నిర్మాత ఏక్తా కపూర్‌పై పోక్సో కేసు, రుజువైతే పెద్ద సమస్యే
మైనర్ బాలికలకు సంబంధించిన అసభ్యకరమైన దృశ్యాలను చూపించారన్న ఆరోపణలతో పోక్సో కింద ఆమెతోపాటు తల్లి శోభా కపూర్‌పై కేసు నమోదైంది.
POCSO case , Bollywood, Ekta Kapoor
పిల్లలపై అకృత్యాలను అడ్డుకోవడం కోసం ప్రభుత్వం పోక్సో చట్టాన్ని తీసుకొచ్చింది. వికృత చేష్టలతో పిల్లల జీవించే హక్కును హరించి వారికి ముప్పు వాటిల్లేలా చేస్తే ఈ చట్టం ద్వారా కఠినంగా శిక్షిస్తుంది. శారీరకంగా, మానసికంగా వారిని వేధిస్తే నిందుతులపై కేసు నమోదు చేసి చట్టపరంగా చర్యలు తీసుకుంటారు. తాజాగా ప్రముఖ బాలీవుడ్ నిర్మాత ఏక్తా కపూర్‌పై పోక్సో కేసు నమోదైంది.
కేసు వివరాల్లోకి వెళితే.. ఓటీటీ ప్లాట్‌ఫామ్ ఆల్ట్ బాలాజీలో ప్రసారమవుతోన్న ‘గంధీ బాత్ సీజన్-6’కు సంబంధించి ముంబయి పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ సిరీస్ ను బాలాజీ టెలిఫిల్మ్ లిమిటెడ్ బ్యానర్‌పై తెరకెక్కించారు. ఇందులో మైనర్ బాలికలకు సంబంధించిన అసభ్యకరమైన దృశ్యాలను చూపించారన్న ఆరోపణలతో పోక్సో కింద ఆమెతోపాటు తల్లి శోభా కపూర్‌పై కేసు నమోదైంది. కాగా, ఏక్తాకపూర్ ఈ ఏడాది లవ్, సెక్స్ ఔర్ ధోఖా-2 సినిమాకు నిర్మాతగా వ్యవహరించారు.
ముంబయి బోరివాలిలోని ఎంహెచ్‌బీ పోలీస్‌స్టేషన్‌లో ఓ వ్యక్తి ఈ ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. 2021 ఫిబ్రవరి-ఏప్రిల్ మధ్య ఆల్ట్ బాలాజీలో ప్రసారమైన గంధీభాత్ వెబ్ సిరీస్‌లో మైనర్ బాలికలను అభ్యంతరకర సన్నివేశాల్లో చూపించారని ఆయన పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో ఆరోపించారు.
అయితే, ఈ సిరీస్ ప్రసారం నుంచి వివాదం జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ వివాదస్పద ఎపిసోడ్‌ని యాప్‌లో స్ట్రీమింగ్ నుంచి తొలగించారు. గొప్ప వ్యక్తులతో పాటు సాధువులను సైతం అవమానించారని సదరు వ్యక్తి ఆరోపించారు. సన్నివేశాలు అభ్యంతరకరమని.. మనోభావాలు దెబ్బతీసేలా ఉందన్నారు.
పోక్సో నిబంధనలు ఉల్లంఘించే సన్నివేశాలు ఉన్నాయన్నారు. పోక్సోతో పాటు సమాచార సాంకేతిక చట్టం-2000, మహిళా నిషేధ చట్టం 1986, పొగాకు ఉత్పత్తుల చట్టం-2003 తదితర చట్టాలను ఉల్లంఘించినట్లు ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ ఏడాది సెప్టెంబర్‌లో పిల్లలకు సంబంధించి అభ్యంతర కంటెంట్‌పై సుప్రీంకోర్టు ఈ ఏడాది సెప్టెంబర్‌లో కీలక ఆదేశాలు ఇచ్చిన విషయం తెలిసిందే. పిల్లల అశ్లీల కంటెంట్ చూసినా.. డౌన్‌లోడ్ చేసినా, షేర్ చేయడం నేరమేననని స్పష్టం చేసింది.
2012లో వచ్చిన ఫోక్సో చట్టం (The Protection of Children from Sexual Offences Act, 2012) 18 ఏళ్లలోపు పిల్లలందరికీ లైంగిక వేధింపుల నుంచి రక్షణ కల్పిస్తుంది. 12 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న బాలికలపై అత్యాచారానికి పాల్పడే నిందితులకు కఠినమైన శిక్ష అమలయ్యేలా ఈ చట్టాన్ని రూపోందించారు . వారిపై అత్యాచారం పాల్పడ్డ దోషులకు మరణశిక్ష విధిస్తారు.