- Home
- Entertainment
- పూజా హెగ్డే మరో జాక్ పాట్.. ఈ సారి పాన్ ఇండియా స్టార్‌తో రొమాన్స్.. సెట్ అయితే రచ్చరచ్చే..
పూజా హెగ్డే మరో జాక్ పాట్.. ఈ సారి పాన్ ఇండియా స్టార్‌తో రొమాన్స్.. సెట్ అయితే రచ్చరచ్చే..
బుట్టబొమ్మ పూజా హెగ్డే.. ఇప్పుడు కన్నడకి పరిచయం కాబోతుంది. `కేజీఎఫ్` స్టార్ ఆమెని శాండల్ వుడ్‌కి పరిచయం చేయబోతున్నారు. ఇద్దరు కలిసి రొమాన్స్ చేసేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు.

`కేజీఎఫ్` చిత్రాలతో బాక్సాఫీస్‌కి చుక్కలు చూపించారు యష్. బాక్సాఫీస్‌కి కింగ్‌గా పేరు తెచ్చుకున్నారు. బాక్సాఫీస్ సీఈవో అని, కలెక్షన్లకి బాస్ అంటూ ఆయన్ని పిలవడం విశేషం. ఇటీవల విడుదలైన `కేజీఎఫ్ 2` ప్రపంచ వ్యాప్తంగా సంచలన విజయం సాధించడమే అందుకు నిదర్శనం. ఈ చిత్రం కలెక్షన్ల సునామీ సృష్టించింది. జెన్యూన్ కలెక్షన్లతో ఇండియన్ సినిమా రికార్డులను షేక్ చేసింది. `బాహుబలి` రేంజ్‌లో దూసుకెళ్ళి.
ఈ సినిమాతో యష్ పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగారు. ఇండియన్ బిగ్గెస్ట్ స్టార్స్ లో ఇప్పుడు ఆయన రెండో స్థానంలో నిలిచారు. `బాహుబలి`తో ప్రభాస్ మొదటి స్థానంలో నిలవగా, యష్ సెకండ్ పొజీషియన్‌కి చేరుకున్నారు. ఇప్పుడు ఆయన నుంచి ఎలాంటి సినిమా వస్తుందనే ఆసక్తి నెలకొంది. తాజాగా నర్తన్ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నారట యష్. ఇటీవల ఆయన కన్నడలో `మఫ్తి` సినిమాని తెరకెక్కించారు. ఈ కాంబినేషన్‌లో `యష్19`వ సినిమా తెరకెక్కబోతుంది.
ఇందులో కథానాయికగా పూజా హెగ్డే పేరు వినిపిస్తుంది. ఇప్పటికే తెలుగులో టాప్ హీరోయిన్‌గా నిలిచింది పూజా. చాలా మంది దర్శకులకు లక్కీ మస్కట్‌గానే పేరుతెచ్చుకుంది. హిట్ సెంటిమెంట్ కోసం స్టార్ డైరెక్టర్లు కూడా పూజాని రిపీట్ చేస్తున్నారు. ఆమెకి ఉన్న క్రేజ్ అలాంటిదని చెప్పొచ్చు.
అయితే ఈ బుట్టబొమ్మ ఇప్పటి వరకు తెలుగు, తమిళం, హిందీలో సినిమాలు చేసింది. ఇప్పుడు కన్నడకి పరిచయం చేయాలని భావిస్తున్నారు యష్. నార్తన్ దర్శకత్వంలో తాను నటించబోయే సినిమాలో హీరోయిన్‌గా పూజా హెగ్డే పేరుని పరిశీలిస్తున్నారు. ఆమెతో ఈ ప్రాజెక్ట్ కి సంబంధించిన చర్చలు కూడా జరిగాయని, ఆమె ఎగ్జైటింగ్‌గా ఉందని తెలుస్తుంది. కాకపోతే ఇంకా సైన్ చేయలేదని సమాచారం.
పూజా హెగ్డే వరుస విజయాలతో టాలీవుడ్‌లో లక్కీ హీరోయిన్‌గా పేరుతెచ్చుకుంది. పూజా ఉంటే హిట్ పక్కా అనే సెంటిమెంట్ అందరిలోనూ బలంగా నాటుకుపోయింది. దీంతో స్టార్ హీరోలంతా ఆమెనే కావాలనుకుంటున్నారు. స్టార్ డైరెక్టర్లు కూడా ఆమెని రిపీట్ చేస్తున్నారు.
అయితే ఇటీవల `రాధేశ్యామ్`, `బీస్ట్`, `ఆచార్య` చిత్రాలు వరుసగా పరాజయం చెందాయి. దీంతో పూజా గోల్డెన్ లెగ్ ట్యాగ్‌కి బీటలు పారాయని, ఇక ఆమె ఐరన్ లెగ్ అయిపోతుందని అంతా అనుకున్నారు. కానీ అవేవీ ఆమె సినీ అవకాశాలపై ప్రభావం చూపకపోవడం విశేషం. ఆమె కోసం భారీ ప్రాజెక్ట్ లు క్యూ కడుతుండటం మరో విశేషం.
మరి ఇండియన్ బాక్సాఫీస్ కింగ్‌గా పేరుతెచ్చుకున్న యష్‌కి బుట్టబొమ్మ గ్రీన్ సిగ్నల్ ఇస్తుందా అనేది చూడాలి. ప్రస్తుతం పూజా హెగ్డే తెలుగులో మహేష్-త్రివిక్రమ్ చిత్రంలో నటిస్తుంది. విజయ్ దేవరకొండ, పూరీ జగన్నాథ్ కాంబినేషన్‌లో రూపొందుతున్న `జేజీఎం`(జనగణమన) చిత్రంలోనూ నటిస్తుంది. అలాగే హరీష్ శంకర్-పవన్ సినిమాలో నటించబోతుంది. హిందీలో సల్మాన్ ఖాన్‌తో ఓ సినిమా చేస్తూ బిజీగా ఉంది. వీటితోపాటు మరో మూడు భారీ ప్రాజెక్ట్ లకు చర్చలు జరుగుతున్నట్టు తెలుస్తుంది.