- Home
- Entertainment
- Jai Hanuman : ‘జై హనుమాన్’లో మహేశ్ బాబు, చిరంజీవి.. బిగ్ అప్డేట్ ఇచ్చిన ప్రశాంత్ వర్మ.. కానీ!
Jai Hanuman : ‘జై హనుమాన్’లో మహేశ్ బాబు, చిరంజీవి.. బిగ్ అప్డేట్ ఇచ్చిన ప్రశాంత్ వర్మ.. కానీ!
‘హను-మాన్’కు సీక్వెల్ గా ‘జై హనుమాన్’ రాబోతోంది. Jai Hanumanపై ప్రశాంత్ వర్మ తాజాగా బిగ్ అప్డేట్ అందించారు. మహేశ్ బాబు Mahesh Babu కోసం చూస్తున్నామంటూ అదిరిపోయే అప్డేట్ అయితే ఇచ్చారు.

యంగ్ హీరో తేజా సజ్జ ప్రధాన పాత్రలో టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ Prashanth Varma తెరకెక్కించిన సూపర్ హీరో ఫిల్మ్ ‘హను-మాన్’ HanuMan. చిన్న సినిమాగా వచ్చి సెన్సేషన్ క్రియేట్ చేసింది.
ఏకంగా మహేశ్ బాబు సినిమా ‘గుంటూరు కారం’తోనే పోటీ పడి నెగ్గింది. ఈ ఏడాది సంక్రాంతి విన్నర్ గా ఈ చిత్రమే నిలిచింది. ప్రేక్షకుల ఆదరణ పొందడంతో పాటు బాక్సాఫీస్ వద్ద కూడా కాసుల వర్షం కురిపించింది. ఏకంగా ఈ చిత్రం రూ.250 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. తక్కువ టైమ్ లోనే లాభాల్లోకి వచ్చింది. తక్కువ బడ్జెట్ తో ప్రశాంత్ వర్మ హనుమాన్ ను విజువల్ గా చూపించిన తీరుకు ఆడియెన్స్ ఫిదా అయ్యారు.
దీంతో మేకర్స్ సీక్వెల్ ను కూడా అనౌన్స్ చేశారు. ‘జై హనుమాన్’ Jai Hanumanగా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సీక్వెల్ పై ప్రశాంత్ వర్మ ఆయా ఇంటర్వ్యూల్లో ఇంట్రెస్టింగ్ అప్డేట్లు ఇస్తున్నారు. ఇటీవలనే ‘జై హనుమాన్’ చిత్రంలో పెద్ద స్టార్ నటించబోతున్నారని తెలిపారు.
తాజా ఇంటర్వ్యూలో ఆ స్టార్ ఎవరనే దానిపై స్పందించారు. మొత్తానికి ఎలాంటి సందడి లేకుండా బిగ్ అప్డేట్ ఇచ్చారు... ఈ చిత్రంలో హనుమాన్ పాత్రకు మెగాస్టార్ చిరంజీవి Chiranjeeviని, శ్రీరాముడి పాత్రకు సూపర్ స్టార్ మహేశ్ బాబు Mahesh Babuను కాస్ట్ గా ఎంపిక చేసే ఆలోచనలో ఉన్నారని తెలిపారు.
ఇప్పటికే రాముడిగా మహేశ్ బాబు ఎలా ఉంటారనే దానిపై డిజైన్స్ కూడా చేశామని తెలిపారు. అవకాశం ఉంటే.. వారిద్దని ‘జై హనుమాన్’లో చూపించాలని బలంగా చూస్తున్నట్టు చెప్పారు. మొదటి ఎంపికగా వీరిద్దరి కోసమే చూస్తున్నామన్నారు. ఇప్పటికే రాముడిగా మహేశ్ బాబును చూడాలని అభిమానులు ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్నారు.
ఆ మధ్యలో ఎస్ఎస్ రాజమౌళి ‘మహాభారతం’లో మహేశ్ బాబు రాముడు అనే టాక్ తో... నెట్టింట రాముడి అవతారంలో చాలా పోస్టర్లు వెలిశాయి. దీంతో వెండితెరపై బాబు రాముడి అవతారం ఎప్పుడు ఎత్తుతారోనని ఎదురుచూస్తున్నారు. లోపు ప్రశాంత్ వర్మ ఇలా అప్డేట్ ఇచ్చారు. ఇంకా ఆ పాత్రలను కన్ఫమ్ చేయాల్సి ఉంది. ప్రస్తుతం ప్రశాంత్ వర్మ కామెంట్స్ మాత్రం నెట్టింట హాట్ టాపిక్ గ్గా మారాయి.