నాగ్ అశ్విన్ ‘ప్రాజెక్ట్ కే’ను వాయిదా వేసిన ప్రభాస్.. ఎప్పటి వరకు? ఎందుకోసం?
పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ (Prabhas) నటిస్తున్న భారీ బడ్జెట్ మూవీ ‘ప్రాజెక్ట్ కే’. ఈ చిత్రాన్ని దర్శకుడు నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్నారు. శరవేగంగా షూటింగ్ పూర్తి చేసుకుంటున్న ఈ చిత్రాన్ని తాజాగా ప్రభాస్ వాయిదా వేసినట్టు తెలుస్తోంది.

నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా రూపొందుతోన్న చిత్రం ‘ప్రాజెక్ట్ కే’ (Project K). దీపికా పదుకొణె హీరోయిన్‌గా నటిస్తున్న విషయం తెలిసిందే. సైన్స్ - ఫిక్షన్ ఆధారంగా తెరకెక్కుతున్న ఈ చిత్రంపై ప్రస్తుతం భారీ అంచనాలు ఉన్నాయి. అశ్విన్ ప్రభాస్ ను ఎలా చూపించబోతున్నాడని అభిమానులు, ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది.
దర్శకుడు నాగ్ అశ్విన్ వరుస హిట్ చిత్రాలతో స్టార్ డైరెక్టర్ గా ఎదిగాడు. ‘ఎవడే సుబ్రమణ్యం’, ‘మహానటి’ వంటి చిత్రాల తర్వాత ఏకంగా పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ మూవీని డైరెక్ట్ చేసే అవకాశాన్ని దక్కించుకున్నాడు. ‘ప్రాజెక్ట్ కే’తో ప్రభాస్ ను సరికొత్తగా చూపించనున్నారు. ఇప్పటికే చిత్రం పలు షెడ్యూళ్ల చిత్రీకరణను పూర్తి చేసింది యూనిట్.
ఇప్పటికే ప్రభాస్ ‘బహుబలి’, ‘సాహో’, ‘రాధే శ్యామ్’ వంటి పాన్ ఇండియన్ చిత్రాల్లో నటించారు. ఈ చిత్రాలతో హ్యూజ్ మార్కెట్ ను ఏర్పర్చుకున్నారు. అయితే నాగ్ అశ్విన్ Project Kను మాత్రం పాన్ వరల్డ్ గా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. ఈ సినిమాతో ప్రభాస్ రేంజ్ ఊహించని స్థాయికి చేరుకోనుందని తెలుస్తోంది.
అయితే, తాజా సమాచారం ప్రకారం.. ప్రభాస్ ప్రాజెక్ట్ కే షూటింగ్ ను కొద్ది రోజులు వాయిదా వేయాలని నిర్ణయించారంట. ఎందుకంటే.. షూటింగ్ కు హాజరైన దీపికా పదుకొణె ఆరోగ్యం కాస్తా అన్ ఈజీగా ఉండటంతో వెంటనే ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె హెల్త్ గురించి కంగారు పడాల్సి పరిస్థితి ఏమీ లేదని డాక్టర్లు తెలిపిందంట.
దీపికా పదుకొణె ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహిస్తూ వారం రోజుల పాటు సినిమా షూటింగ్ ను వాయిదా వేయాలని మేకర్స్ ను కోరాడంట ప్రభాస్. దీంతో షూటింగ్ పోస్ట్ పోన్ కానున్నట్టు తెలుస్తోంది. ఇక దీపికా పదుకొణెకు తెలుగులో ఇది తొలిచిత్రం. వీరిద్దరి కెమిస్ట్రీలో వస్తున్నఈ పాన్ వరల్డ్ మూవీలో బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ బచ్చన్ (Amitab Bachchan) కూడా ఓ కీలకపాత్రను పోషిస్తున్నారు. దీంతో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.
ఈ సినిమా చిత్రీకరణ ప్రస్తుతం హైదరాబాద్ లోనే కొనసాగుతోంది. ప్రభాస్ నటిస్తున్న ‘ఆదిపురుష్’, ‘సలార్’ తర్వాత ‘ప్రాజెక్ట్ కే’ విడుదల కానుంది. వచ్చే ఏడాది మిడ్ ఈయర్ లో రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఈ చిత్రానికి తోట రమణి ఆర్ట్ డైరెక్టర్ గా వర్క్ చేస్తున్నారు. వైజయంతి మూవీస్ పతాకంపై అశ్వనీదత్ నిర్మిస్తున్న ఈ సినిమాకు రూ.500 కోట్లకు పైగా బడ్జెట్ వెచ్చించనున్నట్టు టాక్ వినిపిస్తోంది.