మలయాళ స్టార్ ను రిక్వెస్ట్ చేసిన ప్రభాస్, సలార్ కోసం పట్టుపట్టిన యంగ్ రెబల్ స్టార్
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ స్పీడ్ పెంచారు. రాధేశ్యామ్ రిలీజ్, రిజల్ట్ తరువాత ప్రభాస్.. తన నెక్ట్స్ సినిమాల విషయంలో కేర్ ఫుల్ గా ఉండాలి అని ఫిక్స్ అయ్యాడు. అందుకే ప్రతీ విషయంలో జాగ్రత్త పడుతున్నాడు. ఈ క్రమంలోనే మలయాళ స్టార్ హీరోను తన సినిమా కోసం ఒప్పించాడ యూనివర్సల్ స్టార్.

టాలీవుడ్ లోనే కాదు.. ఇప్పుడు ఇండియా అంతా స్టార్ హీరో అంటే ముందుగా వినిపించే పేరు ప్రభాస్. బాహుబలి తరువాత వచ్చిన పేరును కాపాడుకునే క్రమంలో కొంచెం తడబడుతున్నా.. తన ఇమేజ్ మాత్రం కోల్పోకుండా జాగ్రత్తపడుతున్నాడు యంగ్ రెబల్ స్టార్.
ప్రభాస్ తన సినిమాల స్పీడ్ పెంచాడు. బాలీవుడ్ లోఓం రౌత్ తో ఆదిపురుష్ షూటింగ్ ను పరుగులు పెట్టించిన ప్రభాస్.. కన్నడ దర్శకుడు ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో చేస్తున్న సలార్ పై కూడా ప్రత్యేకంగా దృష్టి పెట్టాడు. హోంబలే ఫిలింస్ పతాకంపై రూపుదిద్దుకుంటున్న ఈ సినిమాలో ప్రభాస్ సరసన శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తోంది.
ఇక సలార్ లో ఓ ఇంపార్టెంట్ క్యారెక్టర్ కోసం మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ ను మూవీ టీమ్ ఫిక్స్ చేసుకుంది. ముందుగా పృథ్వీరాజ్ కూడా దర్శకుడితో తనకున్న అనుబంధంతో ఓకే చెప్పేశాడట. ఆ నమ్మకంతో షూటింగ్ పై దృష్టి పెట్టిన టీమ్ కు మలయాళ హీరో షాక్ ఇచ్చాడు.
కరోనా సంక్షోభం రావడంతో సలార్ షూటింగ్ ఆగిపోయింది. అదే సమయంలో పృథ్వీరాజ్ మరో ప్రాజెక్టు ఒప్పుకున్నాడు. ఇప్పుడు సలార్ కోసం డేట్స్ సర్దుబాటు చేయలేని పరిస్థితుల్లో సినిమా వదులుకోవడానికి నిర్ణయించుకున్నాడు పృథ్విరాజ్. తనకు కుదరదని చెప్పేశాట. అయితే ఈ స్టార్ హీరోను వదులుకోవడం టీమ్ కు ఇష్టం లేదు.
సలార్ లో తాము అనుకున్న పాత్రకు పక్కాగా న్యాయం చేయగలిగేది పృథ్విరాజ్ ఒక్కరే అని ఫిక్స్ అయ్యాడట టీమ్. డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తో పాటు. హీరో ప్రభాస్ కూడా ఇదే భావిస్తున్నారట. దాంతో ప్రభాస్ స్వయంగా దర్శకుడు ప్రశాంత్ నీల్ తో కలిసి వెళ్లి పృథ్వీరాజ్ తో మాట్లాడారట.
అంతే కాదు యలయాళ స్టార్ హీరోను సలార్ కోసం ఒప్పించాడట ప్రభాస్. పృథ్వీరాజ్ కొత్త ప్రాజెక్టు పూర్తయ్యేంత వరకు ఆగుతామని అతడికి హామీ కూడా ఇచ్చినట్టు తెలుస్తోంది. దీనిపై పృథ్వీరాజ్ మాట్లాడుతూ, తన కొత్త చిత్రం పూర్తయ్యాక వెంటనే సలార్ షూటింగ్ లో జాయిన్ అవుతా అని చెప్పినట్టు సమాచారం.
ఈ విషయంలో ప్రభాస్ ఫ్యాన్స్ తో పాటు బాలీవుడ్,మాలీవుడ్ మేకర్స్ కూడా ప్రభాస్ చేసిన పనికి ఫిదా అవుతున్నారు. పాన్ ఇండియా స్టార్ అయ్యుండి కూడా ప్రభాస్ సింపుల్ సిటీకి సాహో అంటున్నారు.