర బుక్ తగిలితే ఆశగా బొమ్మలు చూస్తాం. అర్రర్రే చాలా యాంగిల్స్ మిగిలిపోయాయి అని. అంతే తప్ప వాత్సాయణుడు ఏం చెప్పాడో ఆలోచించం.
కామసూత్ర అనేది ఆర్ట్ ఆఫ్ లివింగ్. అందరం జీవితంలో ధర్మార్ధ కామ మోక్షాలను సాధించాలి. ధర్మ అంటే లైఫ్ అండ్ యూనివర్స్. అర్థ అంటే జీవితానికి అర్థం.
కామ అంటే కోరిక. మోక్ష అంటే విముక్తి. వీటన్నింటినీ మనం జయించాలి. కామసూత్ర అన్ని రకాల సెక్స్ గురించి తెలుపుతుంది.
మన పూర్వికులు చేయని సెక్స్ లేదు. వాళ్ళు చేసినవన్నీ మనం పురాతన దేవాలయాల్లో చూడొచ్చు. ఆ బొమ్మలు చూస్తే, వాళ్ళతో పోలిస్తే మనం అస్సలు సెక్స్ చేయనట్టే లెక్క.
గుడి మీద బొమ్మలు ఏం చెబుతున్నాయంటే.. నీ కామ వాంఛలు ఎన్నుంటాయో అన్నీ తీర్చుకొని అప్పుడు గుడిలోకి రా.. అప్పుడే మోక్షం. అన్ని కోరికలు తీర్చుకున్నాక సెక్స్ చేయడం మానేయాలి.
దమ్ముంటే గుప్పెడు బియ్యం ఉడకబెట్టి తినే వయసులో అది మానేయాలి. అప్పటినుంచి మీ ఎనర్జీని మీ కెరీర్‌పై పెట్టండి. ఎక్కడికో వెళతారు. అదే మోక్షం. ఒక ఏజ్ దాటాక సెక్స్ మన వీక్నెస్ కాకూడదు. ఒంట్లో శక్తి ఉండగానే దాన్ని మైండ్ లోంచి తీసేయాలి.
బ్యాంకాక్ షూటింగ్ అంటే మా యూనిట్ అందరికీ పండగ. 15 రోజుల షెడ్యూల్. వెళ్ళగానే మొదటి రెండు రోజులు మా కుర్రాళ్ళు రెచ్చిపోతారు. ఆ తర్వాత ఎక్కడికీ వెళ్లకుండా టైమ్‌కి పడుకుంటారు.
ఎందుకెళ్లరంటే.. రాత్రి ఏ టైమ్ అయినా మనకు కావాలంటే అది దొరుకుతుందిలే అనే ధైర్యంతో హ్యాపీగా పడుకుంటారు. దాని తర్వాత ఇంకో కంట్రీ వెళ్తాము. ఇక్కడ వ్యభిచారం నేరం అని చెబితే చాలు ఒక్కొక్కడికి నిద్రలు పట్టవు. ఎలారా దేవుడా అని అటూ ఇటూ తిరుగుతూ ఉంటారు.
రిస్ట్రిక్ట్ చేయడం వల్లనే సెక్స్ మైండ్‌లో ఇరుక్కుపోద్ది. ఇండియాలో అదే జరిగింది. వెయ్యేళ్ళ క్రితమే మన పూర్వీకులు దేవాలయాలపై అలాంటి బొమ్మలు చెక్కారు.
మరి ఇప్పుడు దేవాలయాలపై మనం అలాంటి ఒక్క బొమ్మ చెక్కగలుగుతామా? నో.. పెద్ద గొడవలై పోతాయి. ఎందుకంటే ఇప్పుడు సెక్స్ అంటే ఓ బూతు.
ఎప్పుడో సెక్స్ లిబరేషన్ గురించి వాళ్ళు మాట్లాడితే ఇప్పుడు మనకు సెక్స్ అనే పదం పలకాలన్నా భయం. అందుకే ఇండియాలో ఎవ్వరికీ మోక్షం రాదు. మధ్యలోనే పోతారు. ధర్మార్థ కామ డెత్'' అంటూ ముగించారు పూరి జగన్నాథ్.
జీవితం గురించి, జీవితంలో బాగా గుర్తు పెట్టుకోవాల్సిన అంశాల గురించి ఆ పాడ్‌కాస్ట్‌లో తన మాటల్లోనే వినిపించాడు. మొత్తంగా 46 విభిన్న అంశాల గురించి ఆ పాడ్‌కాస్ట్‌లో పూరి అభిప్రాయాలు ఉన్నాయి.
మ్యూజింగ్స్ పేరుతో సిద్ధం చేసిన ఆ పాడ్‌కాస్ట్‌ను లాంచ్ చేశాడు. స్పాటిఫై, యాపిల్ పాడ్‌కాస్ట్‌లో Purijagannadh పేరుతో సెర్చ్ చేసి ఈ పాడ్‌కాస్ట్ వినొచ్చు. లేదంటే యాపిల్ యూజర్లు ఈ లింక్లోను, ఆండ్రాయిడ్ యూజర్లు ఈ లింక్లోను పాడ్‌కాస్ట్‌లు వినొచ్చు.